గురజాడ అప్పారావు గారి కధానిక - "దిద్దుబాటు"- సమీక్ష - అచ్చంగా తెలుగు

గురజాడ అప్పారావు గారి కధానిక - "దిద్దుబాటు"- సమీక్ష

Share This
గురజాడ అప్పారావు గారి కధానిక - "దిద్దుబాటు"- సమీక్ష
అంబడిపూడి శ్యామసుందర రావు  

గురజాడ అప్పారావు గారి పేరుచెప్పగానే తెలుగు వారికి గుర్తువచ్చేది కన్యాశుల్కము నాటకము, "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయి "అన్న దేశ భక్తి(1910 వ్రాసిన) గీతము. తెలుగు సాహిత్యములో గురజాడ వారిది చాలా ప్రత్యేకమైన పాత్ర తెలుగు సాహిత్యాన్ని గురజాడకు ముందు గురజాడ తరువాత  రెండు భాగాలుగా  విభజించవచ్చు గురజాడకు ముందే నన్నయ లాంటి కవులు రాజుల ప్రాపకములో ఉంది వారు కోరిన విధముగా పౌరాణికాలు, ఇతిహాసాలు,శృంగార కావ్యాల రచన వరకే పరిమితి అయినారు వారికి సామాజిక సమస్యల ఇతివృత్తముగా రచనలు చేసే అవకాశము ఉండేది కాదు అటువంటి పరిస్తుతులలో గురజాడ అప్పటి సమాజములోని దురాచారాలను ప్రజల దృష్టికి తెస్తూ ప్రజలను చైతన్య వంతులుగా చేసే భాగములోనే కన్యాశుల్కము రచన సాగించారు  ఆనాటి సమాజములో ముక్కుపచ్చలారని చిన్న ఆడపిల్లలను కాటికి కాళ్ళు జాపుకున్న వృద్దులు కన్యాశుల్కము పేరిట కొంత సొమ్ము ఆడపిల్ల తండ్రికి చెల్లించి ఆడపిల్లలను కొనుక్కునే వారు.కన్యాశుల్కము నాటకములో  పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పాట  తెలుగు వారికి బాగా సుపరిచితమే ఆ పాట ఆనాటి సామాజిక పరిస్తుతులకు అద్దము పడుతుంది.కన్యాశుల్కము ఆధునిక తెలుగు సాహిత్యానికి అదికావ్యము లాంటిది అనటంలో ఏమి అతిశయోక్తి లేదు. ఇది గురజాడ వ్రాసిన మొట్ట,మొదటి తెలుగు రచన కూడా 
గురజాడ వారి రచనలలో సామాజిక స్పృహా కనిపిస్తుంది ఏ నాటకము వ్రాసిన కధ వ్రాసిన వాటిలో ఆనాటి దేశకాల పరిస్తుతులను ప్రతిబింబించేటట్లు అయన రచనలు కొనసాగినాయి కాబట్టి అయన రచయిత గా కన్నా సంఘ సంస్కర్త గా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆనాటి స్వతంత్ర పోరాటానికి మద్దతుగా ప్రజలలో దేశభక్తిని పెంపొందించే విధముగా అయన వ్రాసిన దేశభక్తి గీతము,"దేశమంటే మట్టి కాదోయ్,దేశమంటే మనుషులోయి " ఈ గీతములో ఎటువంటి మనుషులు దేశానికి అవసరమో  చెపుతాడు "యీసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి" అని ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా,"వొట్టి గొప్పలు చెప్పుకోవడం మాని ,పూని యేదైనా మేల్ కూర్చి జనులకు చూపమని"ప్రజలకు సలహా ఇస్తాడు. అంతటితో ఆగకుండా సొంత లాభము కొంతమానుకొని పొరుగువారికి తోడ్పడ మని, అన్నదమ్ములవలె జాతులు మతములు కలిసి మెలిసి మెలగాలని  ప్రభోధిస్తాడు ఇటువంటి సాహిత్యము దేశ శ్రేయస్సు కోసమే ఈ గీతము అంతర్గత భావాలు, దేశ ఆర్ధిక,దేశ సమైక్యత ,మత సామరస్యము వంటి అంశాలను ప్రభోదిస్తుంది గురజాడ ఆరాటం అంతా మంచిని పెంచటం కోసమే. దేశానికి మేలు చేయటానికి అయన ఉపయోగించిన సాధనాలు భాషాసాహిత్యాలే  ఈ విధముగా ప్రజల వాడుకలో లేని ప్రాచీన కఠిన భాషా సాహిత్యల హోరు తగ్గి,  వ్యావాహారిక  భాష వాడటం ప్రారంభమయింది 
భాష సాహిత్యాలే  కాకుండా  కళలన్ని దేశ శ్రేయస్సుకు బహుజన హితానికి సాధనాలుగా ఉపయోగ పడాలని త్రికరణ శుద్ధిగా నమ్మిన సంఘ సంస్కర్త గురజాడ అంతే కాకుండా గిడుగు రామమూర్తి గారి వ్యావహారిక భాషోద్యమానికి  అంకురార్పణ  చేసిన ఘనత కూడా గురజాడదే.  తనకు సమాజము పట్ల భాద్యత ఉన్నదని తనది ప్రజాఉద్యమము అని ఆచరణలో చూపించిన ఘనుడు గురజాడ. 
దిద్దుబాటు అనే కధానిక 1910 ఫిబ్రవరిలో ఆంధ్రభారతి అనే పత్రికలో ప్రచురించబడింది. ఈ కధలోని విషయము,ఆనాటి కాలానికి అప్పటి జీవితానికి సంబంధించినది. వ్యభిచారము ఒక వృత్తిగాను అటువంటి వారిని ఒక కులము గాను పరిగణించే కాలము నాటి కద ఇది. అప్పట్లో వేశ్యా వ్యామోహము డబ్బున్న వారి లోను, విద్యావంతుల లోను ప్రబలముగా ఉండేది. వేశ్యా సంపర్కము ఒక ఘనకార్యముగా చెప్పుకొనేవారు అటువంటి వేశ్యా వ్యామోహములో పడిన భర్తను భార్య ఏవిధముగా సరిదిద్దింది అనేదే ఈ కదాంశము అందుకే ఈ కధకు దిద్దుబాటు అనే పేరును గురజాడ పెట్టారు. దీనిలోని పాత్రల సంభాషణలు పాత్రోచితమైన వాడుక భాషలోనూ,కదా కధనం సులభ గ్రాంధికము లోను ఉంటాయి.ఇందులో పాత్రలు గోపాల రావు, కమలిని భార్య భర్తలు,రావుడు ఇంటి పాలేరు. 
కథానాయకుడైన గోపాలరావు సానిదాని ఇంటికిపోయి పాటల సరదాలో పడి రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరతాడు ఆలస్యముగా ఇంటికి చేరినందుకు భాధ పడుతూ ఇంకా రేపటి నుండి పెందరాళే ఇంటికి చేరాలి అని నిర్ణయానికి వస్తాడు.తలుపు తడతాడు కానీ ఏవిధమైన అలికిడి ఉండదు తలుపు కొద్దిగా నెట్టగానే తలుపు తెరుచుకుంటుంది నడవ లో దీపము ఉండదు. మంచము దగ్గరకు పోయి భార్య కమలిని నిద్రపోతుందేమో అని చూస్తే భార్య మంచము మీద కనిపించదు గది అంతా వెతుకుతాడు భార్య కనబడక పోయేసరికి  మనస్సులో ఆందోళన మొదలవుతుంది వీధి గుమ్మము చేరి చుట్టకాల్చుకుంటూ విశ్రాన్తిగా కూర్చున్న పాలేరు రాముడిని కోపంగా,"మీ అమ్మేదిరా?"అని అడుగుతాడు, దానికి వాడు ,"మా యమ్మా?  యింటున్నది బాబు",అని వినయముగా సమాధానము చెపుతాడు "మీ అమ్మ కాదురా  బుద్ధిహీనుడా నాభార్య" అని కోపముగా అడుగుతాడు. ఇంట్లోనే పడుకొని ఉంటారు చుడండి అని సలహాయిస్తాడు ఈ సలహాకు కోపము వచ్చిన గోపాలరావు రాముడి వీపు మీద రెండు గుద్దులు గుద్ది ఇంట్లో లేదు అని దిగులుగా అంటాడు. గోపాలరావు చెడ్డ పని చేసినప్పటికీ జ్ఞానము తెచ్చుకొని రాముడిని సముదాయించి,"రామా ఏమాయెరా ?అని దైన్యము అడుగుతాడు. 
అలిగి పుట్టింటికి వెళ్లిఉంటుందేమో అన్న అనుమానాన్ని రాముడి ముందు వ్యక్త పరుస్తాడు గోపాలరావు  చదువునేరిస్తే ఇలాంటివే అవుతాయని తన అభిప్రాయాన్నిఅయ్యగారి ముందు రాముడు వెలిబుచ్చుతాడు కానీ గోపాలరావు," విద్య విలువ నీకేం తెలుసురా", అని రాముడిని కోప్పడి ఆలోచనలో పడ్డాక కమలిని చేతివ్రాతతో ఒక ఉత్తరము కనిపిస్తుంది హాడావుడిగా ఆ ఉత్తరము తీసుకొని చదవటం ప్రారంభిస్తాడు అయ్యా అని సంబోధన చూసి ప్రియా పోయి అయ్యా వచ్చె నా అని బాధపడతాడు "పెయ్య(ఆడది) పోయిందా బాబు?'అని ఆందోళనగా అయ్యగారిని రాముడు అడుగుతాడు అసలే చికాకు బాధలో ఉన్న అయ్యగారు ,"మూర్ఖుడా ఊరుకో "అని కసురుకొని ఉత్తరము చదవటం మొదలుపెడతాడు. 
ఉత్తరము సారాంశము ఏమిటి అంటే "మీటింగులని పేరుచెప్పి గత పది రోజులుగా ఇంటికి ఆలస్యముగా రావటము వల్ల మీ రాకను నేను గమనించుట లేదు లోకోపకారము నిద్రకూడా మాని చేస్తున్నట్లు నాతొ చెపుతున్నారు కానీ అసలు నిజము నేను తెలుసుకున్నాను నేను ఇక్కడ ఉండటం వల్ల మీ స్వేచ్ఛకు ఆటంకము కలిగిస్తున్నాను మీరు అబద్దాలు చెప్పవలసి వస్తుంది అందువల్ల నేను మా పుట్టింటికి పొతే మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు అబద్దాలు అడే అవసరము ఉండదు నేను ఈ రాత్రికే మా కన్నవారింటికి వెళుతున్నాను ఏ మాత్రము ప్రేమ మిగిలి ఉన్నా దయ ఉంచుము "
ఉత్తరము చదవటం ముగించిన గోపాలరావు ,"నేను పశువును, శుద్ద పశువును,గుణవతి,విద్యానిధి,వినయ సంపన్నురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసింది "అని రాముడి ముందు వాపోతూ భార్య పుట్టింటికి వెళ్ళింది అన్న సంగతి చెపుతాడు "నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా?"అని ప్రశ్నిస్తాడు  "నన్ను తొంగున్నాను బాబు అడదయినా చెప్పకుండా పుట్టింటికి ఎల్తానంటే చెంపలాయించి కూకోబెట్టాలి గాని మొగారిలాగా ఈ రాతలు ఏంటి బాబు ఇడ్డురము ?" అని రాముడు తన అభిప్రాయాన్ని చెబుతాడు 
"ఓరి మూర్ఖుడా భగవంతుడి సృష్టిలో కెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీరత్నమే శివుడే పార్వతికి సగము  ఇచ్చాడు ఇంగ్లీషు వాడు భార్యను బెటర్ ఆఫ్ అన్నాడు అంటే పెళ్ళాము మొగుడికన్నా దొడ్డది బోధపడిందా?"అని గోపాలరావు రాముడికి బోధిస్తాడు. అన్ని విన్న రాముడు ,"నాకేమి భోధ పడ లేదు బాబు "అంటాడు "నీ కూతురు బడికి వెళుతుందికదా విద్య విలువ నీకు క్రమంగా తెలుస్తుందిలే, ఆ మాట అలా ఉండనివ్వు నీవు చంద్రవరం వెళ్లి కమలిని తీసుకురా ఏమి జెప్పాలో తెలిసిందా?"అని గోపాలారావు రాముడితో అంటాడు రాముడు "బాబుగారు నా ఈపు పగలేసినారు మీరు రండమ్మా అంటాను" అని చెపుతాడు "దెబ్బల మాట మరచిపో కొట్టినందుకు రెండు రూపాయలు ఇస్తాను మరెన్నడు ఆ ఉసెత్తకు అమ్మగారితో నీవు చెప్పవలసిన మాటలు జాగ్రత్తగా విని అక్కడ చెప్పు నీవు చెప్పవలసినది ఏమిటి అంటే పంతులుగారికి బుద్ధి  వచ్చింది ఇక ఎన్నడూ సానుల పాత వినరు రాత్రులు ఇల్లు కదలరు మిమ్మల్ని గెడ్డము పుచ్చుకొని బతిమాలుకున్నానని చెప్పామన్నారు ఇది  ఖరారు మీరు లేని రోజు ఒక యుగముగా గడుపుతున్నారు అని నిపుణత చెప్పు తెలిసిందా ?"అని గోపాలరావు రాముడితో చెపుతాడు. "అన్నివివరముగా చెప్పానుకదా నీవు ఏమి చెపుతావో ఒకసారి నాకు చెప్పు" అని రాముడితో అంటే, "బాబు ఆదంతానాకు తెలవదు నానంతాను  అమ్మా మాట ఇనుకొండి ఆడోరు యజమాని చెప్పినట్టు యిని వల్ల కుండాలి లేకుంటే మాపెద్ద పంతులార్లగా అయ్యగారు కూడా సానమ్మను ఉంచుకుంటారు మీ సెవులో మాట పట్టంలోకి బంగారు బొమ్మ లాంటి సానమ్మ వచ్చింది ఆ పైన మీ సిత్తము అంటాను అని రాముడు అనగానే, "ఓరి వెధవా "అని కుర్చీలోంచి లేస్తుండాగా రాముడు తప్పుకున్నాక మంచము క్రింద నుండి కమలిని కలకల నగవు,కర కంకణముల చప్పుళ్ళు గోపాలరావు చెవులను తాకినాయి ఆ విధముగా కమలిని తన భర్తకు బుద్ధి చెప్పిదిద్దుబాటు చేస్తుంది. 
***              . 

No comments:

Post a Comment

Pages