గీత - అధీత - 2 - అచ్చంగా తెలుగు

గీత - అధీత - 2

Share This

గీత - అధీత - 2

- చెరుకు రామమోహనరావు 


సమస్య మనది - సలహా గీతది --3
సమస్య :జరిగే ప్రతి సంఘటనకు, అది మంచి గానీ చెడు గానీ, నాలో ఒక ప్రతిక్రియ కల్గుతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తులపై,వారు ఐనవారు అయినా కాకున్నా పరితాపము పెరుగుతుంది.చచ్చిన వారు చచ్చినారే అని బాధపడగా బ్రతికినవారు బాగుపడలేక పోతున్నారు అని బాధ. ఇది ఏవిధంగా తీరగాలుగుతుంది?
సలహా : ఇది నీ భ్రమ. ప్రతిజీవికీ .జీవితములో తనకొక విధి,బాధ్యతా , కర్తవ్యము ఉంటుంది. నీ మనసును ఆ బాధ్యత పైఅన లగ్నం చేస్తే అన్యధా కలిగే ఆలోచనలు వాటికవే పటాపంచలైపోతాయి. ఎందుకంటే నీ మనసు నీ పని పై లగ్నమైవుంది కాబట్టి. ఇక పనిలేనపుడు నీవు ఆలోచించే వ్యక్తులను గూర్చి అంటావా వారంతా వారివారి 1.ప్రారబ్ధ 2.సంచిత కర్మఫలములననుభవించుతూ మూడవదియైన ఆగామి కర్మల జేసి వాని ఫలితములనుభావింప ఎదురుచూచుచున్నారు. ఇందులో నీ ప్రమేయము అసలేదీ. మరి ప్రమేయమే లేకపోతే చింతపడి ప్రయోజనమేమి పొందుతావు.
ఈ విషయాన్నే కృష్ణుడు అర్జనునితో ఈ విధంగా చేబుతాడు :
అశోచా నన్వశోచన్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చనాను శోచంతి పండితాః  11-2
అగతుల విగతుల నందరి గూరిచి
తలపోయకు నీ తలలో చేరిచి
ప్రజ్ఞా వాదపు భ్రమలో మునుగడు
జ్ఞాని వానిపై జ్ఞాపకముంచడు     (స్వేచ్ఛా నువాదము )
ప్రజ్ఞావాదము ను గూర్చి ఒక మాట చెప్పుకొందాము. ఇది చాలా పెద్ద విషయము. నా దృష్టి లో ప్రజ్ఞా వాడమంటే ' దూరంగా ఒక ఇంటిలోనుండి పొగ వస్తూవుంది. ప్రజ్ఞా వాడి వెంటనే నిప్పులేనిదే పొగ రాదు. కాబట్టి ఇంటికి నిప్పంతుకోనింది అంటాడు.' నిజానికి ఇది నిజమైతీరనవసరము లేదు. ఇల్లన్న రువాత ఏ వంటకో వార్పుకో , లేక ఏ అగరు బత్తీ వెలిగించుట వల్లనో కూడా పొగ రావచ్చు. దూరమున్నందువల్ల వాసన రాకపోవచ్చు మరి అంతమాత్రాన ఇల్లుకాలుతూ వుంది అన్న నిర్ధారణకు రాలేము కదా!  ఇదీ  ప్రజ్ఞా వాదము నా అభిప్రాయములో ! కాబట్టి అది తర్కమునకు నిలువదు.
పండ అంటేజ్ఞానము. అది కలిగినవాడు పండితుడు.  అందువల్ల తన జీవితాన్ని తామరాకు నీటిబొట్టు లాగా గడుపుతాడు .అంటియున్నట్లే ఉంటాడు కానీ అంటించుకోడు. జ్ఞానమునకు వేదం శాస్త్రాలన్నీ కంఠ పాఠమై యుండ నవసరములేదు. విచక్షణ వుంటే చాలు. నేడు అతడైతే రేపు నీవు. ఇది చక్రము. అందరూ దీనిక్రిందికి ఎప్పుడో ఒకసారి రావలసిన వారే. కాబట్టి చింత వీడి నీ కర్మల నీవాచారించు. అవి దుష్కర్మలు కాకుండా చూసుకో!
**********************************************************
సమస్య మనది -- సలహా గీతది -- 4
సమస్య : అతను నాకు అత్యంత ఆప్తుడు. అతను గతించుతాడని నేను తలవనేలేదు. నేనతనిని మరువనే లేను.
సలహా : ఒక చిన్న పిల్లవాడు గాలి బుడగ కొన్నాడు. ఎంతో సేపు ఆడుకోనుచుండినాడు. ఆ బాలుని ఊహకు అందకుండానే అది పగిలిపోయింది. కాసేపు ఏడ్చినాడు. కొంత సమయము  గడిచిన వెంటనే తన దృష్టి వేరే ఆట వస్తువు మీద పడింది. మొదటిది మరచిపోయినాడు. తరువాత రోజు ఆ స్మృతి లేనే లేదు. ఆ బాలుడు నీవని ఊహించుకో. ఆ లేత వయసులో లేని మమకారము పెద్దయిన తరువాత ఎందుకు వచ్చినట్లు? వయసు తో బాటూ నీవు మమకారము పెంచుకొంటూ పోయినావు. ఇప్పుడు ఆ వ్యక్తి లేక వస్తువు పోతే బాధ తో కృంగిపోతున్నావు. రేపు నీవే వయోభారముచే కృంగి పోతావు ఆపై నీవే వుండవు. ఏమయి పోతూంది నీ మమకారము. నీ ఆత్మ పరమాత్మను చేరి తిరిగి వేరొక దేహమునాశ్రయించుచుచున్నది.ఇదే విషయాన్నే శ్రీ కృష్ణుడు ఈవిధంగా చెబుతున్నాడు.
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనంజరా
తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి
వపుషము మారిన వరుసగ బాల్య,కు
మారమెవ్వనము మరి వార్ధక్యము
ఆత్మకు తోడుగ అనుసరించునవి
వేరొక కాయము వేరొక ప్రాంతము
ఇందుకోసమై ఎందుకు మోహము
వీడుము దానిని వీర ధీరుడా     (స్వేచ్ఛానువాదము )
ఆకారము చూసి భ్రమయ వద్దు. ఆత్మా ను గూర్హి తెలుసుకో! నీకిపుడు కలిఇన దేహానికి బాల్య యౌవన కౌమార వార్ధక్యాలేట్లు కలుగుచున్నాయి ఈ దేహిని వీడి వేరొక దేహము నాశ్రయించి నపుడు దానికీ ఈవే అవస్థలుంటాయి. రూపము మారుతుంది కాబట్టి నీవు గుర్తించడముములేదు. అంతే కానీ ఆత్మికులమైన మనకు మరణము లేదు. మరి చింత లేక మోహము దేహము పై  ఎందులకు.
ఈ సందర్భములో ఇంకొక మాట చెప్పుకొందాము. రామాయణములో వాల్మీకి రామాయణం అరణ్య కాండలో ఈమమకారాల గూర్చి ఒక మాట శ్రీరమ చంద్రుని తో చెప్పిస్తాడు :
యదా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే
సమేత్యపి వ్యపెయేతాం కాలమాసాధ్య కంచన
ఏవం భార్యాశ్చ పుత్రాంశ్చ జ్ఞాతయస్య ధనానిచ
సమేత్య వ్యవధావంతి  ధృవోహ్యేషాం వినాభవః
పెద్ద ప్రవాహములో కొట్టుకుపోయే రెండు దుంగలు ఒకటై కలిసి కొంతదూరము పోయిన తరువాత తిరిగీ దేనికది విడిపోయి తమ ప్రయాణమును ఆ ప్రవాహములో కొనసాగించుతాయి. దారాపుత్ర ధన జన సముదాయము కూడా అంతే.
ఇన్ని విధాల పెద్దలు చెప్పినా కూడా ఇంకా ఈ మమకార వికారములు అవసరమా!
**********************************************************
సమస్య మనది -- సలహా గీతది -- 5
సమస్య  : చనిపోయిన వెంటనే శరీరము బూదిదయి మట్టిలో కలుస్తుందా ? ఎటూ చచ్చే దానికి మంచే ఎందుకు చేయాలి ?చివరిదాకా అట్టిపెట్టుకొన్న శరీరము పై వ్యామోహము తప్పా ? శరీరము కన్నా వేరుగా 'ఆత్మ' అనేదిఉందా?
అది శాశ్వతమా?
సలహా : శరీరము పంచభూతాత్మకము. పంచ భూతాలు 1.పృథివి (భూమి) 2. ఆపస్సు (నీరు ) ౩. తేజస్సు ( వెలుగు )
  1. వాయువు (గాలి )  5. ఆకాశము (ఆకాశం గగనం శూన్యం .  అందనిది, అగుపించనిది. అగుపించుతూ వుంది అని మనమనుకోనేది భ్రమ.) ఆత్మ ను అంటి పెట్టుకొని ఉంది ఈ నశ్వరమైన శరీరము. ఆత్మా పరమాత్మ చేరితే మరి పంచ భౌతికము పంచ భూతాలను చేర వలసినదే కదా ! శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు:
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినో ' ప్రమేయస్య తస్మాధ్యుధ్యస్య భారత  18--2
పార్థా వపుషము  పార్థివ మేనని
అవ్యయమైనది ఆత్మయేనని
అవినాశమ్మని అప్రమేయమని
ఎరుగుము, వైరుల నెదిరి పోరుము     (స్వేచ్ఛానువాదము )
అర్జునా! అంతా నీ భ్రమ గానీ దేహములే వేరు దేహి ఒకటే . అదే ఆత్మ. అది అవ్యయము, అవినాశము. ఆత్మా వీడితే మిగిలేది పంచభూతాలలో చ్రిపోయే శరీరమే ! నీయుద్ధము దుష్కర్మల కూడిన శరీరమును దునుముటకు మాత్రమే.సందేహము మాని నీవు చేయు కర్మ కొరకై సన్నద్ధుడవుకమ్ము. అరటి పసందు వలిచి నోట్లో కూడా కాదు కడుపులో పెట్టినంత సులభముగా చెప్పినాడు మహా జ్ఞాని యైన శ్రీకృష్ణుడు.
ఇక్కడ ఆత్మ విద్యుత్  ( Electricity ) అనుకుందాము. మన ఇంటిలోని అన్ని ఉపకరణములలో అది ఉన్నది . ప్రతి ఉపకరణము ఒక దేహము. అందులోకి విద్యుత్తు చేరనంతవరకు అది మృతమే . ఏ మీట నొక్కితే ఆ నాళిక (tube or CFL bulb ) వెలుగుతుంది . ఒకవేళ విద్యుత్తు ప్రవహించే రెండు తీవెలను ( + మరియు - ) తాకినామంటే  విద్యుద్ఘాతము కలుగుతుంది. వెంటనే దానినుండి ఆత్మను వేరుచేస్తాము . అది నిర్జీవమౌతుంది. ఇక్కడ విద్యుత్ నాళిక మంచివ్యక్తి, వదిలిన తంతులు చెడ్డ వాడు. మంచి తోడుతో చెడ్డను రద్దు చేసినాము. కానీ రెంటిలోకూడా విద్యుత్తే కదా వుండినది.
ఇక కర్మల గూర్చి:
శ్రమ లేకుండా ఆత్మానాత్మ వివేకమను ప్రకరణ గ్రంథములో ఆది శంకరులు ఈ విధముగా వివరించినారు:
ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానఅనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.
ఇక వారి మాటను మీరి వేరేమి చెప్పవలసినది ఉంటుంది.
******************************************************
సమస్య మనది -- సలహా గీతది -- 6
సమస్య :ఈ ఋతువులన్నీ నాకు బాధా కారకాలే. ఎండ వుంటే చల్లగాలి ఉంటె బాగుంటుందనిపిస్తుంది. వాన వుంటే ఎండా
కావాలనిపిస్తుంది, గాలి ఎక్కువైతే వానతో ధూళి అనగి పోవాలనిపిస్తుంది . ఏదీ భరించలేను.
సలహా : అసలు ఒకటి ఉంటె ఇంకొకటి కావాలనే మనస్తత్వము నీదని తెలుసు కాబట్టే ఏ ఋతువు శాశ్వతము కాకుండా ఏర్పాటు
చేయ బడినాయి. అయినా నీ స్వార్థము ఎల్లపుడూ ఒకటి వుంటే వేరొకటి కావాలన్న తలంపుయ్ నీలో రేకెత్తిస్తుంది. నీకు విసుగు
కలిగినపుడు కాస్త ఓపిక పడితే వేరే ఋతువు వస్తుంది కదా. మహర్షి వాల్మీకి 'క్షమయా నిష్ఠితాం జగత్ ' అని అన్నారు. క్షమా అంటే
ఓర్పు, సహనము. ఓర్పు కలిగితే మంచి వైపుకు మార్పు కలుగుతుంది. లెకుంటే ఓదార్పు మిగులుతుంది. ఈ విషయముగా గీత
ఏమంటూవుందో చూతమా !
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః
ఆగమాపాయినో 'నిత్యాస్తాం తితిక్షస్వ భారత 14--2
చితికే వరకు శీతోష్ణమ్ములు
సుఖదుఃఖమ్ములు చుట్టపు చూపులు
వచ్చిపోవుననివార్యము లయ్యవి
తితీక్ష కల్గుట తెలియుము భారత 14 -- 2
భారతుని వంశజుడైనందువల్ల భారతుడైనాడనే కాకుండా అభివ్రుద్ధియందు కోరిక గలవాడు అని కూడా అన్వయించుకొనవచ్చును.
తితీక్ష అంటే సహనము, ఓర్పు, క్షమ. ఆదికవి వాల్మీకి కాకుండా అపర హరి యైన వ్యాసుడు కూడా ' క్షమయా నిష్ఠితాం జగత్' అనే
నుడివినారు. జీవితమే ద్వన్ద్వాత్మకము. చివరి వరకు చేరదీయవలసినదే. శిశిరము వచ్చింది అంటే వసంతము
వేమబడే వస్తున్నట్లే!
*************************************************************

No comments:

Post a Comment

Pages