కమ్మని జీవితం..కరోనా వరప్రసాదం - అచ్చంగా తెలుగు

కమ్మని జీవితం..కరోనా వరప్రసాదం

Share This
కమ్మని జీవితం..కరోనా వరప్రసాదం
 -ప్రతాప వెంకట సుబ్బారాయుడు 



సంతృప్తి అనే పదం నిఘంటువులోంచి కనుమరుగవుతుందనుకొన్నా,
ఉమ్మడి కుటుంబాలు విడిపోయినట్టు 
జర్రున జారిపోతున్న కాలం గాలానికి చిక్కి 
కటుంబ సభ్యులూ విడిపోతారనుకున్నా !

విలాసాలకీ..విహారాలకి అలవాటు పడ్డ కాళ్ళు 
జీవితాలకు ఊపిరి చిక్కదేమో అనుకొన్నా 
ఒకచోట నిలబడ్డం కల్లనిపించింది 
హారతికర్పూరం కావల్సిందే 
అన్న నిర్ణయానికి వచ్చేశా ! 

ఎంత సంపాదించినా ఆడంబరాల 
ముందు
కానీ కరోనా మహామ్మరిలోనూ..
అమ్మ ఉందిగా
పిల్లలకి ప్రాక్టికల్ క్లాసు 
కండక్ట్ చేసి మరీ చెప్పింది 

మనసుకు రెక్కలు కట్టుకొని 
అహర్నిశం ఎగరడం జీవితంకాదు,
కుదురుగా అనుభూతించాల్సిన వరప్రసాదం అని అందుకే..ప్రతిదానికీ బొమ్మే కాదు 
బొరుసూ ఉంటుందనేది!

***

No comments:

Post a Comment

Pages