మాబడి - బాలగేయాలు - అచ్చంగా తెలుగు
బాల గేయాలు
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


ఈ మాసం మనం ఒక చక్కని గేయాన్ని చూద్దాం. చిన్నపిల్లలకు నేడో రేపో బడికి వెళ్ళే పిల్లలకు స్కూలంటే శ్రద్ధ కలిగేటట్టు గా చెప్పే గేయం. బడిలో చక్కగా చదువుకుంటారని, ఆటలాడుతారని, కలసిమెలసి ఉండి స్నేహ భావం పెంపొందించుకుంటారని, భారతమాతను జాతీయ జెండాను గౌరవిస్తారని తెలియజెప్పే గేయం. రచయిత ఎవరో తెలీదు. చూడండి.
అదిగోనండీ మాబడి
నేర్పును మాకు చక్కని నడవడి
శ్రద్దగ చదువులు చదివెదమండి
చక్కగ కలిసి ఉంటామండి
పాఠాలెనో చదివామండీ
పంచతంత్రం విన్నామండి
అందులో నీతి తెలిసిందండి
ఎప్పుడు తప్పులు చేయం లెండి
చక్కగ బుద్దిగ ఉంటామండి
మంచి పనులు చేస్తామండీ
కలిసి అందరం ఉంటామండీ
ఆనందంగా జీవిస్తామండీ
తగవులు ఎప్పుడు పడమింకండి
కలికట్టుగ ఉంటామండి
కలసి మెలసి పని చేస్తామండి
కంచుకోట నిర్మిస్తామండి
కోటకు జండా కడ్తామండి
ఆకశాన ఎగరేస్తామండి
ఆ ఎగిరేజండా మాదేనండి
అదే మా భారత జండానండీ....

శ్రీరాముడు రావణసంహారము అనంతరం లక్ష్మణ, విభీషణాదులతో లంకలో ప్రవేశించిన తర్వాత, లక్ష్మణుడు లంకలోని ఐశ్వర్యము, బంగారు, వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపిస్తూ.. "ఆహా! అన్నయ్యా! అయోధ్య కన్నా లంక ఐశ్వర్యవంతమైనది...అంతులేని సంపద ఇక్కడ ఉంది. ఇక్కడే ఉండిపోవచ్చు గదా!" అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా,   లక్ష్మణా! 'జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అని పలికాడు. అనగా...తల్లీ, జన్మించిన ప్రదేశము స్వర్గముకన్నా పరమోత్తమమయినవి అని చెప్పాడు. అందువల్ల మన బాలలకు చిన్నతనమ్నుండే ఈ వైశిష్ట్యం తెలియజేయడం పెద్దలగా మన బాధ్యత.

No comments:

Post a Comment

Pages