శివం – 13
(శివుడే చెబుతున్న కధలు )
- రాజ కార్తీక్
9290523901
(తన భక్తుడైన సాంబయ్య కధను చెబుతూ ఉంటాడు శివుడు )
సాంబయ్య చేసిన పొదుపు అంతా తీసుకొని, నాకు శివరాత్రి రోజు జరిగే ఉత్సవంలో నీ పాదాలకు చెప్పులు కుట్టి అ ఉత్సవం తిలకిద్దామని అనుకుంటున్నాడు. ఇంతలో ఆ గుడికి అ ఊరు మహారాజు తన పరివారంతో వచ్చారు. ఆ మహారాజు తన పరివారం పాదరక్షలను చెప్పుల సాంబ భద్రపరిచాడు. రాజు వచ్చినా పూజ చేసుకొని ఆలయ అర్చకులతో మాట్లాడుతున్నడు. “పంతులుగారు శివరాత్రి దగ్గరపడింది కదా, ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఇకపోతే అయ్యవారిని పెళ్ళికొడుకుగా అమ్మవారి దగ్గరకి తీసుకుపోయేటప్పుడు అయ్యవారికి చేసే చెప్పులు సిద్ధమా?”, పంతులుగారు “అది సాంబయ్య సిద్ధం చేస్తాడు. మహారాజు పరివారం అంతా సాంబయ్య దగ్గర పెట్టిన చెప్పులు తీసుకొని వెళ్ళిపోయారు.
మహారాజు కూడ వచ్చాడు. వచ్చి సాంబయ్యతో “సాంబయ్య నేను నిన్ను ఎన్నో సంవత్సరాల నుండీ చూస్తున్నా. నీవు ఎందుకు ఎవరినీ డబ్బులు అడగవు. నా పరివానానైనా?”
సాంబయ్య “సామీ నాకు రాజు పేద తేడా లేదు. ధనధాన్యాలపై అశలేదు. నాకు కావలసింది ఆ మహారాజు మహాదేవుడే, ఆయన తప్ప నన్ను ఎవరూ స్థిమితపరచలేరు”
రాజు “సాంబయ్యా! నీవు ధన్యుడవు నీకున్న వైరాగ్యమే భగవంతుని మీద ప్రేమ. అవును. ఈసారి ఉత్సవాలకు చెప్పులు కుట్టావా?
సాంబయ్య ”ఆ పనిలోనే ఉన్నా ఇంక కొన్ని సేకరించి ఉత్సవం మొదలయ్యేసరికి తీసుకువస్తాను. సామీ”
రాజు “నీకేమైనా కాఆలా?”
సాంబయ్య” నాకేం వద్దు రాజా, వారిని చూడు. ఆ అవిటివారు వారికి ఏమైనా సాయం చేయి.”
రాజు “ ఏం చేయను సాంబా?”
సాంబయ్య “ ఏ పుణ్యమో శివయ్య నీకు అన్నీ ఇచ్చాడు. వీరికి జీవనానికి సాయం చేయి వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయి అలాగే అలాంటివారికి చిన్న సత్రం లాంటిది నిర్మించు ఆ శివయ్య తప్పక ఆనందిస్తాడు. రాజు “అలాగే సాంబయ్య, నీ కోరిక నెరవేరుస్తాఅను. నీకు కూడా ఏమైనా కావాలా?”
“నాకేం వద్దు సామీ”
రాజు “అవును నీ కుటుంబానికి ఏమీ వద్దా?”
సాంబయ్య “నా కుటుంబాన్ని శివయ్య ఏనాడో తీసుకువెళ్ళాడు.” అంటూ ఏడుస్తున్నాడు సాంబయ్య.
సంబయ్య మన్సు చూసి రాజు మనసు కదిలింది.ఉత్సవంలో కలుద్దామని వెళ్ళిపోతూ అవిటివారందరినీ సత్రానికి తరలించమని ఆజ్ఞాపించాడు.
అక్కడ ఉన్న అవిటివారు “సాంబయ్యా! నీ పుణ్యమా అని మాకు నీడనిచ్చి ఆకలి దప్పికలు లేకుండా చేశావు.” అంటూ తనని ఆశీర్వదిస్తున్నాడు. ఇక శివరాత్రి దగ్గర పడింది.
సాంబయ్య తను చేసిన పొదుపుతో చావడికి వెళ్ళి పట్టణంలో పంచలోహాలన్నీ కొన్నాడు.
సాంబయ్య “స్వామీ శివా! నీకు ఈసారి ఎవరూ కుట్టలేనంత అందంగా కుడతాను. నీకు మంచి చెప్పులు కావాలి కదయ్యా, స్మశానంలో తిరుగుతావు. నీవు పొరపాటున కాలే నిప్పు మీద కాలేస్తే నీకు కాలు నొప్పి పుట్టి గాయం అవ్వదా? నీవు అందర్నీ చూస్తూ ఉంటావు. నిన్ను ఎవరు చూస్తారు? నీ గాయానికి మందు ఎవరు ఇస్తారు?” అంటూ చెప్పులకు సరిపడ సామాన్లు అన్నీ తీసుకొని తన కుటీరానికి పయనమయ్యాడు.
ఊరంతా ఉత్సవంగా ఉంది అందరూ శివరాత్రి ఆనందంలో ఉన్నారు. సాంబయ్య కూడా ఆనందంగా ఉన్నాడు. ఈ సారి తను కుట్టిన చెప్పులు నేను వేసుకుంటానని. జోరున వర్షంపుడుతుంది. మార్గమధ్యంలో ఉన్న సాంబయ్య తలదాచుకోవడానికి ఏమీ దొరకలేదు.
“ఆగితే చెప్పులు ఉత్సవానికి అందించలేనేమో శివయ్యా అనుకుంతూ బయలుదేరాడు. “ పరీక్ష కకపోతే అన్నీ సామాన్లుకు కావాల్సిన డబ్బులు ఈరోజే సమకూరాలా? ముందు వచ్చి ఉంటే ఈ పాటికి అందంగ చెప్పులను కుట్టేవాడిని కదా అనుకుంటూ వెళ్తుంటే సాంబయ్యకాలికి పెద్ద ముల్లు గుచ్చుకొని గాయం అయ్యి రక్తం వచ్చింది. ఆ గాయం వైపు చూస్తూ “నాకు ఏ గాయమైనా నీ పాదాలకు చెప్పులు కుట్టీ తొడిగేంత వరకూ నేను చెప్పులు తొడగను శివా అంటూ తన కుటీరానికి చేరాడు. వర్షంలో తడిసి ముద్దైన సాంబయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది.
అంతే కూలబడిపోయాడు.
చెప్పుల సామగ్రి అంతా పోయి ఒక మూల పడిపోయింది. ఒళ్ళు కదలని జ్వరం వచ్చింది సాంబయ్యకీ, స్పృహ తప్పుతున్న సాంబయ్య మంచం మీద వాలి ”శివయ్యా నీకు చెప్పుల మొక్కు ఎలా తీర్చుకోవాలి? అంటూ స్పృహ తప్పాడు.
కాసేపట్లో ఉత్సవం మొదలవుతుంది.
“రాజా! చెప్పుల శివ సాంబయ్య తెచ్చే చెప్పులు తన స్వహస్తాల మీదుగా నాకు తొడగనివ్వు. ఎంత అవాంతరం వచ్చినా ఉత్సవం కొనసాగించండి.” అనేసరికి రాజుగారు నిదురలేచారు. అది నేను కలలో రాజుకు వేసిన ఆజ్ఞ. రాజుగారు లేచి వెంటనే ఉత్సవవిగ్రహం దగ్గరకి వెళ్ళాడు. పంతులుగారు అందరూ ఉత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపు సిద్ధం రాజు గారు తన కలను అందరికీ చెప్పాడు. అందరూ విస్తు పోయారు.
“ఎక్కడున్నాడు సాంబయ్య?” అన్నారందరూ
స్పృహ తప్పిన సాంబయ్య కళ్ళు తెరిచాడు. సాంబయయ్ కీ తన కుటీరంలో ఏదో వెలుగు కనబడింది. ఓపిక చేసుకొని లేచాడు కొంచెం. సాంబయ్యకి త్రిశూలనీడ కనబడింది. ఆ వెలుగులో ఎవరో చెప్పులు కుడుతున్నట్లు నీడ కూడా కనపడింది.
సాంబయ్యకి ఏమీ అర్థం కాలేదు.
అది ఏమన్నా కలా అని చూస్తున్నాడు.
మంచం మీద నుండి లేవబోయి కింద పడ్డాడు. సాంబయ్య. కింద పడి అటుగా చూస్తే నేను సాంబయ్య నోరు తెరిచి చూస్తున్నాడు. సాంబయ్య తెచ్చిన సామగ్రి తీసుకొని క్రింద కూర్చుని ఒక కాలు ముందుకు పెట్టి త్రిశూలాన్ని నిలబెట్టి సాంబయ్య మనసులో ఏవిధంగా అనుకున్నాడో ఆ విధంగా పాదరక్షలు సిద్ధంచేస్తున్నాడు.
సాంబయ్య కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగ వస్తున్నాయి.
“శివయ్యా నా మొక్కు నువ్వు తీర్చావా? నీ మొక్కు నీవే తీర్చుకుంటున్నావా?” అంటున్నాడు. ఎందుకో భోరున ఏడుస్తున్నాడు.
పార్వతీదేవి నోరు తెరిచి చూస్తోంది. నంది కళ్ళ్వెంట నీళ్ళు బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నాడు.
విష్ణుదేవుడు, మహాదేవుడు భక్తుల కోసం ఏదైనా చేస్తాడు”
అన్నట్లు చూస్తున్నాడు.
నడవలేని సాంబయ్య నేలమీద నుండి దేకుతూ వచ్చి నిశ్చేష్టుడై చూస్తున్నాడు. నేను “చూడు సాంబయ్యానా గురించి ఎవరూ పట్టించుకోవట్లా చూడు న కాలికి ఎంత గాయం అయిందో అని ముందున్న కాలిని చూపించాడు. సాంబయ్య తన కాలిని చూసి గాయం లేదని నిర్థారించుకొన్నాడు. “నువ్వు ఏదో చెప్పులు కుట్టి నాకు ఇస్తావు అనుకుంటే నీకు ఓపిక లేదుగా అందుకే నేను కుట్టాను చెప్పులు.
సాంబయ్యా స్పృహ తప్పాను స్వామీ, లేకపోతే నేనే కుట్టేవాడిని. అంటున్నడు తల ఊపుతూ నేణు ఏమీ ఫరవాలేదులే, నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టావు నేను ఏమన్నా అనుకున్నానా చెప్పు.” కరుణకైనా దేనికైనా హద్దు ఉంటుంది స్వామీ కానీ నీవు నా కోసం” అని ఏడుస్తున్నాడు. అటు దేకుతూ వెళ్ళి పసరు తెచ్చి నా కాలికి పూస్తున్నాడు.” క్షమించు సామీ నాకు స్పృహ లేదు.
నేను “చెప్పులు బాగా కుట్టానా సాంబయ్యా! నీవు అనుకున్నట్లు”
సాంబయ్య “ ఆ కానీ…..”
(సశేషం...)
No comments:
Post a Comment