శివం-41 - అచ్చంగా తెలుగు
శివం -41
శివమ్మ కధ -15
రాజ కార్తీక్

(శివమ్మ కోరిక మేరకు నేనామె కొడుకు వలె పసిబాలుని లాగా మారిపోయాను.)

మా అమ్మ, నేను బాగా ఆడుకున్నాం. ఇక మా అమ్మ నన్ను చూసి ఇంకా సంబరపడుతోంది. నన్ను నవ్వించే క్రమంలో ,మా అమ్మ చేసే సైగలు అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నై .
ఎట్టకేలకు నేను మా అమ్మ ఒడిలో నిద్రపోయాను. మా అమ్మ నన్ను పక్కన పడుకో పెడితే ఇంక నేను వెంటనే  గోల పెడతా. మా అమ్మ స్పర్శ కన్నా నాకు ఆనందం ఇంకేం లేదు.
నేను నిద్ర లేచే సమయం లోపు నాకోసం ఏవో ఏర్పాట్లు చేయటానికి మా అమ్మ లేచింది. అంతే మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాను. మళ్ళీ మా అమ్మ నన్ను జ్యో జ్యో అని నిద్రబుచ్చింది.
అలాగే, తన చీర ఒకటి తీసుకొని దానిని ఒక తలగడ లో పెట్టి, తను పక్కన ఉన్నట్లు నమ్మించటానికి నా పక్కన పెట్టింది. నేను కూడా అందరి లాగా సరే మా అమ్మకు పనుంది కదా అని ఏడవకుండా నిద్రలోకి జారుకున్నా. చిన్నగా మా అమ్మ లోపలి వెళ్ళింది.
విష్ణు దేవుడు "మహాదేవుడేంటి మురికి గుడ్డ పక్కన ఉండటమేంటి " అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
బ్రహ్మ దేవుడు "మహేశ్వరుడు ఏంటి, ఆ అల్లరి ఏంటి .." అని చూస్తున్నాడు.
పార్వతి, సరస్వతి మాతలు "ఇంకా ఏమి చేయబోతున్నడో .."అని ఆసక్తి గా వీక్షిస్తున్నారు.
అందరు "మనం కూడా ఆ పసి బాలుడిని వెళ్లి ముద్దులాడదామా "అనుకుంటున్నారు.
చిన్నగా దగ్గరకు వచ్చాడు నంది (చిన్నగా మాట్లాడుతూ )"మహాదేవా, తమరు చాలా ముద్దుగా  ఉన్నారు " అన్నాడు.
నేను నా చేతులతో నందిని తడిమాను. అంతసర్వస్వమనిాగరాజు కూడా నా వద్దకు వచ్చారు.
ఇంతలో వచ్చింది శివమ్మ "నాయనా, నీవు ఎద్దువి. నువ్వు కూడా ఎద్దువి. మరి నువ్వేమో  పామువి. పిల్లాడు దడుచుకోడు? "అంటూ వాళ్ళని ప్రేమగా కసురుకుంది.
నంది భృంగి ఐతే పర్వాలేదు .కానీ నాగరాజు మాత్రం "పో అమ్మ ..నేను బాలుడ్ని చూడకూడదా, తాకకుడదా? "అన్నాడు.
శివమ్మకి అన్నీ తెల్సు, కానీ ఆమెకు అన్నిటికన్నా నేను తన కొడుకునని, తనకు సర్వస్వమని ,తను బతికేది నా కోసమని మాత్రమే గుర్తుంది.
విష్ణు దేవుడు "అవునమ్మ నీకే కాదు, ప్రతి భక్తుడికి తను భగవంతుడు అంతే .." అన్నాడు.
ఉన్న పళంగా నేను నిద్రలేచి ఏడిచాను మా అమ్మ కోసం. ఎంతసేపని నేను మాత్రం తలగడ పక్కన ఉంటాను?
మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను ఎత్తుకొని, నీ కోసమే ఏర్పాట్లు చేస్తున్నా కన్నా, తండ్రి అంటూ ముద్దు ఆడింది. నేను కూడా మా అమ్మ కు ముద్దులు పెట్టాను. 
అమ్మా, నువ్వు ఎక్కడికి పోకు, అని సైగలు చేశాను. మా అమ్మ నా బుగ్గలు లాగి, మళ్ళీ నాతో ఆడుకుంటోంది.
నంది "అమ్మ ఇప్పుడు మీరు  ఏమి చేయబోతున్నారు ?" అని అడిగాడు.
శివమ్మ "చూడు నంది, నా కన్నయ్య ఈ బుజ్జి తండ్రిని ..."అంటూ సంబరపడిపోతోంది.
నంది -భృంగి - నాగరాజు...."మన శివమ్మ తల్లి మహాదేవుడికి ఏమి ఉప చర్యలు చేయబోతుందో .." అని ఆసక్తిగాచూడసాగారు.
విష్ణు దేవుడు "ఏమి సోదరి ! మహాదేవుడు ఎవరికీ ఏమి అర్ధం కాకుండా చేసాడు ? తమరు ఆయనోలో సగం కదా మీకు ఏమన్నా అర్ధం అవుతుందా?" అని అడిగాడు.
మాతలు ముగ్గురు "మాటలకు అందని ఈ మాతృత్వ అనుభూతి ని  ఏ నారి మాత్రం చెప్పగలదు? చూసి అనుభవించటం తప్ప "అంది.
ఇక మా అమ్మ నాకోసం సింహసనాన్ని సిద్దం చేయబోతోంది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages