శ్రీథరమాధురి - 75 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 75

Share This
శ్రీథరమాధురి - 75
                     (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)



ధర్మం-అధర్మం, ఆనందం-దుఃఖం, అనేవి పూర్తిగా బుద్ధి వేసే ఎత్తులు, వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కర్త కాదు, వాటి ద్వారా వచ్చే పరిణామాల ఫలాలూ మీవి కాదు. మీరు మచ్చలేని సత్యము, మీరు పూర్తి స్వేచ్చతో ఉన్నారు.
***

అతను – గురూజీ, నేను బాగా వ్యాకులపడి ఉన్నాను. నాకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ రాలేదు. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది? ఇదేం తలరాత గురూజీ?
నేను – చూడు, నీకు సీనియర్ మేనేజర్ గా ప్రమోషన్ లభించినప్పుడు, మీ కంపెనీ లో నీకన్నా సమర్ధులైన వారు ఉండగా, ‘నాకే ఎందుకు ప్రమోషన్ వచ్చింది?’ అని నువ్వు నన్ను అడగలేదు. ఈ పధ్ధతి మంచిది కాదు. జీవితంలో మంచి విషయాలు జరిగినప్పుడు, నువ్వు, ఎందుకు జరిగాయని అడగలేదు. దీనికి విభిన్నంగా జరిగినప్పుడు మాత్రం వెంటనే నువ్వు నీకిలా ఎందుకు జరిగిందని అడుగుతున్నావు. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు అది తలరాత లేక ప్రారబ్ధం కాదు, కాని, నష్టం జరిగినప్పుడు మాత్రం తలరాత అనడం ఎంతటి వంచన?
అతను వెళ్ళిపోతూ ఉండగా, నేను నవ్వి, ఇలా అన్నాను – ‘దీని గురించి విచారించకు. వచ్చే వారం వాళ్ళు మరి ముగ్గురు వ్యక్తుల లిస్టు విడుదల చెయ్యబోతున్నారు. ఆ లిస్టులో నీ పేరు ఉంటుంది.’
అంతా దైవానుగ్రహం, మా ప్రార్ధనలు. 
***

మానవ అవగాహనను, గ్రహణ శక్తిని, దైవం యొక్క శాంతి అధిగమిస్తుంది. అహంకార పూరితమైన బుద్ధితో, దైవాన్ని నిర్వచించేందుకు చేసిన ప్రతి ప్రయత్నము కొన్ని కోట్ల మార్లు వాస్తవం కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే దైవమనే నిగూఢత్వంలో మునిగిపోండి, ఆయన పాదాల వద్ద సంపూర్ణ శరణాగతిని వేడండి. ఆయన ఇచ్చ లేకుండా ఇది కూడా జరగదు. అందుకే మేము ఆయన దీవెనల కోసం ప్రార్ధిస్తున్నాము. ఇది కూడా నా హృదయంలోకి ఆయన సంకల్పం, దయ వల్లనే వస్తోంది. దైవాన్ని కొనియాడండి.
***

గతాన్ని విచారం లేకుండా అంగీకరించండి.
మీ ప్రస్తుతాన్ని ఆత్మవిశ్వాసంతో నడపండి.

మీ భవిష్యత్తును బెదురు లేకుండా ఎదుర్కోండి.
***

No comments:

Post a Comment

Pages