రుద్ర దండం – 8 - అచ్చంగా తెలుగు
రుద్ర దండం – 8
-      ఫణి రాజ కార్తీక్

(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతుండగా ఆమె పరాకును గమనించిన శివుడు, కోపించి, తన చేతిలో ఉన్న రుద్ర దండాన్ని విసిరివేస్తాడు. అది ముక్కలై జంబూద్వీపంలో అనేకచోట్ల పడుతుంది. అవన్నీ దక్కించుకుని, జోడించిన వాడు శివుడే అవుతాడు. రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కపాలుడు. కాశీ నగరంలోని శివాలయంలో  రుద్రదండాన్ని సాధించబోయే కారణ జన్ముడు పుడతాడు... ఆ సమయంలో అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ఒక ఒంటి కన్ను రాక్షసుడు... ఇక చదవండి...) మహారాజా ! ఆ ఒంటికంటి రాక్షసుడ్నినియంత్రించడానికి ఒక మార్గం ఉంది” అని అక్కడ ఉన్న  రాక్షసుడ్ని గుడి బయటకు వచ్చి ఎగాదిగా చూసాడు. అక్కడన్న ఋషులకు ,మహర్షులకు ,”అయ్యా! తామందరూ దయచేసి మీ తపస్సు కొంత శక్తిని ఆ జలంలోకి తీసుకోండి”, అని చెప్పాడు. ఆ రాక్షసుడు “రాజా! మరికొన్ని నిమిషాలు మాత్రమే వేచివుంటా . ఆతర్వాత తెలుసుగా ఏమి చేస్తానో “ అని.. ‘హా హా’ అని నవ్వసాగాడు. కేశవసేనుడు  “ఆర్యా! ఏమి ఆ మార్గము ,తొందరగా చెప్పండి “ అన్నాడు . రాణి స్పృహ తప్పి ఉంది. ఋషులు మంత్రం జలమును సిద్ధం  చేసారు. వాటిని విష్ణునంది ‘కాశీవిశ్వనాధునికి ‘ లింగానికి అభిషేకము చేసి ,మళ్ళీ ఆజలమును జాగ్రత్త చేయమన్నాడు. అంతా అలాగే చేసారు. విష్ణునంది తన మూట దగ్గరకు వెళ్లి దానిని విప్పాడు.అందులో ఒక బాకు ఉంది. దానిమీద ఎదో మీట లాగా వుంది . దానిని నొక్కాడు. అంతే ..అందరూ ఆశ్చర్యపోయే విధంగా ,అది రెండు కొనలు ఉన్న కత్తిగా అయింది. సన్నగా 5 అడుగులు ఉంది. దాన్ని చూసి అందరూ “ ఏమిటి, ఏమిటి “ అనుకోసాగారు. ఇంతలో జలం తెచ్చారు ఋషులు . విష్ణునంది  ఆలయం బయటికి వచ్చాడు. రాక్షసుడు “ ఏరా ,అంత ధైర్యం, నాముందుకే వచ్చావా?” అన్నాడు. విష్ణునంది ,” చూడు ,ఎప్పుడో చచ్చినదానికి ఇప్పుడు ఈ పసిబిడ్డ ని చంపుతావా ?” రాక్షసుడు , “నాకెలా తెలుసు”  అని కోపంతో ఊగిపోయాడు. అతడు ముందుకు రాబోయి ,ఆలయంలోకి ప్రవేశించలేనని తెలుసుకొని ఉన్నాడు. సిద్ధపరచిన ఆ అభిషేక మంత్రం జలమును  విష్ణునంది  దగ్గరకు తెచ్చారు భటులు. విష్ణునంది “నీకు మర్యాదగా చెప్తున్నా ,నామాట విను, వెళ్ళిపో “ అన్నాడు. ఆ రాక్షసుడు “ నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు ,నన్ను ఎవరూ చంపలేరు”.... అన్నాడు. విష్ణునంది “నిన్నుబాధపెట్టాలి అంటే చంపాలా ? చూడు “ అని ,తనదగ్గర ఉన్న మర కత్తిని ,మంత్రజలంలో ముంచి, ఎత్తి ఆకాశంలోకి చూసాడు. అంతే .ఉన్నట్లుండి ,మేఘాలు మెరిసి ,వర్షం పడటం మొదలయ్యింది.ఆ వర్షం అందరికీ ఆనందంగానే వుంది. కానీ రాక్షసుడికి మాత్రమే ఒళ్ళు దహించుకు పోతోంది . రాక్షసుడు “మంటలు,మంటలు “ అని అరవసాగాడు .తన కనుగుడ్డుని రెండు చేతులతో మూసుకోసాగాడు. అందరూ ఎంతో సంతోషించారు. వెనువెంటనే భటులు వచ్చి ,రాక్షసుడికి గురిపెట్టి ,పుంఖాను ,పుంఖాలుగా బాణాలు వదిలారు .ఆ బాణాలు వాడిని బాధించాయి. అంత కన్నా ఆ వర్షమే వాడిని చంపేస్తోంది. వాడు రోదించ సాగాడు. వెనువెంటనే మహారాజు వెళ్లి ,వాణ్ణి కత్తితో  ఖండించుదామని అనుకున్నాడు . రాక్షసుడు తన కనుగుడ్డుకి బాణాలు తగులుతాయేమోనని చేతులు అడ్డం పెట్టుకున్నాడు. రాజు ఎంతనరికినా , వాడి శరీరంలోకి కత్తి దిగుటయేలేదు .అంతలో విష్ణునంది తన దగ్గర ఉన్న కత్తిని రాజుగారికి విసిరేశాడు . అర్ధం చేసుకున్న రాజు ,ఆ కత్తితో రాక్షసుడ్ని నరికేశాడు. బాధతో వాడు అరుస్తున్నాడు. “ఆ రాక్షసుడి శరీరం వేరు చేసినా ,వాడికి ఏమీ కాదు. మళ్ళీ ఎప్పటిలా అతుక్కుంటుంది .” అని చెప్పాడు విష్ణునంది . ఏమిచేయాలా అని తోచుచుండగా , మహారాజు “వాడి శరీరభాగాలను ఎక్కడ ,ఎక్కడ వేయమని “ ఆజ్ఞాపించాడు. కానీ రాక్షసుడి ఒంటికంటి  తల మాత్రము “నేను నన్ను నరికింది ఎవరా అని చూడాలా ,మళ్ళీ వస్తావా ,నీ అంతు చూస్తా “ అంటున్నాడు. వాడి రోదన ఎవరూ వినకుండా ,వాడ్ని ముక్కలు ,ముక్కలుగా మూటకట్టి పారేయడానికి భటులు పయనమయ్యారు. అందరూ గండం గడిచింది అనుకోసాగారు. ఇంతలో రాణి స్పృహలోకి వచ్చింది. అందరూ విష్ణునంది కి ధన్యవాదాలు చెప్పారు. ఖడ్గం తిరిగి ఇచ్చారు.ఆ ఖడ్గం మీట నొక్కగానే మళ్ళీ బాకులాగా మారింది. రాణి ,రాజు ఇరువురూ ,విష్ణునందిని వారి అంతఃపురానికి ఆహ్వానించారు. దానికి అతను సమ్మతించాడు యువరాజును  ఎత్తుకుని ముద్దాడాడు విష్ణునంది. ధన్యవాదాలు చెబుతున్నట్లు ,ఆశిశువు తన చేతిని విష్ణునంది చేతిలో పెట్టాడు. విష్ణునంది ఎంతో సంతోషించాడు. ఋషులను సైతం గౌరవించి వారికి , రాజ్యంలో ఆహ్వానం ఏర్పాటుచేసి ,వారిని సత్కరించాడు రాజు. ‘ఆబాకు రహస్యం ఏమిటి ‘అని రాజు , కేశవసేనుడు అడిగారు విష్ణునందిని . దానికి “రాజా !అది మాగురుదేవులు నాకు ఇచ్చిన బహుమతి. అడవిలో సంచరించే నేను , ఏదైనా ప్రమాదానికి గురి అవుతానేమో అని ఇది ఇచ్చారు. ఇంతవరకూ దానితో అవసరం పడలా. ఇప్పుడు మీ రాజకుమారుడికోసం వాడవలసి వచ్చింది. “అని చెప్పాడు. అందరూ ఆనందపడ సాగారు. మరొక్కమారు కాశీవిశ్వనాధుడికి నమస్కరించి ,వారి రాజ్యానికి బయలుదేరారు. విష్ణునందికి కూడా ఆ కారణజన్ముడిని  కాపాడినందుకు చాలా ఆనందంగా వుంది. రాజ్యంలో యువరాజు  పుట్టినందుకు సంబరాలు చేసుకున్నారు.యువరాజుకు చేయవలసిన అన్ని క్రియలు చేసారు రాజదంపతులు. ఒక పండగలా చేసారు. ఋషులు , విష్ణునంది అందరూ  రాజ్యక్షేమము కోసం యజ్ఞాలు చేసారు. అంతా ఆనందంగా ఉన్నారు. ఇక ఒకటే మిగిలిఉంది. యువరాజుకు నామకరణం. అందరూ ఏపేరు పెడితే బాగుంటుంది అని యోచించ సాగారు. ఆ బాలకుడి జాతక చక్రం గుణించారు పండితులు, విష్ణునంది. విష్ణునంది యువరాజు జాతకం చూసి , అతను చేసే సాహసాలు ,ప్రయాణాలు ,వింతలు అన్ని గుణి౦చుకున్నాడు.  అతని ధ్యాన శక్తికి అతడు శివగణాలలో ఒకరు అనిపించింది అతను పుట్టినప్పుడు. అది నిజం. అతడు ఒక మహత్కార్యం కోసం జన్మించాడు . ధ్యానంలో ఉన్న విష్ణునంది ,బాలుడు పుట్టింది ఏకార్యం కోసమా అని చూసాడు. ఆశ్చర్యం..అతగాడు పుట్టింది “రుద్రదండం” కోసం. విష్ణునంది ఆశ్చర్యపడి ,నిద్రపోతున్న ఆ బాలుణ్ణి ఎత్తుకుని , చెవిదగ్గర ‘రుద్ర,రుద్ర’ అని పిలిచాడు. నిదురిస్తున్న ఆశిశువు ఉలిక్కిపడి లేచాడు . వెనువెంటనే మహారాజు వద్దకు వెళ్లి ,యువరాజుకు పేరు నిర్ణయించా అన్నాడు. ఏమిటి అని అందరూ అడగ్గా “ రుద్రసేన కార్తికేయుడు “ అని కేశవసేనుడి సభలో చెప్పాడు . అందరూ ‘రుద్ర’ అని పిలవాలని చెప్పాడు. (సశేషం...)

No comments:

Post a Comment

Pages