నవ్వేశా - అచ్చంగా తెలుగు
నవ్వేశా
శ్రీపతి వాసుదేవమూర్తి 

నవ్వేశా......గట్టిగా నవ్వేశా
గుండెలనిండా గడ్డకట్టుకుని
ఉన్న విషాదం పగిలి
కళ్ళ నుండి పూర్తిగా
కారిపోయేవరకు నవ్వేశా.

ఇప్పుడు నా గుండెల్లో నువ్వూ లేవు
నీ కారణంగా అలముకొన్న దు:ఖమూ లేదు
ఇక నాలా నేను బ్రతుకుతా
నా కోసం నేను బ్రతుకుతా.

మంచివాడిని
అనిపించుకోవడం కోసం నటించను
 మంచితనాన్ని
నిలబెట్టూకోవడం కోసం ప్రయత్నించను.

ఎదుటివాళ్ళను
ఆనంద పరచడం కోసం బ్రతకను
నన్ను నేను హింసించుకుంటూ
 ఎవరినీ సంతోషపెట్టను.

నా అహంకారానికి మొహమాటం,
మంచితనం ముసుగులు వేయను
అన్నింటికన్నా ముఖ్యంగా ఇంకెప్పుడూ
ఎవరినీ ప్రేమించను.

 ***

No comments:

Post a Comment

Pages