జీవితం ఓ కానుక - అచ్చంగా తెలుగు

జీవితం ఓ కానుక

Share This
జీవితం ఓ కానుక
యామిజాల జగదీశ్

ఒకరిని నిర్దయగా నిష్కర్షగా ఓ మాట అనే ముందు ఒక్కమారు ఆలోచించాలి,
అసలు మాటలే రాని వారి గురించి

తినే ఆహారం ఏ మాత్రం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు ఒక్కమారు ఆలోచించాలి,
 అసలు పిడికెడు అన్నం కూడా దొరకని వారి స్థితి గురించి

భార్యనో లేదా భర్తనో తిట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి, 
తనకొక తోడు ఇవ్వమని దేవుడికి మొరపెట్టుకోవడం గురించి

జీవితాన్ని జీవించడానికి మరిన్ని సంవత్సరాలు ఇవ్వవేంటీ అని నిందించే ముందు ఒక్కసారి ఆలోచించాలి
 అకాల మరణంతో నీకన్నా ముందే పైలోకానికి వెళ్ళిపోయిన వారి గురించి

నువ్వుంటున్న ఇల్లు చెత్తగా ఉందని ఫిర్యాదు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి 
అసలు ఉండేందుకు గూడు లేక ఓ రోడ్డు పక్కన బతుకుతున్న వారి గురించి

పిల్లల గురించి ఫిర్యాదు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి 
ఒక్క బిడ్డనైనా తమకు ప్రసాదించమని దేవుడితో మొరపెట్టుకుంటున్న వారి గురించి

ఓ వాహనంలో పోతూ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? 
 అని నిన్ను నువ్వు తిట్టుకునే ముందు ఒకసారి ఆలోచించాలి 
నువ్వే వెళ్తున్న చోటికే ఏ వాహనమూ లేకుండా కాలి నడకన పోతున్న వారి సంగతేమిటని...

నీకిచ్చిన పనిని చేస్తున్నప్పుడు విసుగేసి ఛీ వెధవ ఉద్యోగం అని 
సహనం కోల్పోయి మాటలు అనుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి, 
అసలు ఉద్యోగమే లేకుండా నానా అవస్థలు పడుతున్న వ్యక్తి గురించి

ఒకరిని వేలెత్తి చూపే ముందరో లేక నిందించే ముందరో ఒక్కసారి ఆలోచించాలి 
మనం ఒక్క తప్పు కూడా ఇప్పుడున్న స్థితిలో ఉన్నామా అని...

మనసు నలిగి ఆలోచనాశక్తి కోల్పోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు 
ఓ నవ్వు నవ్వడం అలవరచుకో...
అంతేకాదు, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకో 
ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా ఇంకా నిలబడే ఉన్నందుకు

జీవితం ఓ కానుక కనుక బతకాలి
బతికి చూపాలి
పండగ చేసుకోవాలి
ఉన్నది ఉన్నట్టు స్వీకరించి సంతృప్తి చెందగలిగితే
 అంతకన్నా ఇంకేం కావాలి ఈ జీవితానికి?

***

No comments:

Post a Comment

Pages