దైవలీల - అచ్చంగా తెలుగు

దైవలీల 

కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి 


పిల్లలూ! మరొక కధ చెప్తా వినండి...
అనగా అనగా ఒక చక్కటి వనం. ఎంత చక్కని వనం అంటే అది అడవి కాదు. అడవి అంటే ఏమిటో ఆమాట చాలా కటువుగావుందికదూ! కనుక ఇది నిజంగా వనమే!
ఎక్కువగా పూల చెట్లు, పళ్ళ చెట్లు పెద్ద పెద్ద మర్రి రావి చెట్లు ,పళ్ళ చెట్లనిండా ఎన్నో పళ్ళు. అలాగే ఎన్నెన్నో పక్షులు  గూళ్ళు కట్టుకొని హాయిగా వుంటున్నాయి.
పక్షి కూనలు గూళ్ళలో వుంటే అమ్మ నాన్న పక్షులు మేత తెచ్చి వాటి నోటికి అందిస్తాయి కూనలు కిచ కిచ మంటూ తింటాయి. అవునా! ఎంత ఆనందంగా వుంటున్నయో అవి!!
ఒకసారి ఏమైందంటే అమ్మా నాన్న పక్షులజంట మేతకోసం ఎగురుతూ ఒక చెట్టుమీద వ్రాలాయి. ఆచెట్టు ఒక వాగు వడ్డున వుంది ఆవాగులో ఒక కండచీమ పడిపోయి కొట్టుకుపోతూ ఈ చెట్టుదగ్గరకు వచ్చేసరికి మగ పక్షి చూసి ఒక ఆకును నోటితో త్రుంచి నీటిలోకి పడేసింది. అదిసరిగ్గా చీమదగ్గరపడింది.
కండచీమ దానిమీదకు ఎక్కింది. క్రమంగా వడ్డుకు చేరింది. అదే చెట్టుకింద ఒక బోయవాడు  విల్లు ఎక్కుపెట్టి పక్షులకోసం చూస్తున్నాడు.
(ఇక్కడినుండి ఆటవెలది పద్యాలలో) వాడు చూసె నంత పక్షిజంటనచటవిల్లునెక్కుపెట్టె వేడ్కతోడఅతని గాంచినారు పక్షిదంపతులునుఎగిరిపోవ గాను యెంచినారు
అంతలోన పైన ఆకాశ మార్గానగరుడ పక్షి ఎగుర గాంచినారుఅదియె చూసెనేని ఆపదకల్గునుపోవకున్న చంపు బోయవాడు దిక్కుతోచలేదు దేవుని స్మరియించికావుమయ్య మమ్ము కమల నాభకూనలౌర దిక్కులేనివారౌదురుదిక్కు నీవెమాకు దీనబంధు అంతలోన చేరె నచ్చోటకాచీమగాంచె పక్షిజంట కష్టమంతబోయవానికాలి బ్రొటకనవ్రేలును గట్టిగాను పట్టి కరచివేసె వాని గురియు తప్పి బాణము తిన్నగాపైన ఎగురు గరుడ పక్షి రెక్కలందు తాక నదియు కిందపడెను చచ్చెదైవలీల లెరుగ తరమె మనకు

No comments:

Post a Comment

Pages