మృత్యుంజయుడు - అచ్చంగా తెలుగు

మృత్యుంజయుడు

Share This
మృత్యుంజయుడు 

సత్యం. ఓరుగంటి 

అస్పష్టమైన  కదలిక ,  ఆలోచనలకు  అంతరాయం ,  ఎవరో గట్టిగా పిలుస్తున్నారు  (అరుస్తున్నారు), ఇంకెవరినో  చూపిస్తున్నారు , ఎవరొచ్చారో  చూడు ? పేరు చెప్పు.
ఎవరో చూసిన ముఖం లాగే అనిపిస్తోంది ఎవరో తెలియడం లేదు .
చిన్న మగత, మాటలు వినిపిస్తున్నాయి ,మంచం లో చెయ్యలేక పోతున్నాం , ఎవరిని గుర్తు పట్ట లేకపొతున్నారు.  మీ వొదిన నేను అమెరికా వెళ్ళాలి , పెద్ద వాడి దగ్గరకి,  కొన్నాళ్ళు నీ దగ్గర పెట్టుకోకూడదు నాన్నని ? నేను చూసుకో గలను కాని  బావగారు ఒప్పుకోరు, అన్నా చెల్లెళ్ళు  మాట్లాడుకొంటున్నారు.
రూమ్ లో చల్లగా ఉంది స్ప్లిట్ ఎ.సి శబ్దం మెల్లగా వినిపిస్తోంది, ఇంటిలో ఒక రూమైనా ఎ.సి చేసుకొని హాయిగా నిద్రపోవాలి అనుకునే వాడు , ఇప్పుడు 24 గంటలూ ఎ.సి రూమే కాని హాయి లేదు నిద్రాలేదు 
ఆకలేస్తే నర్సులకి  సైగ  చేస్తున్నాడు పట్టించుకోవడం లేదు, సొంత మనుషులా ఇంటి  దగ్గర ఉన్నప్పుడే దగ్గరికి రావటం మానేశారు , ఇప్పుడు సరే సరి ,,  
ఒకటి , రెండు నాతోనే , డైపర్ లోనే, నర్సులకి  సైగ  చేసిన పట్టించుకోరు 
నా సౌకర్యం కోసం మార్చరు, వాళ్ళకి వీలైనప్పుడు మారుస్తారు. చాలా  అసహ్యంగా ఉంది 
భగవాన్  నాకెందుకీ శిక్ష ? 
మరి  సంతోషాలు , నచ్చినవి పొందడాలు, అప్పుడు  భగవాన్ నాకెందుకు ఇవన్నీ  ఇస్తున్నావ్  అని అడగలేదే ? 
ఆకలి, ఒకటి , రెండూ  అన్నీ  నావే కదా? నా భాదలకీ  భగవంతుడికి ఏమి సంభందం ?
ఇదేనా  వైరాగ్యమంటే ? ఇన్నాళ్ళు  పుస్తకాల్లో చదివినా, ఎవరెంత విడమరచి  చెప్పిన  అర్ధం కాలేదే ?
ఇప్పుడు అర్ధం అవుతోంది. మరి ఇవన్నీ నిజమైనప్పుడు భగవంతుడు కూడా నిజమేనా ?
నిజమైతే నన్ను ఎందుకు రక్షించడు ? 
మనసు భాధ పడింది ఏమి చెయ్యలేక మరల ఆలోచనలో పడింది. ఎవరో పిలుస్తున్నారు ఎవర్ని నన్నే ఆ నిన్నే , 
ఎందుకు ? 
అలా  పార్క్  వరకు  వెళ్లి వద్దాం , 
నేను నడవ గలనా ? 
వస్తున్నావ్  కదా  అదుగో పార్కు , అవును  నిజమే, కాని మంచం లోంచీ లేవలేను అనుకున్నాను ? అదేంటి ?  అది కల అవును నిజమే పార్కు  వరకు వచ్చేసాం.  అందరూ  వాకింగ్  చేస్తున్నారు , పిల్లలు ఆడుకుంటున్నారు, కొందరు కూర్చొని  కబుర్లు  చెప్పుకుంటున్నారు.  ఆహా ఎంత  హాయి గా ఉంది . ఇల్లు గుర్తుకొచ్చింది ఇంటికి బయలు దేరేడు, మద్యలో ఎడమ ప్రక్కనే పెద్ద ఇల్లు, ఇంటి ముందు  కారు, సుందరం ఇల్లు, సుందరం తనతోనే చదువుకున్నాడు, వాళ్ళకి పెద్ద బట్టల  షాపు ఉంది, బాగా  డబ్బు  ఉన్నవాళ్ళు, చిన్నప్పుడు ఏది కొనుక్కోవాలన్నా వాడె  కొని పెట్టె వాడు, అన్ని డబ్బులు ఎక్కడివి అంటే మా నాన్నా  ఇచ్చేడు అనే వాడు, అలాంటి  నాన్న  ఉండాలి, చాలా డబ్బు ఉండాలి  అని చాలా సార్లు అనుకున్నాను.  ఒక్క సారి వాళ్ళ ఇంటిలోనికి  వెళ్ళాలి, అదో సరదా, లోనికి వెళదాం, పెద్ద  కాంపౌండ్ , మద్యలో పెద్ద ఇల్లు  మెయిన్  డోర్  తెరిచే ఉంది, లోనికి వెళ్ళేడు, ఇదేంటి  నా ఇష్టం  వచ్చినట్లు వెళుతున్నాను ? ఇంత  సంతోషం గా  ఉన్నాను  కల  కాదు కదా ? అంకుల్ నాన్నగారి  గది  ఇటువైపు సుందరం పెద్ద కొడుకు అశోక్ చెబుతున్నాడు, కల  కాదు కలయితే అశోక్ ఎందుకు కనిపిస్తాడు,  లోపలి గది లోనికి వెళ్ళేడు, సుందరం మంచం పై కూర్చున్నాడు, వాళ్ళావిడ  కొంచెం  జ్యూస్  తీసుకోండి అని గ్లాస్  అందిస్తోంది, వద్దులేవే చిన్న నీరసానికి ఎక్కువ చేస్తున్నావ్, లేదు నాన్నా జ్యూస్  తీసుకోండి నీరసం  తగ్గుతుంది అని సుందరం  చిన్న కొడుకు అనిల్  వాళ్ళ  అమ్మని సప్పోర్ట్  చేస్తూ అంటున్నాడు.  పిల్లలంటే ఇలా ఉండాలి, డబ్బు, కారు, బంగాళా ఉండాలి, 
అన్నీ ఉంటాయి లే  పద పద , 
ఎవరూ ? నేనే ? 
ఓహో నా  ఆలోచనేనా ? అయినా ఇవన్ని  అంత  ఈజీ  గా  వస్తాయా ? 
వస్తాయి, మళ్ళీ  ఎవరు ? 
నాలో  నేనే ఓహో అయితే ఒకే . 
ఇంతకీ  ఎలా  వస్తాయి ?  
నువ్వొక  పెద్ద  పని చెయ్యాలి , 
ఎంత  పెద్ద  పని అయినా  చేస్తాను నాకు  బంగాళా, కారు  ఎక్కువ డబ్బులు  కావాలి, 
సర్లే సామీ, చేస్తావా ?   
చేస్తాను చెప్పు ,  
ఇద్దరు  పిల్లలికి  సహాయం చెయ్యాలి , 
అంతేనా ? 
నాకు  చాలా  డబ్బులు  వస్తే  ఎందుకు  సహాయం  చెయ్యను ? 
ఒక  వేళ  అన్ని  డబ్బులూ  ఇచ్చేయాల ? 
కాదు కాదు అస్సలు  డబ్బులు సహాయం  అవసరం లేదు , 
నువ్వు  స్వయంగా  సహాయం  చెయ్యాలి , 
ఓస్  అంతేనా, ఎప్పటికీ  చెయ్యాలి , 
పెద్ద  పని అన్నావ్ , చిన్నదే  గా , 
ఏమో  నీకు  ఒకే  నా ,  
డబల్  ఒకే , ఎక్కడైనా  సంతకం పెట్టాలా ? 
అక్కరలేదు మనసులో ఫిక్స్ అయితే చాలు, ఫిక్స్ అండ్ సేవ్, సేవ్ అంటే వన్స్  ఫర్ అల్, నో ఎడిట్  ఒకే నా ?  
డబల్  ఒకే. 
అవునూ నేను ఎవరితో  మాటలడుతున్నాను నాలో  నేనే. ఎంత  మంచి కల, 
అవును కలే,  కాకపోతే  అంత ఆదృష్టం నాకా?, 
కొంచెం  మీరంతా  ఐ . సి . యు బయటకు వెళతారా? అలాగే డాక్టర్, 
డాక్టర్ ఏవో టెస్టులు  చేస్తున్నాడు , నర్స్ ని వివరాలు ఆడుతున్నాడు , బి పి ఎంత ? ఎకో  చూసారా ? పేషెంట్  రెస్పాన్సు  ఎలావుంది ? 
ఎవరినీ గుర్తు పట్టటం  లేదు, మాటలు కూడా లేవు, డాక్టర్  నర్స్ చెబుతోంది . ఇంకొక  నర్స్ ని పిలిచి వాళ్ళని నా  రూమ్ లో కూర్చోమను డాక్టర్  గారు  వచ్చి మాటలాడతారు అని చెప్పు.  
అలాగే డాక్టర్, ఆ నర్స్  వెళ్ళిపోయింది, నాకంతా తెలుస్తోంది కదా? వీళ్ళేందుకు కంగారు పడుతున్నారు?  పిల్లలితో చెప్పినా వాళ్ళెం చేస్తారు, వాళ్ళు ముందే ఎవరకి వారే తప్పించు కుందామని చూస్తున్నారు. 
ఆ కలే బాగుంది . ఇల అస్సలు బాలేదు. డాక్టర్ తన రూమ్ కి వెళ్లి పోయేడు పిల్లలికి చెబుతున్నాడు ఇంకొక 24 గంటలు, దగ్గర వాళ్ళకి చెప్పుకోండి , 
ఇదేంటి? డాక్టర్ తన రూమ్ లో చెప్పేవి నాకు ఎందుకు తెలుస్తున్నాయ్?దగ్గర వాళ్ళకి చెప్పడం 
అంటే ?భగవాన్ !  
రా రా, ఎవరూ ? నేనే, మళ్ళీ కల, 
కాదు నిజం అదుగో చూడు నీకొక పెద్ద  కొత్త  పార్కు  చూపిస్తాను  రా రా, పద పద, 
ఆహా ఎంత  బాగా ఉంది, చల్లగా ఉంది హాయిగా ఉంది, బాగుంది చాలా మంది  ఉన్నారు, ఇంతకు ముందెప్పుడూ  చూడలేదు ఈ పార్కు ని, ఈ మనుషులని, కాని బాగుంది.  
ఎలావుంది ? 
బాగుంది ,
ఇంకా  చూపిస్తాను  లోపలి వెళదాం , 
ఎవరో నన్ను  పిలుస్తున్నారు ?  
లేదే ? 
ఇక్కడ కాదు ఎక్కడో, ఎక్కడో అయితే మనకెందుకు పద ,  
పెద్ద సరస్సు  నిండా పూలు ఎంత  ఆహ్లాదం గా ఉంది , 
ఎవరో చెవులో పిలుస్తున్నారు, కాదు కాదు చెవులో పిలవమని ఎవరో చెబితే పిలుస్తున్నారు, 
ఇక్కడ సరస్సు నిండా పూలు ఎంత ఆహ్లాదం గా ఉంటే పక్కన ఎవరు లేరే? ఎవరు పిలుస్తారు ? 
నిజమే కాని ఎక్కడో పిలుస్తున్నారు అర్ధం  కావడం లేదు,
వెళతావ ? వస్తావా ? 
వస్తాను, 
ఎందుకు ? 
ఎవరు పిలిచినా వాళ్ళ కంటే నీ దగ్గరే బాగుంది , 
ఓహో, పద పద, ఇంకెక్కడికి ?
కొత్త ప్రదేశానికి అక్కడ ఇంకా బాగుంటుంది .
ఎంత చక్కటి బంగాళా పెద్ద హాలు, మద్యలో చక్కటి ఫౌంటెన్, చక్కటి సువాసన,  నలుగు పక్కల  పెద్ద పెద్ద గదులు దాటుకుంటూ వెనుకకు వెళితే  వెనుక వేపు కూడా  పూల మొక్కలు  పెద్ద  తోట  దూరంగా కొండలు రమణీయం గా ఉంది. దూరంగా  జలపాతం  కనిపిస్తోంది,
పద పద జలపాతం  చూసొద్దాం , 
ఎందుకు ? చల్లగా ఉంటుంది, 
సంతోషం గా వడి వడి గా నడవటం  మొదలు పెట్టేడు, దగ్గ్గరేనా ?  
దగ్గరే పద పద, 
స్నానం చెయ్యొచ్చా, 
చెయ్యాలి ,  
ఏంటి  అంతా వేడిగా  ఉన్నట్లుంది ?
వడి వడి  గా నడిచేవు కదా అదే వేడి , 
లేదు లేదు చాలా వేడి ఎక్కువ గా ఉంది,  
దగ్గరికి వచ్చెం,  
అంత పెద్ద జలపాతం లో దిగితే కొట్టుకుపోము ? 
లేదు దగ్గరగా నిలబడు నీమీదే నీళ్ళు వచ్చి పడతాయి ,  
నిజమే నా మీదే పడుతున్నాయ్ ఎంత హాయి గా ఉంది, వేడి అంతా  తగ్గి పోయింది . 
ఇప్పుడు  కొంచెం నెమ్మదించింది ఇంకా చిన్న వేడి ఉంది , 
ఆ మట్టి  రాసుకొని స్నానం చెయ్యి పోతుంది, 
మట్టా ? 
ఇంత దూరం కొండల్లోకి వచ్చిన  తరువాత  సబ్బు  ఎక్కడిది ? నిజమే కాని  మట్టి కూడా చాలా  బాగుంది, అయినా స్నానం చేసిన  తరువాత  పోతుంది కదా,
మట్టి  రాసుకుని స్నానం చేసాడు, "మృత్తికా స్నానం" ఎవరో మళ్ళీ చెబుతున్నారు 
స్వామీ మృత్తిక అంటే ?  మృత్తిక అంటే  సంస్కృతం లో మట్టి,  నీకు సంస్కృతం  తెలుసు కదా,
ఆబ్దిక సంస్కృతం లో రాదు కదా ?    అవునులే, ఇది అపరం సంస్కృతం అపరం అంటే?
తెలుస్తుందిలే 
వేడి మొత్తం  పోయింది. హాయి గావుంది , దాహం  వేస్తోంది  ఈ నీళ్ళు  తాగ వచ్చా ? 
భేషుగ్గా , 
చాలా  తీయగా ఉన్నాయ్, కడుపు నిండింది , కాని  ఎక్కడో తర్పయామి తర్పయామి అని వినిపిస్తోంది , తర్పయామి అంటే  నీళ్ళు  వదలటం కదా? 
నీకెలా తెలుసు సంస్క్రతం చదువుకున్నావా ? 
సంస్కృతమా పాడా ? మనదంతా  ఆబ్దిక సంస్క్రతం. 
చాలా  దూరం  వచ్చినట్లున్నాం ? 
ఎం ? ఇంటిమీద  మనసు పోయిందా ? ఇంటివాళ్ళని చూస్తావా? 
ఎందుకు వాళ్ళ మీద  మనసు లేదు, ముందుకు పోతే ఇంకా మంచి ప్రదేశాలు ఉన్నాయా ? 
ఉన్నాయి , మీ వాళ్ళ  మీద  మనసు లేదన్నావ్ ? ఎవరిమీదా లేదా ? 
ఉంది  మా నాన్నా , అమ్మా అన్నయ్యా, వాళ్ళని చూస్తావా ? ఎలా సాద్యం ? 
మీ ఇంటి దగ్గర సాద్యం కాని వాళ్ళు ఆ కొండ దాటితే ఉంటారు 
అయితే  వెళదాం, 
భయం లేదా ? 
ఎందుకు నువ్వున్నావ్ కదా,  పద పద పోదాం . కొండ పక్కనునుంచి  చక్కటి దారి ఉంది, ఇంతసేపు  చూడలేదే ? 
అప్పుడు వేడి, స్నానం, ఆ ద్రుష్టి లో ఉన్నావ్,  
నిజమే పద పద పోదాం ఇంకో కాలంలోకి , 
కాలంలోకి అంటే ? 
అదేనయ్యా మనఊరి నుంచి ఇంకో ఊరికి వెళితే ఇంకో రోజు పడుతుంది కదా, అవును, 
అంటే ఈరోజు కాలం లోంచీ ఇంకో రోజు కాలం లోనికి వెళ్లి నట్లే కదా ?  
ఓహో అంత వుందా , సరే పద ఇంకో కాలంలోకి , ఆశ్చర్యం ఇంత దూరం లో ఇక్కడ పెద్ద  ఊరుంది , చాలా ఇళ్లు ఉన్నాయ్ అందరూ పెద్ద వారె , చక్కగా ససాస్త్రీయంగా ఉన్నారు, చిన్న వయసు వారు కూడా ఉన్నారు కాని తక్కువ మంది, అందరూ పలకరిస్తున్నారు, తెలిసిన వారిలా,  ముందుకి పోతే చిన్న ఇంటి ముందు నాన్నా అమ్మ బయట నిలబడి పిలుస్తున్నారు, 
ఆశ్చర్యం అమ్మా నాన్నా ని చూసి ఏడుపొచ్చింది , ఇక్కడ ఏడవకూడదు నాయనా వచ్చేసేవ్ కదా ఇంకా కష్టాలు ఉండవ్ , 
ఇక్కడ కష్టాలు ఉండవా ? 
అస్సలు ఉండవ్ . 
బాగుందే , రా నాయనా దూరం నుంచి  వచ్చేవ్ కాళ్ళు కడుక్కో  , అవును  ఆ కాలం నుంచి  ఈ కాలం లోకి వచ్చెను , ఓహో కాలం కూడా తెలిసిందా ? సరే భోజనం చేద్దువుగాని  రా,  చక్కటి గది మద్యలో చాప పరిచి కూర్చున్నాను , ఆకు వేసి అన్ని పదార్దాలు వడ్డించేరు , నాన్ననాతోటే  కూర్చున్నారు , 
మరి అమ్మ ? అమ్మ నాతో కలిసి ఎప్పుడైనా భోజనం చేసిందా ? 
మన తరువాత ఆడవాళ్ళతో కలిసి చేస్తుంది ? ఓహో, 
భోజనం చాలా బాగుంది నాన్నా పదార్దాలన్ని బాగున్నాయి, తింటూ చెప్పేడు , 
చెప్పెను కదా ఇక్కడ అంత బాగుంటుంది అని , 
అవును చెప్పేవ్, ఇంకా అలవాటు అవాలి కదా ? చాలా రోజుల తరువాత సుస్టుగా భోజనం చేసెను, 
త్రుప్తి రస్తు, త్రుప్తి రస్తు, త్రుప్తి రస్తు అని వినబడుతుంది నాన్నా 
కొన్ని రోజులు అలాగే వినబడుతుంది లే అయినా  సంస్క్రతం ఎప్పుడు నేర్చుకున్నావ్ రా ?
సంస్కృతమా పాడా ? మనదంతా  ఆబ్దిక సంస్క్రతం.
ఆబ్దికాలు పెట్టి పెట్టి, అవునూ నీకే కదా తద్దినాలు పెట్టింది, కలా నిజామా ?
తప్పు తప్పు నాన్న పక్కనే ఉన్నారు కదా ?  ఇప్పుడు  ఉన్నదే  నిజం, ఊహల్లో  ఉన్నది బ్రమ. 
చీకటి పడింది ఆగదిలో నిద్రపో, ఉదయాన్నే నిద్రలేచి నీ కాలం లోకి వెళ్ళ వచ్చు  అదే మీ ఊరికి , 
ఓహో నువ్వుకూడా పంచులు వేస్తున్నావ్ , అయినా  నాకు ఇష్టం లేదు వెళ్ళడానికి, 
సరే లేరా మీ ఇంటికి వెళ్ళవ్ కాని, ఏవో కోరికలు కోరి ఉంటావ్ కదా ? 
కోరికలా ? 
అదేరా బంగాళా, కారు ఎక్కువ డబ్బులు  కావాలి అని, 
అవును అవన్నీ  నీకెలా తెలుసు ? 
ఎలా తేలిస్తే ఏమి లే, అవి కావాలంటే అక్కడికి వెళ్ళాలి కదా ?  
అవును ఇక్కడే బాగుంది ఇక్కడ కస్టాలు ఉండవు అన్నావ్ కదా , 
నిజమే కాని నువ్వు ఇవి అడగలేదు కదా ? 
నిజమే కాని నేను కోరిన వన్నీ వస్తాయా ? 
రెడీ గావున్నాయ్ నువ్వు వెళ్ళటమే లేటు, 
సరే ఇప్పుడే వెళతాను , ఇప్పుడు దారి ఉండదు, 
ఉదయాన్నే వెళ్ళవచ్చు , సరే నిద్రపోతాను.
అంతా మగతగా ఉంది కలా  నిజామా ? ఎవరో గట్టిగా కొట్టేరు, ఏడవలేదు ఇంకోటి కొట్టండి    అంటున్నారు, నిద్రపోతుంటే కొట్టడమే కాకుండా ఎడిపిద్దామని చూస్తున్నారు ఎవరూ? మళ్ళీ  గట్టిగా కొట్టేరు చుర్రుమంది ఒక్కసారి ఏడుపొచ్చింది, కళ్ళు తెరుద్దామంటే అవటం లేదు. ఎవరో స్నానం చేయిస్తున్నారు , నేను చేసుకుంటాను కదా ? వీళ్ళెవరు నాకు స్నానం చేయించడానికి ? హాయిగా ఉంది మళ్ళీ నిద్ర . ఏది కలో ఏది నిజమో తెలియటం లేదు. అయినా నేను నాన్నగారి ఇంటి దగ్గర కదా పడుకున్నాను ఇక్కడ ఉన్నానేమిటి ?  ఇప్పుడు  ఉన్నదే  నిజం, ఊహల్లో  ఉన్నది బ్రమ 
అయినా నాన్నగారి దగ్గరికి తీసుకు వెళ్ళిన  అతను ఎడి  ? 
మళ్ళీ  ఆలోచనలో పడ్డావా ? 
అవును ఏది నిజం ? ఏది బ్రమ ? ఆ  తెలిసింది, 
ఎం తెలిసింది ? బ్రహ్మ సత్యం జగన్మిద్య 
బ్రహ్మ సూత్రాలు కూడా తెలుసా ? 
మా గురువు గారు చెప్పేరు, చెబితే వినడం కాదు నన్ను నేను తెలుసుకోవాలి , 
తెలుసుకున్నావా ? బ్రహ్మ సత్యం జగన్మిద్య అంటే తెలుసుకున్నావా ? 
అవును ,
ఎలా ? 
జగత్ అంటే జన్మించేది గతించేది, 
అంటే ?  
కాలం లో జన్మించి కాలం లో గతించేది , 
అంటే ?  
ఆసుపత్రిలో నేను పడిన ఆవేదన నా అనుభవం కాలం లో పుట్టింది కాలం లో గతించింది 
పార్కులో నేను పొందిన సంతోషం నా అనుభవం కాలం లో పుట్టింది కాలం లో గతించింది
నా తల్లి తండ్రులతో నేను పొందిన ఆప్యాయత అనుభవం కాలం లో పుట్టింది కాలం లో గతించింది
అల్లాగే రాబోయే కాలంలో నేను పొందే అనుభవాలు కూడా కాలం లో గతిస్తాయ్ 
అందువలననే మనం అనుభవించే ఈ జగత్ అంతా మిధ్య, అదే జగన్మిద్య 
మరి ? బ్రహ్మ సత్యం ? 
వీటన్నిటిలో మార్పులేకుండా ఉన్న నేనే సత్యం .
తదాస్తు  నేను వెళ్లి రానా ? 
మరి బంగాళా , కారు  ఎక్కువ డబ్బులు ? 
నేనే సత్యం అన్నావ్ ?
అవును నేను చెప్పినవన్నీ అసత్యాలు  కాదు కదా ? 
ముమ్మాటికీ కాదు  
అసత్యాలు  అస్సలు పలకనని నాపేరు సత్యం అనిపెట్టేరు, అంటే నేను  సత్యమే కదా ?  
ఓహో  అలా  వచ్చేవా ?  
ఎం తప్పు చెప్పేనా ? 
లేదు లేదు 
మరి జగన్మిద్య నిరూపణ చేసేవ్ కదా ? అవును మా గురువుగారా ? మజాకా ? ఆయన దగ్గర  వేదాంత అధ్యనం చేస్తే మీరు కూడా నిరూపణ చెయ్యగలరు రండి ఒకసారి వెళదాం, 
అయితే కుండ ఇంకా కాల లేదు పద , 
ఎదో గోణిగేరు నా గురించి. 
కుండ ఇంకా కాల లేదు అన్నాను అంతే , 
కుండ అనగానే గుర్తుకొచ్చింది మట్టి తో ఎన్ని రకములైన పాత్రలైనా చెయ్యొచ్చు నామ రూపములయిన అన్నీ ఈ ప్రపంచం లాగా  వేరు వేరు గా కనిపించినా అన్నిటా మార్పులేనిది మట్టి మాత్రమే , అజ్ఞాని నామ రూపములయిన జగత్ ని చూసి అదే సత్యం అనుకుంటాడు , కాని జ్ఞాని అన్నిటా సత్యమయిన మట్టినే చూస్తాడు అంటే ఈ జగత్తు కారణమైన చైతన్యాన్ని చూడ గలడు అతడే బ్రహ్మ జ్ఞాని అనబడతాడు,   
తదాస్తు  నేను వెళ్లి రానా ? 
మరి బంగాళా, కారు  ఎక్కువ డబ్బులు ?
ఆహా నీలాంటి జ్ఞాని ఇంతవరకు తారస పడలేదు, 
మా గురువుగారా ? మజాకా ?
అబ్బో  నీ జ్ఞానం  పద పద , 
ఎక్కడికి ? అదే  బంగాళా, కారు  ఎక్కువ డబ్బులు......  
హమ్మయ్య మరిచిపోయారేమో అనుకున్నాను . 
మరిచి పోవటమా ? నేను ఒక్క సారి చెబితే... 
మీరు కూడా పంచులు వేస్తున్నారు , 
నీదగ్గర నుంచే కదా తెలుసుకున్నది. పద పద కాలం మించిపోకూడదు , 
తెలుసు ఆ ఊరికి , 
నీకు కూడా మా భాష తెలిసిందే ? పద పద లోపలికి ,  
పెద్ద బంగాళా , పెద్ద గేటు లోనుంచి  లోనికి వెళ్ళాలి ఒక ఎకరం జాగా ఉండొచ్చు,  గార్డెన్ అంతా దాటి వెళితే పోర్టికో , శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఇల్లు లాగా ఉంది , ఒక కారు కాదు చాలా కార్లు ఉన్నాయి , ఇల్లెవరిదో ? 
నీదే,  
నాదాఆఆఅ.....? లోపలి వెళ్లేం ఒక పెద్దాయన కోటు సూటు బూటు, జగపతి బాబు లాగా ఉన్నాడు ( మహేష్ బాబు వాళ్ళ నాన్నశ్రీమంతుడు ) సరాసరి నా దగ్గరికే  వచ్చేడు పద  నాన్నా  వెళదాం మళ్ళీ  లేట్  అయిపోతుంది. నాకు తెలియకుండానే  అతని వెంట నడిచేను, అందరూ  నమస్తేలు  పెడుతున్నారు, ఒక నలుగురు  జగపతి బాబు వయసే , పక్కనే నడుస్తూ ఈరోజు ఎవరెవరిని ఏ ఏ టైం కి కలవాలో అపాయింట్ మెంట్స్  గుర్తు చేస్తున్నారు ,
అందరిని మద్యాహ్నం నుంచి ఫిక్స్ చెయ్యండి మార్నింగ్ సెషన్ అవదు అని చెప్పి పంపించేరు. 
అంతా సినిమా లో లాగా ఉంది , పెద్ద  కారు పిలవకుండానే  వచ్చి ఆగింది, ఎక్కు నాన్నా అన్నాడు ( జగపతి బాబు ) ఎవరు నాన్న ?  నేనా ? నాకు  ఆయనా ? 
ఎక్కి కూర్చున్నాను నా పక్కనే అయన, కారు పేరు కూడా తెలియదు ( బెంజో, ఆడీ వో ) మాకు  ముందు మూడు కార్లు, వెనుక నాలుగు, అబ్బో జగపతి బాబు కంటే గొప్పవాడు లాగ ఉన్నాడు ఈ నాన్న,  కాదు కాదు మా నాన్న కదూ అనాలి, అంతా అయోమయం, అయినా బాగుంది.  
అపాయింట్ మెంట్స్ గురించి చెప్పిన ఆ నలుగురి వల్లే మనం ఈరోజు ఇంత ఉన్నత స్థితి లో ఉన్నాం వాళ్ళు మనకోసం వాళ్ళ  శక్తీ యుక్తి జీవితం కూడా వినియిగించేరు, చాలా నమ్మకమైన వాళ్ళు అని చెప్పేరు .
కారు  మెల్లగా పెద్ద  పేలస్ లోకి వెళ్ళింది, ఇది ఇంకా పెద్ద బంగాళా ఇక్కడ కూడా చాల కార్లు ఉన్నాయి, కారు డోర్ ఎవరో తెరిచేరు, దిగునాన్న ( జగపతి బాబు ),  మెల్లగా ఆయనతో నడుస్తున్నాను, ఇదంతా ఎవరిదీ నాన్నా ? మీ పెద్ద నాన్నా గారిది , అంటే ఇకపై నీదే, అంటే ? పద చెబుతాను. నలుగురైదుగురు నల్ల కోట్లు  వేసుకున్న వాళ్ళు ఎదురోచ్చేరు, లాయర్లు అనుకుంటాను సార్  అంతా పెద్దాయన  చెప్పినట్లే రాసెం, మీ అబ్బాయి పేరుమీద , మీరు ఒక్కసారి చూస్తే ? అన్నయ్య ఎలా ఉన్నారు ? మీకోసమే చూస్తున్నారు,  ఉండండి పిల్లల్ని చూసి వస్తాను, నన్ను కూడా తీసుకు వెళుతున్నారు, రెండు మూడు గదులు దాటి ఒక పెద్ద గదిలోకి వెళ్ళాం , చల్లగా ఎ.సి పనిచేస్తోంది 
ఇద్దరు మగ పిల్లలు, తెల్లగా చక్కగా ఉన్నారు , సోఫాలో కూర్చొని ఉన్నారు, వయసు చిన్నవాడికి 18 పెద్ద వాడికి 25 ఉండొచ్చు, పెద్ద వాడు ఎవరినీ పట్టించుకున్నట్లు గా లేడు, చిన్నవాడు నాన్నని చూడగానే గట్టిగా చప్పట్లు కొట్టి  నవ్వుతున్నాడు, ఏరా బాగున్నావా ? నాన్నవాణ్ణి పలకరిస్తున్నాడు,
వాడికి ఎదో అర్ధం అయినట్లుగా నవ్వుతున్నాడు, 
వీళ్ళేనా పిల్లలంటే నాకంటే పెద్ద గా ఉన్నారు ?
రా నాన్నా  భయపడకు, మీ అన్నయ్యలే  అన్నారు, 
నన్నేప్ప్పుడు తీసుకురాలేదే ? పెద్ద నాన్నా వద్దనే వారు, నాకు చాలా ఆశ్చర్యం గా ఉంది ! 
మరి ఇప్పుడు ఎందుకు తీసుకు వచ్చేరు ?

సమయం వచ్చింది, పెద్ద నాన్నా గారి పరిస్థితి బాగో లేదు, అయన తరువాత నేను చూసుకుంటాను,  నా తరువాత నువ్వు చూసుకోగలవా ? అని తేలుసుకోవడానికి తీసుకు వచ్చెను, బలవంతం ఏమిలేదు, చూసుకోక పోయిన నా తరువాత నా ఆస్థి అంత నీదే, ఇన్ని డబ్బులు, ఇంత మంది పని వాళ్ళు ఉన్నారు కదా అని అలోచిస్తున్నవేమో ? మన పని మనం స్వయం గా చేసుకోవాలి, 

పిల్లల్లిద్దరిని నువ్వు స్వయంగా చూసుకోవాలి  ఎక్కడో విన్నట్లుందే. కార్లు, ఆస్తీ , 
డబ్బు లేకపోయినా పిల్లల్లిద్దరిని  స్వయంగా చూసుకుంటాను నాన్నా, ఎందుకో తెలియదు అది నా భాద్యత అని పిస్తోంది, కార్లు, బంగాళా, పిల్లలు, స్వయంగా, ఎక్కడో విన్నాను, కలలోనా ? 
ఎవరో ఎక్కడో మాట్లాడుకుంటున్నారు, ఎన్నాళ్ళు  ఇలా, శక్తీ యుక్తి మనది ఆస్థి అనుభవం అతనిది, సమయం రానీ  అంత మనదే అవుతుంది  అంటున్నారు. మా నాన్న ( జగపతి బాబు) గారు  నమ్మిన ఆ నలుగురూ, నమ్మకస్తులు అని చెప్పేరే? ఇదేమి నమ్మకం , అయిన వాళ్ళు ఎక్కడో మాట్లాడుకుంటే నాకు ఎలా తెలుస్తోంది ? 
మళ్ళీ  ఆలోచనలో పడ్డావా ? పద పద , 
ఎక్కడికి ? 
నీకిచ్చేవన్నీ  చూపించేను కదా ? మనదగ్గర  మాటంటే మాటే గోల్కొండ కోటే, పద పద, 
ఇవన్నీ నాకు వచ్చేవే అని చెప్పేవ్ ? 
అవును! మరి ఆ నలుగురు సమయం రానీ  అంత మనదే అంటున్నారు ?
అవును! ఇప్పటి నుంచి ప్రయత్నించి, నువ్వు అనుభవించిన తరువాత వాళ్ళ పిల్లలికి వెళుతుంది.
మరి నా పిల్లలికి ? 
నువ్వు అడగలేదు గా ? 
వాళ్ళ పిల్లలికి వాళ్ళు అడిగేరు, అందుకే నీతరువాత వాళ్ళకి ఇచ్చేను, 
అంటే నువ్వే భగవంతుడివా ?
నేనా భగవంతుడినా  ? 
నన్ను ఎప్పుడైనా  చూసేవా ? 
లేదే ?
తెల్లగా ఉంటాన ? నల్లగా ఉంటాన ? 
తెలియదు 
పొట్టిగా  ఉంటాన  పొడుగ్గా  ఉంటాన ? 
తెలియదు పోనీ ఎక్కడ ఉంటాను ? 
తెలియదు 
మరి  భగవంతుడివా? అని అడుగుతున్నావ్ ? 
అవును మరి ఇప్పుడు, ఇంతకు ముందూ చాలా సార్లు నీతో మాట్లాడుతున్నాను కదా ? 
నాతోనా ? 
అవును నేనంటే ఎవరో  ఎలావుంటానో తెలియకుండా  నాతో  ఎలా మాట్లాడుతావ్ ?
అవును నిజమే కాని మాటలడుతున్నది కొత్త విషయాలు  తెలుసుకుంటున్నది ?  
నీతోనే నువ్వు మాట్లాడుతున్నవేమో ? 
నిజమే నెమో ? తెలియట్లేదు.
"నీవని నేనని తలచితిరా  నీవే నేనని తెలిసితిరా"  
తెలుసుకున్నావా ? 
ఏంటి తెలుసుకునేది పాండురంగ మహత్యం లో పాట అది, రాసింది సముద్రాల రాఘవాచార్యులు . 
ఎంత బ్రహ్మజ్ఞాని ? పాండురంగని మహాత్మ్యం ద్వారా బ్రహ్మ సూత్రాన్ని ఎంత సరళంగా చెప్పేరు ?
అంత లేదు స్వామి, కధా నాయకడు నాయకి ల మద్య ప్రణయ గీతం, సినిమా కోసం రాసేరు , 
ఇంకొకటి వోదలనా ? 
ఏంటి వదిలేది ?
సరళమైన బ్రహ్మ సూత్రం ,
తప్పుతుందా వదులూ , 
నీవు లేని  నేను లేను , నేను లేని నీవు లేవు 
"నేను నువ్వు  నువ్వు నేను, నేను నువ్వు , నువ్వు నేను లేనిదే ఈ జగమే లేదు" 
అక్షర సత్యం , సత్య నిరూపణ నిజంగా సరళంగా  చేసేవ్ జ్ఞానీ,
మళ్ళీ  పప్పు లో కాలేసావ్ ,
అంటే ?
నేను కాదు ఆచార్య ఆత్రేయ గారు రాసేరు,
ఆహా ఆచార్యులు, అత్రి మహాముని  వంశస్తులు  వారు కాకపోతే ఎవరు బ్రహ్మ సూత్రాన్ని ఇంత సరళంగా చెప్పగలరు? ద్యాన ముద్రులై చెప్పి ఉంటారు 
ద్యాన ముద్ర  లేదు పాడు లేదు, ఇదికూడా సినిమా పాటే, ఇది కూడా  కధా నాయకడు నాయకి ల మద్య ప్రణయ గీతమే , 
కధా నాయకడు నాయకి ల మద్య ప్రణయ గీతమా ?  కధా నాయకడు నాయకి లే పెద్ద మిధ్య,
ఇంక బ్రహ్మం సత్యం  ఎక్కడివి ?
మీరు బ్రహ్మ పదార్దాలు,  మీ గురించి తెలుసుకోవడం చాలా కష్టం లాగుందే ?
అంతే, మాకు మేమే సరిగ్గా  తెలియం నీకెలా తెలుస్తాం ? 
నిజమే  చాలా కష్టం  పద పద , 
ఎక్కడికి ? 
నీకిచ్చేవన్నీ  చూపించేను కదా ? మనదగ్గర  మాటంటే మాటే గోల్కొండ కోటే , 
అడిగినవి కాదనకుండా ఇస్తాను, మీరు మరిచిపోయి నన్ను నిందిస్తే నేను ఏమి చెయ్యలేను. మీరు అడగకుండా ఏది ఇవ్వను. మీరు మరిచిపోయిన గుర్తు పెట్టుకున్నా, నా భాద్యత కాదు, మీకే  సంభందం. పద పద. 
ఎవరో స్నానం చేయిస్తున్నారు, నేను చేసుకుంటాను కదా ? వీళ్ళెవరు నాకు స్నానం చేయించడానికి ? హాయిగా ఉంది మళ్ళీ నిద్ర . ఏది కలో ఏది నిజమో తెలియటం లేదు. కళ్ళు తెరిచి చూసేను ఎవరో  పిలుస్తున్నారు ఇంకెవరినో  చూపిస్తున్నారు , పిల్లాడికి బట్ట తడిసిపోయింది మార్చమ్మ నర్సు చెప్పింది వెంటనే మర్చేరు వెచ్చగా  ఉంది , పిల్లాడికి ఆకలేస్తుంది పాలు పట్ట్టమ్మ , పాలు పట్టేరు హాయిగా ఉంది.  
ఎవరొచ్చారో  చూడు ? నన్నోచ్చేరే,  చిన్ని నాన్నా,  నాన్న వచ్చేరు  చూడు, 
" ఇంతకు ముందు నామీద నాకే  అసహ్యం, మరి ఇప్పుడు ఆనందం",  నవ్వొచ్చింది ,  
చూడమ్మా  నాన్నని  చూడగానే  నవ్వేడు చిన్నారి తండ్రి  అప్పుడే గుర్తు పడుతున్నాడు ,  
అంతా బాగానే ఉంది,  ఈ సంభోదనే అర్ధం  కావడం లేదు చిన్నారి తండ్రి  ?  నాన్నా ? ఇంతకీ ఈ  కొత్త  నాన్న  ఎవరు ?
ఎవరో చూసిన ముఖం లాగే అనిపిస్తోంది ఎవరో తెలియడం లేదు . జగపతి బాబు ( యంగ్ ఏజ్ లో ఉన్నాడు )  (శ్రీమంతుడు లో మహేష్ బాబు వాళ్ళ నాన్న ). మీరు తిరిగిన  తీర్థ యాత్రల ఫలితం మీ ముద్దుల కొడుకు అని చూపిస్తున్నారు. ముద్దుల కొడుకు అంటే నేను,  అన్నీ కొంచెం  కొంచెం గా అర్ధం అవుతున్నాయి,  స్వామి స్వామీ ..... ఈసారి పద పద అని ఎవ్వరూ పిలవడం లేదు. 
సూయ్............  టప్. 
ఎవరెవరో పలకరిస్తున్నారు ? ఎవరెవరో  అడిస్తున్నారు ఎవరు వీళ్ళంతా ? ఏవో శబ్దాలు చేస్తున్నారు ? వాటి అర్ధం ఏమిటి ? ఏమైతేనేం  నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు , నాకు ఎం  కావాలో నేను అడగకుండానే  చేస్తున్నారు.  
ఇంతకి  నేనెవరు ? నాపేరు ? పేరంటే ? 
---------------------------------------------------

జ్ఞాన ధాత, అద్వయిత బ్రహ్మ 

శ్రీ శ్రీ శ్రీ పూజ్య ఆచార్య ప్రేమ్ సిద్దార్థ్ గారి 
చరణ కమలాలకు అంకితం 
సత్యం. ఓరుగంటి

No comments:

Post a Comment

Pages