నిరీక్షణా యాగం - అచ్చంగా తెలుగు
  నిరీక్షణా యాగం
 వాసుదేవమూర్తి శ్రీపతి

నాలోని తమస్సుని తరిమే
నీ నవ్వులకై తపస్సు చేస్తున్నా
కొండెక్కిన ఆశలను వెలిగించే
నీ చూపుల ఉషస్సుకై చూస్తున్నా
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని
నిరీక్షణా యాగంలో సమిధలని చేస్తున్నా
తనువులోని ప్రతి అణువునీ ఒక మునిగా మార్చి
నీ నామ మంత్రాన్ని జపింపజేస్తున్నా
నా హృదయాన్ని నువు
నీ ద్వేషంతో కాలుస్తున్నా
ఇంకా నిన్ను ప్రేమిస్తూనేవున్నా.
 ***

No comments:

Post a Comment

Pages