నూరేళ్ల తెలుగు కథా అధ్యయనమే ‘కథాంశం’ - అచ్చంగా తెలుగు

నూరేళ్ల తెలుగు కథా అధ్యయనమే ‘కథాంశం’

Share This
నూరేళ్ల తెలుగు కథా అధ్యయనమే ‘కథాంశం’
జాని తక్కెడశిల 



వందేళ్ల చరిత్ర ఉన్న తెలుగు కథ ఎన్నో పోరాటాలు చూసింది. మరెన్నో సమస్యలకు పరిష్కారమైంది. ప్రపంచదేశరాష్ట్ర ఉద్యమాలకు బాసటగా నిలిచింది. 1910లో గురజాడ గారి దిద్దుబాటు కథ మొదటి ఆధునికాంధ్ర కథానిక. ఆ తర్వాత శ్రీపాదచలంకొడవటిగంటికరుణ కుమార,  బండారు అచ్చమాంబగోపీచంద్పాలగుమ్మి పద్మరాజుబలివాడ కాంతారావుబుచ్చిబాబుమధురాంతకం రాజారాంకొమ్మూరి వేణుగోపాలరావుశీలా వీర్రాజుమంజుశ్రీహితశ్రీవాకాటి పాండురంగారావుముళ్ళపూడి వెంకటరమణ లాంటి గొప్ప రచయితలు తెలుగు కథను ముందుకు నడిపారు. ఆ తర్వాత  చాసోరావిశాస్త్రికాళీపట్నం రామారావురంగనాయకమ్మకోడూరి కౌసల్యా దేవిలత,  రామలక్ష్మిభానుమతిమాలతీ చందూర్ తెలుగు కథా పురోగాభివ్రుద్ధికి తమ వంతు కృషి చేశారు. కేతు విశ్వనాథ రెడ్డిసింగమేనని నారాయణశాంతి నారాయణబండి నారాయణ స్వామిఅల్లం రాజయ్యసన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి లాంటి రచయితలు కథా సాహిత్యానికి రథసారథులై ముందుకు నడుపుతున్నారు.
తెలుగు కథా సాహిత్య అభివృద్ధిలో కథకుల కృషితో సమానంగా తెలుగు విమర్శకుల కృషి కూడా ఉన్నది. తెలుగు కథ తప్పు దావా పట్టినప్పుడల్లా మన విమర్శకులు సరైన మార్గంలో నడపడానికి కృషి చేసి సఫలీకృతం అయ్యారు. కందుకూరి వీరేశలింగంపంతులువేదం వేంకట రాయ శాస్త్రికట్టమంచి రామలింగారెడ్డిరాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ లాంటి వాలెందరో తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదలకు కృషి చేశారు. సింగమేననిరాధేయరాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి లాంటి పెద్దలు తెలుగు సాహిత్య విమర్శను ముందుకు నడుపుతున్నారు. వీరిలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగు సాహిత్య విమర్శకు పెద్ద దిక్కుగా ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శలో గత నలభై సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తున్నారు. అందులో భాగంగా 2006లో కథాంశం పేరుతో తెలుగు కథానిక సాహిత్యంపై విమర్శ వ్యాస సంపుటిని తెలుగు సాహిత్య లోకానికి అందించారు. 258 పుటలు ఉన్న పుస్తకంలో 23 వ్యాసాలు ఉన్నాయి.
తిలక్ గారి కథలను విశ్లేషిస్తూ రాచపాలెం గారు కథానిక యొక్క వీక్ పాయింట్ గురించి ఇలా తెలియజేశారు. “కథానికలో ఒక పాయింట్ లేక ఒక లక్ష్యం ఉంటుందనీపాత్రలు సంభాషణలు వంటి ఇతరాంశాలు ఆ పాయింటును అభివృద్ది చేయడానికిఆ పాయింటు ద్వారా రచయిత అందించాలనుకున్న సందేశమూనీతో పాఠకుని గుండెకు హత్తుకునేట్టు చేయడానికి దోహదపడాలని విమర్శకుల అభిప్రాయం అయితే ఏ కథానికలోనైనా ఒక సన్నివేశమూసంఘటనో ఉంటుంది. దానిలో ఒక సమస్య ఇమిడి ఉంటుంది. కథకుడు దాని పుట్టుకకు బలమైన కారణం చూపాలి అప్పుడే కథానిక వాస్తవికంగా ఉంటుంది.” నేటి కథకులలో చాలామంది కథకు ఒక లక్ష్యంకథకు సామాజిక ప్రయోజనం లేకుండా రాస్తున్నారు. ఊసుపోనికాలక్షేపశృంగారసమాజాన్ని విచ్చిన్నం చేసేసోమరితనాన్ని పెంచేచైతన్యం లేని కథలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మంచి కథలుసామాజిక ప్రయోజనం ఉన్న కథలు గుర్తించడానికి విమర్శకుల అవసరం ఎక్కువగా ఉన్నది. ఎన్ని కథలు రాశామని కాదు తమ కథల ద్వారా సమాజంలో ఎంతటి మార్పు తీసుకు వచ్చమా అనేది ముఖ్యం. నేటి కథకులు దానిని విస్మరించకూడదు.
గురజాడ గారి కథలపై విశ్లేషణ చేసిన రాచపాలెం గారు గురజాడ వారి రచనల ద్వారా సామాజిక బాధ్యతను గుర్తు చేశారనితెలుగు సాహిత్యాన్ని సంకుచితత్వం నుండి విశాల ప్రపంచంలోకిఅద్భుతత్వం నుండి వాస్తవికతలోకిఅనుపూర్వికత నుండి ఆధునికతలోకి తెచ్చారని అభిప్రాయపడ్డారు. మొదట తెలుగు సాహిత్యం దేవుళ్లురాజులు చుట్టూ తిరిగేది. గురజాడ గారే తెలుగు రచనను ప్రజలకు చేరువ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. వాడుక భాషలో కథలను రచించి ప్రజలను అనేక సమస్యల పట్ల చైతన్య పరిచారు. ఊహ లోకం వీడి వాస్తవిక జగతులోకి రచనలను తెచ్చిన ఘనత గురజాడ గారిదే.
గురజాడ గారు సాహిత్యంపై చేసిన కొన్ని వ్యాఖ్యానాలను పరిశీలిస్తే :
1.సాహిత్యానికి సమకాలీన మానవ జీవితం వస్తువు కావాలి. అంటే సామాజిక వాస్తవికత సాహిత్యానికి వస్తువు.
సాహిత్య వస్తువులు సమాజం నుండి సమాజం కొరకు ఉండాలి. అలా కాకుండా ఊహలుకల్పనలు నుండి ఉండకూడదు. అంటే రచయిత మేధస్సు నుండి వచ్చే రచనల కంటే సమాజం నుండి వచ్చే వస్తువులే సాహిత్యాన్ని నిలబెట్టుతాయి.
2. కాలంతో పాటు సాహిత్యం మారుతుంది.
ఏ సాహిత్య ప్రక్రియ అయినా కాలంతో పాటు మారుతూ ఉంటుంది. కాలానికి అవసరమైన సాహిత్యాన్ని రచయితలు సృష్టించాలి. ఆధునిక కాలంలో మూఢనమ్మకాలపై సాహిత్యాన్ని సృష్టించి ప్రజలను తిరోగమనం వైపు నడపకూడదు. భావ వాదంలో ఉండి అభ్యుదయ రచనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక రచయిత నలభై సంవత్సరాల నుండి సాహిత్యాన్ని రాస్తున్నారు అనుకుంటే వారు మొదట రాసిన సాహిత్యం ఆ తర్వాత కాలంలో రాసిన సాహిత్యానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. రచయిత కాలానికి అనుగుణంగా మారి తనను తాను నిర్మించుకున్నారా లేదా అనేది చూడాలి తప్ప. రచయిత మొదట్లో రాసిన సాహిత్యాన్ని తీసుకొని ఇప్పుడు విమర్శకు పెట్టడం సరికాదు. రచనను తిరస్కరించే అవకాశం ఉంటుంది కానీ రచయితను కాదు.
3.రచయితకు జీవితం పట్ల అవగాహన ఉండాలి.
సాహిత్యం ముఖ్యమాజీవితం ముఖ్యమా అంటే చాలామంది రచయితలు సాహిత్యమే ముఖ్యమని అది లేకపోతే జీవించలేమని అంటూ ఉంటారు. సాహిత్యంపై ప్రేమ ఉండవచ్చు కానీ సాహిత్యం కంటే జీవితమే ముఖ్యమని రచయితలు తెలుసుకోవాలి. జీవితం లేని సాహిత్యం ఉండదు.
4.సాహిత్యం సమాజంలోని లొసుగులను బహిర్గతం చేసి వాటిని నిర్మూలించడానికి కృషి చేయాలి.
రాజుల కోసందేవుళ్ల కోసం వారిని పొగుడుతూ వచ్చిన సాహిత్యం పీడిత ప్రజల కొరకు అదే రాజ్యాలనుప్రభుత్వాలను ఎదిరించేప్రశ్నించే స్థాయికి ఎదిగింది. ఇంకా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండిఅవార్డులకుపురస్కారాలు మొహం వాచిన రచయితలు సృష్టించే సాహిత్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
5.సాహిత్యం కళా అయినప్పటికీ దానికి ప్రధానమైంది మాత్రం మానవ జీవితమే.
సాహిత్యం ఒక కళ. అది అందరికీ సహజంగా వచ్చేది కాదు. కానీ అభ్యాసంఅధ్యయనంతోమానవ జీవితాన్నిసమాజాన్ని అర్థం చేసుకోవడంతో మంచి సాహిత్యవేత్తలుగా రూపాంతరం చెందవచ్చు. సమాజం నుండిమానవ జీవితం నుండి వచ్చే వస్తువులే రచయితల సాహిత్యాన్ని నిలబెట్టుతాయి.
 ఐదు వాక్యాలు గురజాడ గారు చేసినవి అయితే వాటిని కాస్త విశ్లేషణ చేసి అందించాను. సాహిత్యంపై ఇంతటి అవగాహన ఉన్న రచయిత కనుక గురజాడ అగ్రగామి రచయితగా కొనసాగుతున్నారని రాచపాలెం గారు తెలియజేశారు. వర్తమాన సామాజిక విలువల్ని వాటి మూలాల్ని ప్రశ్నించి చర్చకు పెట్టడమే గురజాడ సాహిత్య తత్వమని చెప్పిన రాచపాలెం గారు వారి శిల్పం గురించి చెప్తూ మంచి కథకు ఉండవలసిన లక్షణాలు క్లుప్తతఅనుభూతి ఐక్యతసంఘర్షణనిర్మాణ సౌష్టవమని తెలియజేశారు.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు ఆధునిక తెలుగు కథకులలో ముఖ్యులు. వారి కథా సాహిత్యాన్ని గురించి రాచపాలెం గారు చెప్తూ పెద్దిభొట్ల గారి సాహిత్యం స్వాతంత్ర్యానంతర భారతీయ వాస్తవికతకు విమర్శనాత్మక ప్రతిబింబాలు అన్నారు. వారి కథా వస్తువు సమకాలిన జీవితంవారి దృక్పథం ఆధునికం. వస్తువు జీవితం నుండి పుట్టినప్పుడే రచన సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. సహజ రచనలువాస్తవిక రచనలుసమాజం నుండి పుట్టిన రచనలు మాత్రమే సాహిత్య లోకంలో తమ ఉనికిని నిలబెట్టు కుంటాయి. సామాజిక బాధ్యత గల ఏ రచయిత అయినా కథా శిల్పంలో జిమ్మిక్కులు చేయరనిఅయితే ఎక్కువగా వివరణలు ఇవ్వడం శిల్ప ధర్మాన్ని విస్మరించడమేనని తెలియజేశారు. చాలా మంది రచయితలు కథలో సంభాషణలు అధికంగా ఉంచడంసంఘటనల్ని సాగదీయడంఅనవసరమైన చర్చలు పెట్టడం లాంటివి చేసి శిల్పాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. వస్తువు ఎంత గొప్పదైన శిల్పంలో తప్పులు జరిగితే రచన తేలిపోతుంది.
ఏ సాహిత్యమైన రెండు పాయలుగా నడుస్తూ ఉంటుంది. మొదటిది సహజ పాయ రెండోది వ్యాపార కాలక్షేప పాయ. సాహిత్యాన్ని వ్యాపారం చేస్తూ సమాజాన్ని నాశనం చేసే వ్యాపార పాయను ఇప్పటికీ మనం గమనించవచ్చు. ప్రతి సంవత్సరం వెయ్యి కథలు వస్తున్నాయి అనుకుంటే ఇందులో పది శాతం మాత్రమే మొదటి పాయకు సంబంధించినవి. జీవిత సమస్యలు ఏకరవు పెట్టి జీవితం మీద విరక్తిభయం కలిగించేలా రచనలు ఉండకూడదు. జీవితం యొక్క గొప్పదనంజీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకునే అవకాశం ఇచ్చేలా రచనలు ఉండాలి. ఆధునిక రచయితలకు సమాజం పట్లచరిత్ర పట్ల విమర్శక దృష్టి ఉండాలని కానీ వ్యామోహం ఉండకూడదు. అభ్యుదయభౌతికవాదములుగా ఆలోచించి సాహిత్యాన్ని సృష్టించాలి. అలా కాకుండా వచ్చే సాహిత్యం సమాజాన్ని తిరోగమనం పాలు చేస్తుంది.
వస్తువుశిల్పంభావజాలంకథా నేపధ్యంకథా నిర్మాణంపాత్రల చిత్రణకంఠస్వరందృష్టి కోణం లాంటి అనేక విషయాలపై కొత్త రచయితకు సరళంగా అర్థమయ్యేలా వివరించారు. కథలను నిర్మించే పద్ధతులను తెలియజేస్తూ కథా సాహితి కథా నిర్మాణ పద్ధతులపై వివరణాత్మకంగా వ్యాసాన్ని అందించారు. కథా రచనకథా నిర్మాణం వేరని చెప్తూ ఇలా అన్నారు. “ ఏదో ఒక వస్తువు తీసుకొని వికాసం లేని పాత్రలురుచిలేని సంభాషణలు జోడించి యాంత్రికంగా కథలు రాయడమే కథా రచన అని తెలియజేశారు. కథా నిర్మాణం యాంత్రికంగాకాకతాళీయంగా సిద్దించదని రచయిత ప్రయత్నం చేసి సాధించాలి అన్నారు. అంటే కథల్లో ఉండే పాత్రలుసంభాషణలునేపధ్యందృష్టి కోణం ఇవన్నీ కథా నిర్మాణానికి ఉపయోగపడేవి.
కథా నిర్మాణ పద్ధతులు :
గత వర్తమానాల మధ్య కథా సంచారం :
కథను వర్తమానంలో ప్రారంభించిగతంలోకి తీసుకుపోయి తిరిగి వర్తమానంలోకి తెచ్చి ముగించడం.
సందర్శన పద్దతి :
కథలో పాత్రలు ఉంటాయి. పాత్రలు రెండు రకాలు జీవితాన్ని అనుభవించే పాత్రలు జీవిత పరిణామాలను పరిశీలించే పాత్రలు. ఈ రెండు పాత్రల ద్వారా కథకులు కథా నిర్మాణం చేస్తుంటారు. ఈ రకమైన కథా నిర్మాణం మూడు రకాలుగా ఉంటుంది.
1.ఒక ఊరికి చెందిన వ్యక్తి జీవితం కోసం తన ఊరిని వదిలిపోయి మరో ప్రాంతంలో కొంత కాలం నివసించిఆ తర్వాత చుట్టపు చూపుగా గానిస్వస్థలంలో స్థిరపడటానికి కానీ తన ఊరికి తిరిగి వచ్చిఆ మధ్య కాలంలో తన ప్రాంతంలో జరిగిన పరిణామాలను గమనించిఇతరుల ద్వారా తెలుసుకొని స్పందించినట్లు కథను నిర్మించడం.
2. ఒక ఊరికి చెందిన వ్యక్తి తన బంధువుల ఊరికి పోయి ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను వాటి కారణాలను తెలుసుకుంటూ కథను నిర్మించడం.
3.ఒక ఊళ్ళో ఉన్న పాత్ర తన కళ్ల ముందే ఊళ్ళో జరిగే మార్పులను గమనించి కారణాలను అధ్యయనం చేసి కథను నిర్మాణం చేయడం.
ప్రతీక  పద్దతి :
కథలో సామాజిక పరిస్థితులను యధాతధంగా చిత్రించడం ద్వారా కథా నిర్మాణం చేయడం.
వ్యంగ్యఅధిక్షేప పద్దతి :
ఓ అప్రజాస్వామిక అంశాన్ని గాని అపసవ్య సామాజిక ధోరణిని కానీ బలంగా రీడర్స్ ని అనుభూతికి తీసుకురావడమే.
తులనాత్మక పద్దతి :
రెండు రకాల ఆలోచనల్ని గానిరెండు రకాల ఆలోచనలను గాని తులనాత్మకంగా చెబుతూ కథను నిర్మించడం.
ఆద్యంతాల విన్యాసాలు :
కథ యొక్క ఎత్తుగడ ఆకర్షణీయంగా ఉంటూ ముగింపు ఆశ్చర్యకరంగా ఉండాలని కొందరి అభిప్రాయం అయితే. రెండు సహజంగా ఉండాలన్నది మరి కొందరి అభిప్రాయం. ఆ రకంగా నిర్మించడమే ఈ పద్దతి.
ఖంగుమంటున్న కంఠస్వరాలు :
ఈ రకమైన నిర్మాణంలో రచయిత కంఠస్వరం ముఖమైంది. సంభాషణగానోవ్యాఖ్యగానోఅనుశీలనగానోఅనుభవంగానో రచయిత కంఠస్వరం ఉంటుంది.
అందాల తెలుగులో కథా నిర్మాణం :
సంస్కృత భాష లేకుండా అందమైన తెలుగు భాషలో కథను నిర్మించడం.
కథా శిల్పాలు :
కథా శిల్పం అంటే కథ యొక్క కథనం ఎలా సాగిందో తెలియజేసేది.
వాస్తవిక కథా శిల్పం :
వాస్తవిక కథా శిల్పమంటే వస్తువుకు విధేయమైన శిల్పం. వస్తువును రీడర్స్ దగ్గరికి చేరవేసే సాధనంగా మాత్రమే పనిచేసే శిల్పం. అంటే వాస్తవికతకు దగ్గరగా ఉండే శిల్పం. 
ఊహా కల్పన :
ఒక సామాజిక వాస్తవికతను వాస్తవిక కథన రీతిలో చెప్పి రీడర్స్ మనసులో ఆలోచనలు రేకెత్తించడం ఒక రీతైతేఊహ కల్పనా ద్వారా ఆ పని చేయగలగడం మరో తీరు. ఇందులో వ్యంగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో కల వచ్చినట్లు చెప్పడమోమరో లోకాన్ని సృష్టించడమూ చేయడం.
ఆత్మకథాత్మక విధానం :
కథా శిల్పంలో ఉత్తమ పురుష దృష్టి కోణంలో కథ చెప్పడం ఒక పధ్ధతి. ఈ పద్ధతిలో ఒక పాత్ర తన జీవితాన్ని కానితనకు తెలిసిన జీవితాన్ని కాని తన మాటల్లో చెప్తుంది. ఈ పద్ధతిలో కథనంలో కథ చెప్పే పాత్ర కథలో భాగస్వామి కావచ్చులేదా సాక్షి మాత్రమే కావచ్చు.
ముఖాముఖి విధానం :
పూర్తి నాటకీయ దృష్టి కోణంలో గానిపూర్తి ప్రధమ పురష దృష్టి కోణంలో గాని కాకుండా ఆ రెండింటి వినూత్న సమ్మేళనం పొంది ఇంటర్వ్యూ రూపం పొందడంతో ఇదొక ప్రయోగం.
లేఖా కథనం :
కథలో లేఖ రాసినట్లు చేయడమే ఈ విధానం.
టేప్ రికార్డర్ కథనం :
రెండు దేశాల్లో ఉన్న బంధువులు టేప్ రికార్డర్స్ ద్వారా కుటుంబ విషయాలు తెలుసుకునే పద్దతి. ఇది ఇప్పుడు లేదు.
వాజ్ముల కథనం :
చరిత్రలో రాజకీయ నాయకులువిప్లవకారులు కోర్టు బోనెక్కి చేసే వజ్మాల ప్రసంగాల రూపంలో కథలు రాయడం.
తులనాత్మక విన్యాసం :
ఒక సామాజిక అంశాన్ని వివరిస్తూ మరో సామాజిక అంశంతో పోల్చి చెబుతూ కథను రాయడం.
పండిత శిల్పం :
సామాన్య రీడర్స్ కి వస్తువును అవగాహన కలిగించడంలో సహకరించని కథా శిల్పం. అతి తక్కువ మంది రీడర్స్ కి మాత్రమే పట్టుబడే టెక్నిక్ ని ఆశ్రయించి రాయడమే ఈ పద్దతి. శిల్పాన్నివస్తువును రీడర్స్ కి అందించకుండా శిల్పం వస్తువును మింగే సేలా రాయడమే ఈ పధ్ధతి.
వందల కథలను ఉదాహరిస్తూ సాగిన కథాంశం. తెలుగు కథా చరిత్రను తెలియజేస్తుంది. ఎంతో మంది రచయితలను పరిచయం చేస్తుంది. కాలానికి అనుగుణంగా కథా సాహిత్యం అలాంటి మార్పులకు గురైందో తెలియ పరుస్తుంది. ఈ పుస్తకం చదివితే వందల కథలు చదివినట్టే. కేవలం చదవడమే కాదు కథలు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు. కథలపై వచ్చిన విమర్శలువ్యాఖ్యానాలుచర్చలు తెలుస్తాయి. అనేక ప్రాంతాలకాలాల సమాహారం ఈ కథాంశం. ఈ పుస్తకం రాయడానికి వెనుక విశేషమైన అధ్యయనంపరిశోధనపరిశీలన ఉన్నది. కథా సాహిత్యాన్ని వివరిస్తూవిశ్లేషిస్తూ సాగిన ఈ కథాంశం తెలుగు సాహిత్య విమర్శలో అత్యంత విలువైన పుస్తకం. పుస్తకాన్ని చదవాల్సిందిగా యువ కథకులను ఆహ్వానిస్తున్నాను.
జాని తక్కెడశిల 
ప్రతిలిపి తెలుగు వెబ్సైట్ మేనేజర్ 
7259511956

No comments:

Post a Comment

Pages