సెల్ఫ్ డిసిప్లీన్ - అచ్చంగా తెలుగు
సెల్ఫ్ డిసిప్లీన్
ప్రతాప వేంకట సుబ్బారాయుడు 

పిల్లలూ మీరు మీ నాన్నగారితోనో, అమ్మతోనో పోస్టాఫీసుకో, బ్యాంకుకో వెళితే అక్కడ ఎవరో మరొకర్ని పెన్నిస్తారా? అని అడగడం మీరు చూసే ఉంటారు. కదూ! అది చాలా తప్పర్రా! అక్కడికి వస్తున్నప్పుడు పెన్నవసరం వస్తుందని వాళ్లకి తెలియదా? తెలుసు అయినా నిర్లక్ష్యం. ఎవరో ఒకరు ఇవ్వక పోతారా అన్న ధీమా.
మీరు మాత్రం అలా ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్లే ముందు ఏవేం అవసరమవుతాయో ముందే చూసుకోండి. 
ఇంట్లోంచి బయలుదేరే ముందు వర్షాకాలం, ఎండాకాలం అయితే గొడుగు తీసుకెళ్లడం మంచిది. అలాగే సంచి. ఎప్పుడే అవసరం వచ్చి కొంటామో తెలియదు కదా! మీరు చిన్న పిల్లలు కాబట్టి అమ్మావాళ్లకు గుర్తుచేయండి.
మీరు స్కూలుకి వెళ్లేప్పుడు పెన్సిలు, పెన్ను, కావలసిన పుస్తకాలు, కంపాస్ బాక్స్ అన్నీ చూసుకోండి. తీరా స్కూళుకు వెళ్లాక వాళ్లనీ వీళ్లనీ అడగడం ఏం బావుంటుంది. వాళ్ల దగ్గర ఉంటాయో లేవో తెలీదు. ఉన్నా ఇస్తారో లేదో తెలీదు. అడగడంలో మన సమయమూ వృధా అవుతుంది.
ముఖ్యంగా పరీక్షల్లాంటివాటికి వెళ్లేప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. 
ఏదైనా అవసరంతో ఊళ్లకెళ్లేప్పుడూ మన వస్తువులు జాగ్రత్తగ చూసుకోవాలి. మన క్లాసు పుస్తకాలూ మనతో ఉండాలి. ఎందుకంటే అక్కడికెళ్లి ఆటపాటలతో కాలం గడపకుండా, మన సబ్జెక్ట్స్ నూ చదువుకోవాలి. ఎందుకంటే మనం క్లాసుకు వెళ్లనప్పుడు జరిగిన లెసన్స్ ప్రాక్టీసు చేస్తేనే అప్ టు డేట్ అవుతాం. లేదంటే వచ్చాక వెనకబడి ఉంటాం.        
ఇదంతా సెల్ఫ్ డిసిప్లీన్. సెల్ఫ్ డిసిప్లీన్ పాటిస్తే లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. జీవితంలో పైకొస్తాం.  
ఉంటానర్రా!
మీ సుబ్బు మామయ్య.

                

No comments:

Post a Comment

Pages