నింపామేక్... - అచ్చంగా తెలుగు

నింపామేక్...

Share This

నింపామేక్...

పిన్నలి గోపీనాథ్ 


----------
కావలసినవి...
తాళ వృక్షాలు ...మూడు
(కైవారం ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిది)
మంచి పదునైన కొడవలి ...వొహటి
దృఢంగా ఉండే ప్లాస్టిక్ కుండలు ...మూడు
ప్లాస్టిక్ తాడు...వీలైనంత నిడుపాటిది
నింబ ఫలాలు ...మూడు కిలోలు
పంచదార ...మూడు కిలోలు
కిస్మిసు మూడున్నర గుప్పెళ్ళు
జీడి పప్పు మూడు గుప్పెళ్ళు
ఏలకుల పొడి ...యాభై చిటికెళ్ళు
మంచు భోషాణాలు ... రెండు
గ్యాసు బండ, నీళ్ళ బిందె, స్టవ్వు, చటా, చీపురూ
తువాలూ, చాకూ, కలెండులా సీసా
సినేమా సీడీ, టికెట్టూ, ముగ్గురు మనుషులూ ...
తయారీ విధానం...
-------------------
ముందస్తుగా చెట్ల చుట్టూరా శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి.(చీపురూ, చేటా అందుకే). తర్వాత చెట్ట కాండాలు కూడా పై వరకూ శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. దరిమిలా చెట్కుంటు కాండాల పైభాన కొడవలితో తీవ్రమైన గాట్లు పెట్టాలి. తరువాత కుండలను  తాళ్ళతో అక్కడ కట్టేయాలి. గంటు నుంచి పాలు కుండలో పడేలా చూసుకోవాలి. (దీనికంతా నిచ్చెనలు పనికిరావు. అవి మన మాట వినవు. అందుకే ముగ్గురు మనుషులు.)
ఇలా ఓ వారం పదిరోజులు ఉంచుకోవాలి. పట్టిన పాలను జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నింబ పలాలను జాగ్రత్తగా కడిగి వాటి రసం ఓ గిన్నెలోకి పట్టుకోవాలి. అప్పుడు ఆ పాలూ, ఈ రసమూ కలియబెట్టి, మంచు భోషాణంలో మూత బెట్టకుండా దాచాలి. ఇంకో వారం గడిచాక బయటకు తీసి కిస్మిస్సూ, జీడిపప్పూ, యేలకుల పొడీ దానిపై చల్లాలి.
ఫినిష్. రెండు వారాలు కాగానే దీపావళి వస్తుంది. ఆయనకు లేదా ఆమెకు రిచ్ గా పెట్టండి. పిచ్చగా తినేసేట్లు చూడండి. బావుంటే సిడీ. తేడా వస్తే ఆయన లేదా ఆమెకు సీడీ, మీకు టికెట్టూనూ ... కొసమెరుపు.. ఈ రెండు వారాలు కాగానే నేను హైదరాబాదులో ఉండను గనుక వెదకాలనుకోకండి. బతికిపోతా...కదా...
(వింకో వివరణ : నింబ ప్లస్ పామ్ వెరసి నింపా అయినది....)

No comments:

Post a Comment

Pages