ప్రాయోపవేశం - అచ్చంగా తెలుగు
 ప్రాయోపవేశం
వాసుదేవమూర్తి శ్రీపతి

కొన్ని జీవులని మనుషులు చంపుకు తినేస్తున్నారు
మరి కొన్ని మనుషులని చంపేస్తునాయి
ఇంకొన్ని వివిధ కారణాలవల్ల అంతరించిపోతున్నాయి
జీవజాతులు సమతుల్యాన్ని కోల్పోతున్నాయి


మనుగడ కోసం పోరాటంలో మనిషి గెలుస్తున్నాడు
మనుషుల మధ్య పోరాటంలో మానవత్వం ఓడిపోతోంది
స్వార్ధం అలంకరించుకున్న వేశ్యలా అందరినీ ఆకర్షిస్తోంది
మనసులు సమతుల్యాన్ని కోల్పోతున్నాయి


బాధ్యతలు నిద్రపోతున్నాయి
హక్కులు అమ్ముడుపోతున్నాయి
కొందరికి ఎంత తిన్నా ఆకలి తీరడంలేదు
కొందరు అర్ధాకలితో పూట గడుపుతున్నారు
మరికొందరు ఆకలితో ప్రాణాలు విడుస్తునారు
ప్రపంచపు ఆర్ధికస్థితి సమతుల్యాన్ని కోల్పోతోంది


పంచభూతాలలో
గాలీనీరు అమ్ముడుపోతున్నాయి
భూమి కోసం యుధ్ధాలు జరుగుతున్నాయి
అగ్ని మారణహోమం సృష్టిస్తోంది
ఆకాశం అన్నింటినీ చూస్తూ మౌనం వహిస్తోంది
సమస్త సృష్టి సమతుల్యాన్ని కోల్పోతోంది


అన్ని విధాలుగా కలుషితమైన ప్రకృతి
విపత్తుల రూపంలో ప్రాయోపవేశం చేస్తోంది.

*** 

No comments:

Post a Comment

Pages