రిజర్వ్ బ్యాంక్ గురించి తెలుసుకోవలసిన విషయాలు - అచ్చంగా తెలుగు

రిజర్వ్ బ్యాంక్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

Share This
రిజర్వ్ బ్యాంక్ గురించి తెలుసుకోవలసిన విషయాలు
అంబడిపూడి శ్యామసుందర రావు 

ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజనీమా విషయములో ప్రతి పక్షాలు బిజెపి నాయకత్వము లోని  కేంద్ర ప్రభుత్వము అన్ని వ్యవస్థలతో పాటు రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థను కూడా నాశనము చేస్తుంది అని గగ్గోలు పెట్టి రిజర్వ్ బ్యాంక్ పేరును ప్రజలలో బాగా ప్రాచుర్యానికి తెచ్చినాయి ప్రభుత్వ జోక్యం వల్ల రిజర్వ్ బ్యాంక్ సరిగా పనిచేయటం లేదని ప్రతిపక్షాలు వారి అభియోగము అసలు ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ అంటే ఏమిటీ దాని విధులు భాద్యతలు ఏమిటి ? అన్న విషయాలను సాధారణ పౌరులకు తెలియని వాటిని తెలుసుకుందాము 

రిజర్వ్  బ్యాంక్ దేశములోని మొత్తము బ్యాంకింగ్ సిస్టము ను క్రమబద్దీకరిస్తుంది. ఆ విధముగా మన దేశానికి ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కలుగజేస్తుంది. మన కరెన్సీ నోట్ల ముద్రణ దేశము యొక్క పరపతి విధానాన్ని, కరెన్సీ సిస్టం ను ఆపరేట్ చేస్తుంది. మన భారతదేశ బ్యాంకింగ్ రంగము అనే పిరమిడ్ లో పై మెట్టులో రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థకు రిజర్వ్ బ్యాంక్ కేంద్రబిందువు అని చెప్పవచ్చు.అటువంటి బ్యాంక్ గురించి కొన్ని ముఖ్యమైన ,సామాన్య ప్రజలకు తెలియని కొన్ని అంశాలను గురించి తెలుసుకుందాము,
 1. రిజర్వ్ బ్యాంక్ ను హిల్టాన్ యంగ్ కమిషన్ రికమండేషన్ ఆధారముగా  ఏప్రిల్ 1,1935 లో ఒక ప్రయివేట్ సంస్థగా ప్రారంభించారు 1949లో ఈ బ్యాంక్ ను జాతీయము చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణము చేశారు 
2. ఈ బ్యాంక్ ఆర్ధిక సంవత్సరము జులై యుక్తితో ప్రారంభమయి జూన్ 30 తో ముగుస్తుంది. 
3. కరెన్సీ నోట్ల ముద్రణ భాద్యత ఈ బ్యాంక్ దే నాణేల ముద్రణ మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే 
4. 2003 లో మొదటిసారిగా కె జె ఉదేశి అని ఆవిడ RBI డిప్యూటీ గవర్నర్ గా నియమింపబడింది. 
5. 1938లో RBI ఐదు,పదివేల రూపాయల నోట్లను రద్దుచేసింది మళ్ళా 1954 లో ప్రవేశ పెట్టి 1978లో వాటిని నల్ల ధనాన్ని అరికట్టే ప్రయత్నములో రద్దుచేసింది RBI 1934 చట్టము ప్రకారము RBI కి ఈ నోట్లను ప్రింట్ చేసే అధికారము ఉంది. 
6.జూన్ 1948 వరకు పాకిస్తానుకు,ఏప్రిల్ 1947 వరకు బర్మా (మయన్మార్)కు సెంట్రల్ బ్యాంక్ గా వ్యవహరించింది. 
7. RBI లో క్లాస్ 1 క్లాసు3 , క్లాస్ 4  ఉద్యోగస్తులు ఉంటారు  క్లాస్ 2 ఉద్యోగస్తులు ఉండరు. 
8. RBI గవర్నర్ గాచేసి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి  మన్  మోహన్ సింగ్ మాత్రమే.ఈయన 1982 నుండి 85 వరకు గవర్నర్ గా ఉన్నాడు.  
9. RBI గవర్నర్ గా భాద్యతలు చేపట్టిన మొదటి భారతీయుడు సి.డి దేశముఖ్ ఈయన RBI గవర్నర్లలో మూడవవాడు ఈయన హయములోనే RBI షేర్ హోల్డర్లసంస్థ నుండి ప్రభుత్వ రంగ సంస్థగా మార్పుచెందింది. కానీ ఈయన బ్యాంకుల జాతీయకరణను వ్యతిరేకించిన వ్యక్తి 
10. RBI మొత్తము దేశములో 29కార్యాలయాలను కలిగి ఉన్నది ఇంచుమించు ఈ కార్యాలయాలన్నీ రాష్ట్ర రాజధానులలోనే ఉన్నాయి. 
11.RBI తన ముంబాయి ప్రధాన కార్యాలయము ఆవరణలో మానిటరీ ప్రదర్శన శాలను నిర్వహిస్తుంది.  
12.RBI లోగోకు ప్రేరణ అప్పటి ఈస్ట్ ఇండియా కామని వారి డబుల్ మొహర్ 
13. RBI గవర్నర్ 5,10,100, ఆపై  డినామినేషన్ నోట్ల పై సంతకము చేస్తారు ఒకటి లేదా రెండు రూపాయల నోటు పై ఆర్ధిక శాఖ సెక్రటరీ సంతకము ఉంటుంది
14. భారత దేశములో రెండు కంపనీలకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ లు రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యములో నోట్లను(కరెన్సీ) ముద్రిస్తాయి.ముద్రణ్  ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు కర్ణాటక  మైసూర్ లోను, వెస్ట్ బెంగాల్ సల్బోనీలోను ఈ ప్రెస్ లు ఉన్నాయి ఇక్కడ ఏటా 16బిలియన్ల నోట్లు ముద్రించబడతాయి. నాలుగు నాణేల తయారీ కర్మాగారాలు,సెక్యూరిటీకి సంబంధించిన పేపర్ తయారీ కర్మాగారము ఆర్ధిక శాఖ ఆధ్వర్యములో పనిచేస్తాయి. ప్రస్తుతము మనదేశములో సర్క్యులేషన్ లో ఉన్న నోట్లు, నాణేల విలువ అధికారికంగా17.77లక్షల కోట్లు. మొత్తము సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీ విలువ 14.1లక్షల కోట్లు.డిమానిటైజేషన్ వల్ల పనికిరాకుండా పోయిన నోట్లు 86%. . కొత్త నోట్ల ముద్రణకు అయ్యేఖర్చు 12,000కోట్ల రూపాయలు.
*** 

No comments:

Post a Comment

Pages