సాహసీ.... - అచ్చంగా తెలుగు
సాహసీ....
- కాట్రగడ్డ కారుణ్య


హద్దులెరగని మోహంతో ఉన్మాదిలా 
తెగబడుతున్న వాడి కబంధ హస్తాలను చూసి 
భీతిల్లుతావేం సాహసీ

క్షణాల అంతం లెక్కిస్తూ భాధాఛాయల్ని
 విడువలేక మౌనంగా శలవడిగిపోతున్నావు
 లేదు లేదు సాహసీ

నిన్నటి మల్లే ప్రభాతం నీకోసమూ ఉదయిస్తుంది 
నీలోని ఆత్మ అపజయం ఓపదు 
తేజోమయంగా వెలిగిపోతున్న 
హృదయదీపాన్ని వెలిగించు సాహసీ

నీకు నీవే ప్రోద్భలమై శౌర్యంతో 
వాడికి శిలువవెయ్యి దేహబలంతో 
దౌర్జన్యంతో బంధించాలని రహస్య మోహాలతో
 పరితపించే ప్రతి ఒక్కడికి జ్వాలశిఖవై ఎదురేగు....!!!!

No comments:

Post a Comment

Pages