సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!

పిల్లలూ, మీ ఇంట్లో పేపర్ వేయించుకుంటారా? తెలుగా? ఇంగ్లీషా?
మీరెప్పుడైనా పేపర్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చూశారా? ఎన్నెన్ని అంశాలుంటాయో గమనించారా?
రాజకీయాలు, ఆటలు, సినిమాలు, ప్రకటనలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారం వీటితో పాటు కొన్ని పత్రికలు పిల్లల కోసం కొన్ని పేజీలు కేటాయిస్తున్నాయి. వాటిలో మీకు కావలసిన విషయాలు ఉదాహరణతో సహా వివరిస్తారు. అంతే కాకుండా ఇంగ్లీషు నేర్పడం, పిల్లల చదువుకి సంబంధించిన పాఠ్యాంశాలు, పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉంటున్నాయర్రా. 
పేపర్ చదవడం వల్ల మనకు చుట్టూ జరిగే విషయాల పట్ల చక్కటి అవగాహన కలుగుతుంది. చెడు నుంచి మనం దూరంగా ఎలా ఉండాలి, మనని మనం ఎలా కాపాడుకోవాలి? అన్న లోకజ్ఞానం ఏర్పడుతుంది. మనో వికాశం కలుగుతుంది. జనరల్ నాలెడ్జికి అది బీజం. 
ముఖ్యంగా మనకు భాషమీద పట్టు వస్తుందర్రా. ఎలా రాయాలి, చదవాలి, పదసంపద, దాన్ని ఉపయోగించే విధానం అన్నీ అలవడతాయి.
నిత్యం పేపర్ చదవడం అనే అలవాటు చేసుకోవడం వల్ల సమకాలీన పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు టక టక సమాధానాలు చెప్పగలుగుతారు. మీ విజయం అందులోనే ఉంది.
మరి మీరు చక్కగా రోజూ పేపర్ చదువుతారు కదూ!
మరి ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages