శుభ లేఖ - అచ్చంగా తెలుగు

శుభ లేఖ

తురగా శివ రామ వెంకటేశ్వరులు  


ఈడొచ్చిన పిల్లల కలల పంటకు
వారి నూరేళ్ళ పంటకు  శ్రీ లేఖ  పెళ్ళి శుభ లేఖ !
దీని పుట్టుక మనిషి పుటకకు తొలి మెట్టు
నగల కొట్టుకు కన్ను కొట్టు
వేద మంత్రములను చదివించు లేఖ
సన్నాయి వాయిద్యములు వినిపించు లేఖ
బంధుమిత్రులను కుటుంబ సమేతముగా
రప్పించి ... కలిపించు లేఖ
విందు భోజనములను తినిపించు లేఖ
అతిధిలకుఅలకలు
వియ్యల వారికి కయ్యాలు కలిగించు లేఖ
శుభాశీశులకు మాత్రమే పిలుచు లేఖ కాదు
పెళ్ళి శుభ లేఖ !
రంగు రంగుల పట్టు చీరల,
ధఘ ధఘ మెరుయు బంగారు నగల ,
ఆడ, మగ లేటెస్టు వస్త్ర డిజైనుల ప్రదర్శనలకు,
ఫేషన్ షోలుకు, పేకాటలకు,
సరదాలకు, సరసాలకు, షేక్  హేన్డులకు ,
మమతల కౌగిలింతల ప్రదర్శనలకు,
పిలుచులేఖ  ఈ పెళ్ళి శుభ లేఖ!
వీడియోలలో పెళ్ళివారిని బంధించు లేఖ ,
అంతమందిని పిలిచి , అంత ఖర్చు పెట్టించి,
ఇరువది సంవత్సరములు పెంచి పెద్ద చేసిన,
తల్లి తండ్రుల బంధము తెంచి,
అప్పగింతలవేళ కన్నీరు కార్పించు లేఖ !
శుభ లేఖ !
తెలుసు నాకు దాని అంత రంగము
అది కన్నీరు కాదు, వధూ వరుల సౌభాగ్య
సంపదలకు పన్నీరు!.!.
****

No comments:

Post a Comment

Pages