నీకై వేచినా - అచ్చంగా తెలుగు
  నీకై వేచినా
 శ్రీపతి వాసుదేవమూర్తి 

చెలియా చెలియా
చెంతకొచ్చేయ్‌ చిరుగాలిలా

చెలియా చెలియా
కనులు కురిసెను నీకై ప్రియా

నువ్వు నవ్విన సవ్వడి
గుండె చేసిన సందడి
ఙ్ఞాపకాల అలజడి
విరహ శరముల ముట్టడి.

నేను ఏకాకినై కాలమే దాటనా
చూపునేమార్చుతూ గుండెనోదార్చనా
రెప్పమాటున శోకజ్వాలను
దాచి నీకై వేచినా...

ఆశ వీడని ప్రాణము
వెదికెనే నీ తీరము
వాడి రాలని పూవులా
బ్రతుకుతున్నది దేహము.

స్వప్న శకలాలనే
కుంచెగా మలచినా
గుండె శిధిలాలపై
నిన్ను చిత్రించినా
కనులు కురిసిన
కడలిలోనా నిన్ను శోధించనా....
 ***

No comments:

Post a Comment

Pages