విగత జీవుడు - అచ్చంగా తెలుగు
విగతజీవుడు
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నందుకు
పంతంతో పెద్దలు పొమ్మంటే 
ధైర్యంతో బయటకు వెళ్లి నిలదొక్కుకున్నాడు.
సంపాదించిన ఉద్యోగం అకారణంగా పోయినప్పుడు
ఆమెవచ్చిన వేళా విశేషమని 
తనవారందరూ వంగ్యం చేసినప్పుడు
సహనాన్ని నేర్చుకున్నాడు,ఓర్చుకున్నాడు.
పుట్టిన పిల్లల అనారోగ్యాలను,
పెరుగుతున్నపిల్లలు పెట్టే పేచీలను 
ఎదుర్కోవటం తనబాధ్యతగా చేసుకున్నాడు.
పిల్లల ఇష్టాలను తీర్చటం,
వారివల్ల కలిగిన కష్టాలను భరించటం 
తన ధ్యేయమనుకున్నాడు.
రెక్కలోచ్చిన పిల్లలొక్కొక్కరే ఎగిరిపోయి 
వారిస్వర్ధం వారు చూసుకుంటుంటే
అది సహజమేలే అని సరిపెట్టుకున్నాడు.
తల్లితండ్రుల బాధను పంతంగా భావించి
వెళ్లిపోమన్న వారిని మళ్ళీ కలిసేప్రయత్నం 
చేయకుండానే రోజుల్ని గడపసాగాడు.
ఇలా ఎన్నో వైవిధ్యమైన బాధలను,వ్యధలను భరించిన అతను
ఇప్పుడు మాత్రం భార్య హటాత్తుగా తనను విడిచివెళ్లిపోయేసరికి
ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు,
విగతజీవుడయ్యాడు 
***

No comments:

Post a Comment

Pages