జోక్స్ - అచ్చంగా తెలుగు
జోక్స్.. జోక్స్.. జోక్స్
సేకరణ: చెన్నూరి సుదర్శన్.

ఒకడు కంటి జబ్బుతో కళ్ళ డాక్టరు వద్దకు వెళ్ళాడు.
పేషంట్: డాక్టరు గారు.. నాకీ మధ్య ఒక్కరిని  చూస్తుంటే ఇద్దరు కనబడుతున్నారు.
బిక్క మొహమేసి చెప్పాడు పేషంట్.
కళ్ళ డాక్టరు: ఇది చెప్పడానికి మీరు నల్గురు రావాలా?
అంటూ కసురుకున్నాడు డాక్టర్.
***
ఒక యువకుడు  మండలాఫీసులో పనుండి ఒక ఊరు వెళ్ళాడు. ఆఫీసులో పని కాలేదు. మరునాడు రమ్మన్నారు. ఒక్క రోజు కోసం మళ్ళీ ఊరెళ్ళి రావడమెందుకు?.. బస్సు కిరాయలు దండగ. ఈ ఒక్క రాత్రి ఎవరింట్లో అయినా తల దాచు కోవడం సరిపోతుంది. అనుకొని ఊరిలో అడుగు పెట్టాడు. 
ఒక ఇంటికి వెళ్లి “అమ్మా నేను ఆఫీసులో పనుండి వచ్చాను. పని గాలేదు.. రేపు  
రమ్మన్నారు. నాకు ఈ ఊళ్ళో తెలిసిన వారెవరూ లేరు. రాత్రికి మీ ఇంట్లో కునుకు తీసి  తెల్లవారు ఝామున్నే వెళ్ళిపోతాను” అంటూ వేడుకున్నాడు. దానికామె “ బాబూ నువ్వు పడుచు పిల్లవాడివి. మా ఇంట్లో పెళ్ళీడుకొచ్చిన అమ్మాయి ఉంది. మా ఇంట్లో ఉంటే మాకు చెడ్డ పేరు వస్తుంది. మరో ఇల్లు చూసుకో..” అంటూ తిరస్కరించింది. 
ఇలా ఇంటింటికి  వెళ్ళి తాను వచ్చిన పని చెప్పడం.. పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్నారని తిరస్కరించడం.. విసిగి పోయాడు. ముందే పెళ్ళీడుకొచ్చిన పిల్లలు ఉన్నారో ? లేదో ? కనుక్కొని  తలదాచుకునే విషయం చెబితే సరి.. అనుకున్నాడు. 
ఒక ఇంటికి వెళ్లి తలుపు దబా.. దబా బాదాడు. 
గుమ్మం భళ్ళున తెరుచుకొంది..ఎదుర్గా మీసాలు వడిదిరిగిన ఒక వస్తాదు..
“మీ ఇంట్లో పెళ్ళీడుకొచ్చిన అమ్మాయిలున్నారా సార్..”
“ఏం.. ఎందుకు?”
“రాత్రికి మీ ఇంట్లో పండుకుందామని” 
ఈడ్చి తన్నాడు వస్తాదు.. దిమ్మ తిరిగి వీధిలో  పడిపోయాడు యువకుడు. కళ్ళు తెరచి చూస్తే తెల్లవారిపోయింది.   
***
పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగుతున్నట్లు సీసేశ్వర్ మందు తాగుతున్నప్పుడల్లా కళ్ళుమూసుకొని తాగుతూ ఉండటం గమనిస్తూ అడిగాడు అతడి శిష్యుడు పెగ్గుమూర్తి.
          పెగ్గుమూర్తి: గురువుగారూ మీరు మందు కొడ్తున్నప్పుడలా ఎందుకలా కళ్ళు మూసుకుంటున్నారు?
          సీసేశ్వర్: శిష్యా నాకు మందు చూస్తే నోట్లో నీళ్ళూరుతాయి. మందు  పలుచనై పోదూ...
***
జాని భోరున ఏడ్చుకుంటూ ఖాజా  ఇంటికి వచ్చి నెత్తీ నోరు బాదుకో సాగాడు. 
“మేరా దోస్త్ ఖాజాను  అప్పుడే ఖననం చేసారా.. నేను ఆఖరి చూపుకు కూడా నోచుకోలేని దౌర్భాగ్యుణ్ణి..” అంటూ మరింత ఏడ్పు సౌండు పెంచాడు. 
ఖాజా తమ్ముడు:  జానీ  నీకు మతిపోయిందా.. ‘ఖాజా భాయ్ అజ్మీర్ గయా’.. అని నేనే గదా నీకు టెలీగ్రామిచ్చాను.
అప్పుడు జాని తనకొచ్చిన   టెలీగ్రాం చూపించాడు.  
           అందులో ఇలా ఉంది.. ‘ఖాజా ఆజ్ మర్ గయా’
***
డిగ్రీ పరీక్షలు రాసిన ఒక విద్యార్థి తెలుగులో తనకు తక్కువ మార్కులు వచ్చినందుకు ‘వ్యక్తిగత నిర్దారణ’ కు దరఖాస్తు చేసుకున్నాడు.  
అతడి సమాధాన పత్రాన్ని మూల్యాంకనం చేసిన నిపుణుడు ఒక షరతు పెట్టాడు.
నిపుణుడు: ‘రాముని భార్య సీత’ అని రాసి చూపించు. అందులో  తప్పు లేకుండా రాసిన అక్షరాలకు పదింతలు       మార్కులు అవార్డు చేస్తాను.
   విద్యార్థి: అదేంది సార్.. నన్ను మరీ దద్దమ్మను చేస్తున్నారు 
అంటూ ఇలా రాసి చూపించాడు.
‘రమన బర సతై’                                          
***

ముత్తయ్యకు  ‘బ’  పలకడం రాదు. ‘బ’ ను ‘ప’ అని పలుకుతూ ఉంటాడు.
ఒక నర్తకిని అభినందించే సభలో ముత్తయ్య  మాట్లాడుతూ..
“ఇంత చిన్న వయసులోనే ఈ నర్తకికి రెండు గొప్ప  ‘పిరుదులు’ రావడం చాలా సంతోషంగా ఉంది”
సభ గొల్లుమంది. పక్కనుండి సభాధ్యక్షులు ‘బిరుదులు’ అని గుస, గుసలాడాడు.  
ముత్తయ్యకు అర్థం కాలేదు.     ***

No comments:

Post a Comment

Pages