మనీషి! - అచ్చంగా తెలుగు
మనీషి!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


బాస్ మాటంటే నీకంత బాధా..
అందరితో చెప్పుకు కుమిలిపోతావా..మరి నువ్వు-
కూర బాలేదని మీ ఆవిడ మీద చిందులేసినప్పుడు
మార్కులు తక్కువొచ్చాయని చంటిదాన్ని ఉరిమి చూసినప్పుడు
దగ్గుతూ నిద్ర చెడగొడుతోందని అమ్మని కసిరినప్పుడు
విసిరేసాడని పేపర్ వాణ్ని తిట్టినప్పుడు
చుక్క నీరు మీదపడిందని వెయిటర్ ను దుర్భాషలాడినప్పుడు
అవసరానికి పదడిగిన పనిమనిషి మీద నోరు పారేసుకున్నప్పుడు
మానసికంగా ఎంత క్షోభ పడుంటారో..ఆలోచించు
మనసులో మృగాన్ని నిద్రపుచ్చి
తథాగతుణ్ని సమాజానికి పరిచయం చేసేవాడే మనీషి
అలా మనమెందుకు కాకూడదు?
***

No comments:

Post a Comment

Pages