తునకలు - అచ్చంగా తెలుగు
తునకలు
***********
-- ఆచంట హైమవతి

మౌనం-
మానస గానం!
మానం-
మానిని ప్రాణం!
గతం-
కాదు వ్యక్తీగతం!
భావం-
కాదు భవితం!
శిశువు-
శిశుపాలుడైతే-
మాత-
మహా కాళి!
ఉచ్చ్వాస-
నిశ్వాసాలకు-
లేదు మేనిమీద
విశ్వాసం!
కన్నీరు-
మనసుకు స్వాంతనం!
మున్నీరు-
నదులకు స్వాంతనం!
సంఘంలో-
పెద్దైతేనేం..?
సత్సీలానికి-
పెద్ద కావాలిగా!!
పూనకం-
మానసిక జాడ్యం!
 వికారం-
జిహ్వకి జాడ్యం!
మెరుపు-
అంధుడికి తెలీదు!
ఉరుము-
బధిరుడికి తెలీదు!
అడుగులు-
మనసు మాట వినవు!
మనసు-
మనిషి మాట వినదు!
విశ్రాంతినిచ్చేది-
గాఢ సుషుప్తి!
మనశ్శాoతినిచ్చేది-
ప్రగాఢ విశ్వాసం!

No comments:

Post a Comment

Pages