స్త్రీకే సాధ్యం - అచ్చంగా తెలుగు

స్త్రీకే సాధ్యం

Share This

స్త్రీకే సాధ్యం 

హరీష్.గొర్లెఅదిగో ...
కనిపిస్తున్న చందమామని 
చేతి ముద్దకి పరిచయం చేస్తూ 
కన్నబిడ్డకు ఆటబొమ్మగా 
మెప్పించడం  స్త్రీ కే  సాధ్యం .... 
 బాధలను బందీ చేసుకుని 
చిరునవ్వులు కురిపించగల 
అందమైన శిల్పం స్త్రీ హృదయం .... 
 
కురిపిస్తున్న నవ్వుల వెనుక 
సముద్రమంత శోకం ఉన్నా 
ముత్యాలను ప్రకాశింపజేయడం,
ఆ మౌనం మాటల్లో అంతరార్ధం  
అణకువ అనుకూవటంలో సందేహం లేదు... 
 
మోసపోతున్నా భరించి 
ఆత్మీయంగా  పలకరిస్తూ 
చుట్టూ ప్రపంచం ద్వేషిస్తున్నా 
ఏ ఒక్కరి ఆసరా లేకున్నా 
రక్తాన్ని క్షీరం చేస్తూ 
అనాగరికపు అంచుల్లో 
నాగరికతకు తిలకంలా మెలగడం స్త్రీకే సాధ్యం ..!
 
తాను నిన్నటి కష్టంలా  ఉండి 
నేటి ఫలాలు ప్రపంచానికి అందిస్తుంది . 
మానవత్వపు మంటల్లో 
మానసికంగా కాలిపోతున్న 
మోడై నీడనివ్వటం స్త్రీ కే  సాధ్యం ...!!

No comments:

Post a Comment

Pages