ప్రపంచములోని మొట్ట మొదటి మహిళా మత్తు మందు డాక్టరు హైదరాబాద్ కు చెందిన "రూప బాయ్ ఫర్దూన్జీ" - అచ్చంగా తెలుగు

ప్రపంచములోని మొట్ట మొదటి మహిళా మత్తు మందు డాక్టరు హైదరాబాద్ కు చెందిన "రూప బాయ్ ఫర్దూన్జీ"

Share This
ప్రపంచములోని మొట్ట మొదటి మహిళా మత్తు మందు డాక్టరు హైదరాబాద్ కు చెందిన "రూప బాయ్ ఫర్దూన్జీ"
అంబడిపూడి శ్యామసుందర రావు శస్త్ర చికిత్సలలో రోగికి మత్తు మందు ఇవ్వటం ఎంత అవసరమో మత్తు మందు ఇచ్చే డాక్టర్ పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు ఆపరేషన్ ఎటువంటిదయినా రోగిని బట్టి ఆపరేషన్ కు పట్టె కాలాన్ని బట్టి ఏ రకమైన మత్తు మందు ఇవ్వాలో నిర్ణయించే వైద్యులను ఎనస్తీషియా స్పెషలిస్ట్ తెలుగులో మత్తు మందు డాక్టర్ అంటారు ఆపరేషన్ కు ముందు రోగికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ పూర్తి అయినాక రోగిని స్పృహ లోకి తెచ్చేదాక మత్తు మందు డాక్టర్ దే భాద్యత  భారత దేశములో మామూలు చదువులే ఆడపిల్లలకు గగన కుసుమాలుగా ఉన్న రోజుల్లో  ఇటువంటి అరుదైన వైద్య శాస్త్ర విభాగములో రికార్డ్ స్థాపించిన మహిళ హైదరాబాద్ కు చెందిన రూప బాయి ఫర్దున్జీ ఈవిడ ప్రపంచములోనే మొట్ట మొదటి మత్తు మందు మందు స్త్రీ నిపుణురాలు కాబట్టి అటువంటి గొప్ప మహిళా డాక్టర్ విశేషాలను తెలుసుకుందాము. 

వైద్య రంగము పట్ల ఫర్దున్జీ ఆసక్తి అభిలాష నైజామ్  పరిపాలనలో ఉన్న హైదరాబాద్ లోని హైదరాబాద్ మెడికల్ స్కూల్ (ప్రస్తుత ఉస్మానియా మెడికల్ కాలేజీ) లో  చేరినప్పటి నుండి ప్రారంభమయింది ఈ స్కూల్ ను నాల్గవ నిజాం నజీర్ ఉద్దవులా చే 1846 లో ప్రారంభించబడింది ఈ నైజాం వైద్య విద్యలో స్త్రీ పురుషులిద్దరికి సమాన అవకాశాలు కల్పించాడు కాబట్టే ఫర్దున్జీ వంటి స్త్రీలకూ వైద్య విద్యను  అవకాశము కలిగింది.ఆయనకు ప్రేరణ అప్పటి మెడికల్ స్కూల్ ప్రిన్సపాల్ ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణుడు అయిన ఎడ్వర్డ్ లారీ ఈయన ప్రేరణ వల్లనే నవాబ్ మీర్  మెహబూబ్ అలీఖాన్ నైజాం ను పాలించే రోజుల్లో హైదరాబాద్ నుండి ఐదుగురు ఆడపిల్లలకు  మెడికల్ స్కూల్ లో ప్రవేశము వచ్చింది ఆ ఐదుగురిలో రూప బాయ్  ఒకరు. ఆవిధముగా హైదరాబాద్ మెడికల్ స్కూల్ లో 1885 లో చేరిన రూప 1889 లో వైద్య పట్టా పుచ్చుకుంది. కానీ ఆ సమయములో హైదరాబాద్ మెడికల్ స్కూల్ లో భోధన ఉర్దూలో జరగటం వలన ఆవిడ  పొందిన డిగ్రీని డాక్టర్ గా కాకుండా హాకీమ్ గా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అధ్యాపకులు బోధించిన అంశాలను ఉర్దూలో తర్జుమా చేసి విద్యార్థులకు భోధన చేసేవారు కాలక్రమేణా లారీ చొరవ వల్ల భోధన ఇంగ్లిష్ లొనే కొనసాగటం వల్ల చాలా మందికి విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశము కలిగింది.
నాలుగేళ్ల వైద్య విద్య అభ్యాసములో రూప బాయ్ అనాటమీ, ఫిజియాలజి,మెటీరియా మెడిక,మెడిసన్ , సర్జరీ మరియి మిడ్ వైఫరి వంటి భాగాలను చదివింది,1889- 1917 మధ్యకాలములో బ్రిటిష్ రెసిడెన్సీ హాస్పిటల్ (ప్రస్తుతము సుల్తాన్ బజార్ హాస్పిటల్),అఫ్జల్ గంజ్ హాస్పిటల్, మరియి జెనాన హాపీటళ్లలో ఎనస్తీషియా వైద్యురాలిగా పనిచేసింది  రూప చదువులోనూ, వృత్తి లోను చూపించిన ప్రతిభను గుర్తించిన లారీ ఆవిడను ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్య అభ్యసించటానికి ప్రోత్సాహించాడు ఫలితముగా వృత్తిలో విరామము తీసుకొని ఇంగ్లాండ్ లోని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయములో చేరి భౌతిక రసాయన శాస్త్రాలలో డిప్లమా పొందింది. ఈ రెండు సబ్ జక్టులు  మత్తుమందు ఇచ్చే డాక్టర్లకు చాలా అవసరము ఎందుచేతనంటే ఆరోజుల్లో ఎనష్టీషియా కు ప్రత్యేకమైన కోర్స్ ఏమి లేదు. ఆ తరువాత రూప ఇంగ్లాండ్ అమెరికా లలో గల ప్రముఖ వైద్య కళాశాలలు స్త్రీలకూ అడ్మిషన్ నిరాకరిస్తున్న రోజుల్లో ,అమెరికాలోని బాల్టిమోర్ నగరములో గల జాన్ హాప్కిన్స్ హాస్పిటల్ లో చేరి వైద్య శాస్త్రములో పట్టభద్రురాలు అయింది.ఆ రోజుల్లో ప్రముఖ చిన్న పిల్లల గుండె జబ్బుల సర్జన్ డాక్టర్ తౌసిగ్  కు హార్వర్డ్ మెడికల్ స్కూల్ (బోస్టన్) ప్రవేశము స్త్రీ అన్న కారణముగా నిరాకరించబడింది  తరువాతి రోజుల్లో ఆవిడ ప్రత్యేకమైన సస్త్ర చికిత్స విధానాన్ని ప్రవేశ పెట్టి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.   
రూప ను ఎనస్థీషియాలజి వైపు మళ్లించిన ఘనత డాక్టర్ ఎడ్వర్డ్ లారీ డి అయినప్పటికీ ఆవిడా విజయ గాధను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి హైదరాబాద్ కు చెందిన హర్ ముస్జి కౌశే ఈయన రూప ఒరిజనల్ సర్టిఫికెట్స్ నుకొన్ని ముఖ్యమైన ఉత్తరాలను భద్రపరిచాడు అవి ప్రస్తుతము ఉస్మానియా మెడికల్ కాలేజీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హిస్టరీ ఆఫ్ మెడిసన్ లో ప్రదర్శనకు ఉంచబడ్డాయి. ఈ ప్రదర్శనలో డాక్టర్ అనీబిసెంట్ 27 ఏప్రిల్, 1909 న డాక్టర్ డ్రమొండ్ కు వ్రాసిన సిఫార్స్ ఉత్తరము కూడా ఉంది ,రూప,అనిబిసెంట్  ఇద్దరు ఒకే షిప్ లో బొంబాయి నుండి ఎడిన్ బర్గ్ కు వెళుతున్నారు అసందర్భములో పరిచయము అయిన రూపకు ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలో ప్రవేశానికి రికమండ్ చేస్తూ వ్రాసిన సిఫార్స్ ఉత్తరము అది. ఆ తరువాత రూప చదువు ముగించుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు ఎడిన్ బర్గ్ యూనివర్సిటి  లోని డాక్టర్ డ్రమొండ్ హైదరాబాద్ లో రూప పనిచేస్తున్న హాస్పిటల్ యాజమాన్యానికి రూప యొక్క సేవలు ఎడిన్ బర్గ్ లో అవసరము కాబట్టి ఆవిడను ఇంగ్లాండ్ పంపవలసినదిగా కోరుచు ఉత్తరము వ్రాసారు అంటే ఆవిడా ఘనతను మనము గుర్తించవచ్చు ఆవిఢముగా వారి కోరికపై ఇంగ్లాండ్ వెళ్లిన రూప రెండేళ్ల తరువాత ఇండియా వచ్చి బ్రిటిష్ రెసిడెంట్ హాస్పిటల్ లో పూర్తికాలం అనస్తీషియా నిపుణురాలిగా చేరింది 1920లో నిజాం మెడికల్ సర్వీసెస్ నుండి అంటే బ్రిటిష్ రెసిడెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ హోదాలో పదవి విరమణ చేసింది హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ వారు డాక్టరు లారీ  ఆధ్వర్యములో జంతువులపైనా అనస్తీషియా ప్రభావము గురించి చేసిన పరిశోధనలలో రూప కూడా పాల్గొన్నది ఈ విషయాన్ని డాక్టర్ లారీ హైదరాబాద్ క్లోరోఫామ్ కమీషన్(1891) వారు విడుదల చేసిన రిపోర్ట్ లో పేర్కొన్నాడు. ఆ విధముగా పురుషాధిక్యత అధికముగా ఉన్న ఎనస్తీషియా వైద్య విభాగములో మొట్ట మొదటి స్త్రీ మత్తు మందు నిపుణురాలిగా (ప్రపంచములోనే)  పేరు ప్రఖ్యాతులు పొంది భారత దేశానికి కూడా పేరు తెచ్చింది  
***  

No comments:

Post a Comment

Pages