పుష్యమిత్ర - 33 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 33
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు. సీక్రెట్ గా పాక్ వెళ్ళిన పంచాపకేశన్ బృందం సీ.ఐ.డీ బృందం కళ్ళుగప్పి తప్పించుకుంటారు. ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది. (ఇక చదవండి)
కొంత దూరం ట్యాక్సీలో, కొంత దూరం బస్ లో ట్రావెల్ చేసి చివరకు ఖాజీపేట చేరుకున్న వెంకటేశన్ ఒక హోటెల్లో రంగాచారి అనే మారుపేరుతో రూం తీసుకుని ఆ రోజు ఇంగ్లీషు పేపర్లన్నీ కొని ఎవరన్నా తమ సంగతి పసిగట్టారేమోనని చదువుతున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగింది. ఉలిక్కిపడి లేచాడు.
*    *    *
పంచాపకేశన్ తన ఆఫీసులో అసహనంగా ఫోను కోసం చూస్తున్నాడు. వెంకటేశన్ ఏమయ్యాడో తెలీదు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారో అంతుపట్టడంలేదు. తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన        సిం-కార్డు బయటకు తీసి ఫోనులో వేశాడు.  డిఫెన్సు మినిస్టర్ రాజా అగర్వాల్ కు ఫోను చేసి "మిస్టర్ రాజా...మీతో ఒక కాన్ఫిడెన్షియల్ విషయం మాట్లాడాలి. మీరు ఒక సారి సాయంత్రం మా యింటికి రాగలరా?" అనగానే "తప్పకుండా! ఈవెనింగ్ 7 కు వస్తాను" అని చెప్పి ఫోను పెట్టేశాడు.
*    *    *
విదేశీ పర్యటనకు వెళ్ళిన పీ.ఎం. అమెరికా ప్రెసిడెంటు తో రహస్య సమావేశమయ్యాడు. వారిద్దరు తప్ప ఎవ్వరూ లేరు.
"చెప్పండి" అన్నాడు అమెరికా ప్రెసిడెంట్
"అదే! మాదేశ డిఫెన్సు విషయాలు ఈ మధ్య పాకిస్తాన్ వాళ్ళకు లీక్ అయ్యాయి. మా వద్ద ఉన్న లాంటి క్షిపణులను తయారు చెయ్యడానికి టెక్నికల్ సహాయం కోసం "నాలెడ్జి ట్రాన్స్ఫర్" పేరుతో కొంత మంది పాక్ బృందం ఇక్కడకు వచ్చింది."
"ఓ! ఐ.సీ"
"మిస్టర్ ప్రెసిడెంట్ సార్! దీన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలి. మా దేశానికి చాలా ప్రిస్టేజియస్ వ్యవహారం"
"కరెక్ట్. బట్ మిస్టర్ ప్రైం మినిస్టర్. ఇఫ్ దే రిక్వైర్ ఎనీ టెక్నికల్ హెల్ప్. వుయ్ కెన్ నాట్ డినై యిట్ నో! 
"దట్ ఐ నో. బట్ రిఫరింగ్ టు అవర్ మిసైల్ ప్లాన్స్, యెట్ ది కాస్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రిస్టేజ్,  ఇఫ్ దే రిక్వెస్ట్ ఎనీ కొలాబొరేషన్.... ఐ ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్ యు టు నాట్  టు ఎంకరేజ్ దెం"
"సర్టన్లీ. లెట్ అజ్ సీ వాట్ రియల్లీ దే వాంట్ ఫ్రం అజ్"
"బట్ వుయ్ ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు టీచ్ ఎ లెసన్ నాట్ ఒన్లీ టు పాక్,  బట్ అదర్ కంట్రీస్ హు హెల్పింగ్ దెం అదర్ వే "
" వాడ్డుయు మీన్” భృకుటి ముడిపడింది.?"
"మీ విషయం గురించి  కాదు చుట్టు ప్రక్కల ఉన్న దేశాలు. చైనా కానీ ఇంకేదైనా కానీ వారికి సహాయం చేసే వాళ్ళను వదలే ప్రసక్తే లేదని చెప్తున్నాను"
"నిజమే కానీ వారికి కూడా ఇన్-హవుజ్ టెక్నాలజీ బాగానే ఉంది. మొన్న మీ మిసైల్ మ్యాన్ చనిపోయినపుడు పాక్ డిఫెన్సు స్పెషలిస్ట్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా! ఎవరినీ అంత తేలికగా తీసుకోగూడదు. ముఖ్యంగా శతృవును."
"నిజమే వారికీ ఆవిషయం తెలియాలి. మా దేశం చేతిలో ఎన్ని సార్లు దెబ్బ తింటారు వాళ్ళు?"
"ఓకే! వుయ్ విల్ యాక్ట్ ప్రూడెంట్లీ అండ్ మోర్ ట్రాన్స్పరెంట్లీ! మేము అలాంటి విద్రోహ చర్యలకు పాల్పడతామనే భావన మీకు ఎందుకు కలిగిందో నాకర్ధం కావడంలేదు"
"మీరు అలా చేస్తారని నేనడంలేదు. మా రహస్యాలు దొంగిలించి.. మేము శతాబ్దాల తరబడి చేసుకుంటూ వస్తున్న పరిశోధనా రహస్యాలను అక్రమంగా వాడుకోవడం న్యాయం కాదని చెప్తున్నాము అంతే"
"దట్ ఐ అగ్రీ విత్ యు అల్వేజ్"
మీటింగ్ అయిందన్నట్టు చూడగానే పీ.ఎం లేచాడు.
*    *    *
"మీ ఆధార్ కార్డ్ తెమ్మని మా మేనేజర్ అడుగుతున్నాడు. మా రికార్డ్స్ కి కావాలి"
వెంకటేశన్ ఒక్కసారి ఉలిక్కిపడ్డా వెంటనే తేరుకుని తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డ్స్ లో 'మాంబళం రంగాచారి ' అని ఉన్న కార్డును అతనికి ఇచ్చి "వెంటనే కాపీ చేసుకుని తీసుకురా!" అని పంపించాడు.
అనుమానం వచ్చేలోగా ఇక్కడ నుండి వీలైనంత తొందరగా తప్పుకోవాలి అనుకుంటూ పంచాపకేశన్ కు ల్యాండ్ లైన్ ద్వారా ట్రై చేశాడు. సెక్రెటరీ ఎత్తి "సార్! ఒక ముఖ్యమైన మీటింగులో ఉన్నారు. అవగానే చెప్తాను" అని ఫోను పెట్టేశాడు.
*    *    *
"సిట్డౌన్ మిస్టర్ అగర్వాల్! మీరు మా తమిళ్ అమ్మాయి అంబికా నాయర్ ను చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను"
"యా.. యా! షి ఈజ్ ఎ నైస్ గాళ్. డ్యాన్సర్. సింగర్ యాక్టర్".
"అవును. ఆవిడకు మా స్టేట్ లో కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు"
"ఇంతకీ మన మీటింగు ఎజెండా ఏమిటో" అన్నాడు తేనీరు సేవిస్తూ.
"నేను చెప్పే విషయం ఇప్పటివరకూ నాకు పీ.ఎం కు తప్ప వేరెవ్వరికీ తెలీదు. వెరీ వెరీ కాన్ ఫిడెన్షియల్"
"యెస్. అఫ్కోర్స్. మా డ్యూటేనే రహస్యం కాపాడడం కదా!" అని పెద్దగా నవ్వాడు.
"పుష్యమిత్ర ఈ మధ్య ఒక పెద్ద రహస్యం చెప్పారు" అంటూ ఉప్పుగనుల దగ్గర ఉన్న రహస్య నిధి వివరాలు చెప్పాడు.
ఒక్క నిముషం ఆశ్చర్యానికి లోనై "ఓ గాడ్! ఇప్పుడది మనదేశం కాదు కదా! ఎలా చేయాలి?"
"అదే నేనూ ఆలోచిస్తున్నాను. మీరు సహకరిస్తే మనం ఆ నిధిని  మనం పంచుకోవచ్చు. ఎంతకాలం మనం ఈ కమీషన్లు తీసుకోవడం. స్క్యాం అంటూ ప్రతిపక్షాలు మన మీద పడడం. అవి తప్పించుకోవడం. అది మనం చేజిక్కుంచుకోగలిగితే కొన్ని వందల తరాలపాటు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకోవచ్చు"
"నిజమే పంచాపకేశన్. కానీ మనం అది పాక్ వాళ్ళ సహాకరం లేకుండా చేజిక్కించుకోవడం అసాధ్యం కదా!"
"అదే నేనూ యోచిస్తున్నాను. బట్ వన్ ధింగ్. మీకు పాక్ డిఫెన్సు హెడ్ బాగా పరిచయమే కదా! ఒకవేళ అలాంటిది వుంటే ఏమి చెయ్యాలో... నిధి ఎక్కడ ఉన్నదీ చెప్పకుండా గాలిలో బాణం వదలండి. దారికొస్తాడు అనుకుంటే మనం పావులను కదపవచ్చు. బట్ వెరీ వెరీ సీక్రెట్ గా ఉంచండి. పీ.ఎం.గారు ఆవులిస్తే పేగుల్ని లెక్కపెట్టగలిగే రకం కదా!"
"యా.. యా... వాళ్ళకూ కొంత ఆశ చూపుదాం. ఈ విషయంలో నేను కొంచెం ఆలోచించాలి. కర్రవిరగకుండా పాము చావకుండా మనం విజయం సాధించాలి"
"యెస్. నా మైండ్ కరెక్టుగా అర్ధం చేసుకున్నారు మీరు"
కరచాలనం చేసి అగర్వాల్ వెళ్ళిపోయాడు.
*    *    *
హోటెల్ బాయ్ వచ్చి "రంగాచారిగారూ! మిమ్మల్ని మా మేనేజర్ కలవమన్నారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఒక్కసారి ఏదో ఆపద గోచరించిన వెంకటేశన్ తప్పదన్నట్లు క్రిందికి దిగి వచ్చాడు.
హోటెల్ మేనేజర్ కు ఫొటో చూపించి అతను ఇక్కడే ఉన్నాడని ధృవపరుచుకు న్నాక రహస్యంగా వెనుక వున్న గదిలో సీ.బి.సి.ఐ.డి బృందం వెయిట్ చేస్తున్నారు.
"సర్! రంగాచారి గారు వణక్కం! రండి కూర్చోండి."
"నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను. చెప్పండి. రెస్ట్ తీసుకోవాలి" అనగానే.
"దిల్లీ నుంచి వస్తున్నారా!" అని అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడి
"అలా నేను అనలేదే! సిరిపూర్ కాగజ్ నగర్ లో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళి వస్తున్నాను"
"ఓ! అవునా!"
"మీరొక్కరే వెళ్ళారా! లేక ఇంకా ఐదారుగురు వెళ్ళారా?" 
చికాకు వచ్చిన వెంకటేశన్ "సారీ! ఆధార్ కార్డు కాపీ చేసుకుని ఇచ్చేస్తే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను" 
"మీకు రెస్ట్ ఇచ్చేందుకు కొంతమంది వచ్చారు" 
అన్న మాటకు చుట్టు ప్రక్కల చూసి "ఎవరు?" అన్నాడు కీడు శంకిస్తూ.
"రండి" అని ప్రక్కగదిలోకి తీసుకెళ్ళి, వారు ముందు చెప్పిన విధంగా బయట గడియ పెట్టాడు.
లోపల నలుగు ఆఫీసర్లు ఉన్నారు. వారిలో ఒకడి చేతిలో ఏ.కే 47 గన్ ఉంది.
"రండి వెంకటేశన్ గారూ.. దిల్లీ తర్వాత మళ్ళీ మనం ఇలా ఇక్కడ వరంగల్ లో కలుసుకుంటాం అని మీరు ఊహించి ఉండరు. అతి తెలివి గా తప్పించుకున్నారు"
ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. వాళ్ళు చెప్పినట్లు నేల మీద కూర్చున్నాడు. చేతులు వెనుక వైపు కట్టేసి కూర్చోబెట్టారు.
"మిగతా వారు ఎక్కడ?"
"వాళ్ళు ఎవరో నాకు తెలీదు. నాలాగే ఉప్పు గనులు చూడ్డానికి వచ్చారు" అన గానే చెంపమీద ఫెళ్ మని ఒక్కటిచ్చాడు ఒక ఆఫీసర్.
"ఏం. ఇండియా సీ.బీ.ఐ పోలీసులంటే వేళాకోళంగా ఉందా! నిజం చెప్పు"
"వాళ్ళు అందరూ తలో దిక్కు పారిపోయారు. నిజంగా నాకు తెలీదు"
"అందరిదీ తిరుకడయూర్ దగ్గరేనా నివాసం?"
"చెన్నై, తిరునెల్వేలి, రామేస్వరం, చిదంబరం...ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉంటారని విన్నాను సార్!"
"ఇంతకీ ఉప్పుగనులకు మీకు ఏమిటి సంబంధం? మీరంతా ఎక్కడ కలిశారు? ఎవరు కలిపారు? మీ వెనుక ఉన్నది ఎవరు?"
"మీరు అనవసరం గా అపార్ధం చేసుకుంటున్నారు. మేము టూరిస్టులము"
"ఐతే ధైర్యంగా ఉండక పారిపోయి ఎందుకు వచ్చారు?"
"మీరు మమ్మల్ని ఉగ్రవాదులనుకుని చంపేస్తారేమోనని డౌట్ వచ్చి పారిపోయాం అంతే సార్!"
"మిమ్మల్ని ఇలా కాదు. ఇలా అడిగితే చెప్పరు. అడిగే పద్ధతిలో అడగాలి" తలుపు తీయమని సైగ ద్వారా చెప్పి వెంకటేశన్ ను జీప్ ఎక్కించారు. (సశేషం)
-0o0-

No comments:

Post a Comment

Pages