ఈ వెన్నెలకి - అచ్చంగా తెలుగు
ఈ వెన్నెలకి
సుజాత తిమ్మన ..

వన్నె వన్నెల వలపులన్నీ విరుపులై 
ఎదగాయాలకు కారణమవుతున్నాయి...
కురులలో ఒదిగి ముద్దులాడుతున్న విరులన్నీ 
గుస్ గుసల గోల చేస్తున్నాయి..
స్వప్న లోకాల కలల జలకాలాడు కనులు
విభుని చూపులకై తపిస్తున్నాయి ..
పరువపు పొంగులను దాయను సాయం చేయలేని పైట 
చిరుగాలికే రెపరెపలాడుతుంది ...
వేగంగా కొట్టుకుంటున్న గుండెని సమాదానపరచలేక తనువు ..
చేరువగా లేని చెలునికై విరహిస్తుంది ..
మబ్బుల్లో నుంచి కొంటె చందమామ 
తొంగి తొంగి చూస్తూ...
ఈ అందాలన్నీ ఆబగా తాగేస్తున్నాడు..
అందుకే పున్నమి చంద్రుని నుంచి జాలువారుతూ ..
పుడమంతా పరుచుకున్న ఈ వెన్నెలకి ఇన్నిజిలుగుల  సొగసులు కామోసు..!!
************  

No comments:

Post a Comment

Pages