ఈ దారి మనసైనది - 27 - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది - 27
అంగులూరి అంజనీదేవి 



(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత.)
అతన్నే చూస్తూ ......

"మీరుకాస్త్ర పక్కకి తప్పకుంటే . నా కాళ్లకి బుద్ధి చెబుతా మహాప్రభో ! నన్ను వదిలెయ్ ! ఏదో కోపంలో పొరపాటునఅన్నాను". అన్నట్లుగా తన రెండు చేతుల్ని పైకి లేపి దండంపెడుతున్నట్లు చప్పడు వచ్చేలా కలిపి. క్షణంలో అక్కడ నుండి తప్పుకొంది.

ధీరజ్ కి అర్థం కాక, భృకుటి మడిచి, వెళ్తున్న ఆమెనే చూసూ నిలబడ్డాడు..

సందర్శకులకు వివరించే పనిలో వున్నదీక్షిత. తన మొబైల్ని ఆఫ్ చేసి వుండడంతో .... చాల సేపటి నుండి ఆమె మొబైల్కి కాల్ వెళ్లటం లేదు. దూరం నుండి ధీరజ్ని గమనించి, వచ్చింది దీక్షిత ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన తన పేరెంట్స్ ని  లోపలకి తీసికెళ్లిఎక్స్ ప్లే యిన్ చెయ్యమని దీక్షితతో చెప్పాడు ధీరజ్.  వాళ్లను లోపలకి తీసికెళ్లింది దీక్షిత. ధీరజ్, దీక్షిత ఒకే వూరివాళ్ళు అయినా మొదట్లో వాళ్లకి పరిచయం లేదు. ఒక రోజు మల్లారెడ్డి లెక్చరర్ ధీరజ్ తో ‘విూవూరి అమ్మాయి దీక్షిత కె.ఎం.సి లోనే మెడిసిన్ చేస్తోంది ధీరజ్. ఆమె నా శిష్యురాలు. తనకి సబ్జక్ట్ పరంగా ఏదైనా అవసరమైతే హెల్స్చెయ్యి" అన్నాడు. అప్పటి నుండి హాస్పిటలోదీక్షిత్రకి ఏ డౌట్ వచ్చినా క్లారిఫె చేస్తుంటాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages