Monday, April 23, 2018

thumbnail

పుట్ట గొడుగులు (కుక్క గొడుగులు)- వాటి ఆరోగ్య మరియు ఇతర ప్రయోజనాలు

పుట్ట గొడుగులు (కుక్క గొడుగులు)- వాటి ఆరోగ్య మరియు ఇతర ప్రయోజనాలు
అంబడిపూడి శ్యామసుందర రావు
మొక్కలలో పత్రహరితములేని శిలింద్రాలు అనే తరగతికి చెందినవి ఈ పుట్టగొడుగులు ఇవి సాధారణముగా తడిసిన   దుంగలపైనా తేమగా ఉండే ప్రదేశాలలో పెరుగుతాయి గొడుగు ఆకృతిలో ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగులు అంటారు  ప్రపంచము మొత్తము మీద సుమారు 1,40,000 రకాల జాతుల పుట్టగొడుగులు ఉన్నాయి కానీ వీటిలో ఒక 10% జాతుల గురించిమాత్రమే శాస్త్రవేత్తలు అధ్యయనము చేసి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వాటిని వైద్య పరముగా ఎలా ఉపయోగించవచ్చో  ప్రపంచానికి తెలియజేసారు.వాటిలో కొన్నింటిని మనము తెలుసుకుంటే వాటివల్ల పూర్తి ప్రయోజ నాలను పొందవచ్చు ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది వీటిని మంచి పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారము గా తీసు కుంటున్నారు 
వీటిలో గల పోషకాలు :-విటమిన్ D మరియు రిబోఫ్లావిన్,నియాసిన్,పాంటోతోనిక్ ఆమ్లము వంటి విటమిన్ B లు,ఎర్గో థయోనైన్ వంటి యాంటీ ఆక్సిడెంట్,సెలీనియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజలవణాలు బీటా గ్లూకాన్, పాలీఫినాల్స్ పీచు పదార్ధాన్ని ఇచ్చేవి ఉంటాయి. ఇవి ప్రిబయోటిక్స్ గా పనిచేసి జీర్ణ వ్యవస్థలో ఉపయోగ పడే ప్రోబయోటిక్ జీవులం పెరుగుదలకు ఉపయోగ పడతాయి. ఇంకా ఉపయోగాలను తెలుసుకుందాము.  
1  వీటిలో సెలీనియం అనే ధాతువు సమృద్ధిగా ఉంటుంది :-పుట్టగొడుగులలోని సెలీనియం చాలా ముఖ్యమైన ప్రయోజనకారి అయినా ధాతువు సాధారణముగా ఈ ధాతువు జంతు సంబంధమైన మాంసకృత్తలనుండి లభ్యమవుతుంది విశేషము ఏమిటి అంటే ఈ శిలింద్రము మొక్కల జంతువుల వ్యర్ధాల పైన పెరగటంవల్ల ఇవి తినే శాఖాహారుల కు ఈ ధాతువు లభ్యమవుతుంది. సెలీనియం వలన ఎముకలు, దంతాలు, గోళ్లు మరియు వెంట్రులకు గట్టిపడతాయి. ఈ సెలీనియం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అవటం వల్ల క్యాన్సర్ కారకులైన ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.

2.  అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తుంది:- పుట్టగొడుగులలోని పొటాషియం వాసో డైలేటర్ గా పనిచేసి రక్త నాళాలలోని టెన్షన్ ను తగ్గించి రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. ఫలితముగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పుట్టగొడుగులలోని పొటాషియమ్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను అధికము చేస్తుంది. 

3.రోగ నిరోధక వ్యవస్థను పటిష్టము చేస్తుంది:-పుట్టగొడుగులలోని ఎర్గో థయనైన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కణాలలో జరిగే మెటబాలిక్ చర్యల వల్ల ఏర్పడే ప్రమాదకర మయిన ఫ్రీ రాడికల్స్ ను తొలగినచటము వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. శరీరములో  ఉపయోగకరమైన సూక్ష్మ జీవుల వృద్ధికి పుట్ట గొడుగుల లో ఉండే యాంటీ బయోటిక్స్  ఉపయోగ పడతాయి పుట్టగొడుగులలోని విటమిన్ A ,B,C లువ్యాధి నిరోధక వ్యవస్థ బలపడటానికి దోహదపడతాయి. 
4. పోషకాల శోషణకు ఉపయోగ పడతాయి :-సామాన్యముగా విటమిన్ A కూరగాయలలో చాలా అరుదుగా లభ్యమవుతుంది కానీ పుట్టగొడుగులతో విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ A క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ధాతువులు  శోషణకు ఉపయోగిస్తాయి. అంతేకాకుండా పుట్టగొడుగులతో ఈ రెండు ధాతువులు ఉండటంకూడా చాలా ఉపయోగకరము కాబట్టి పుట్టగొడుగులు తినటం వల్ల రెండు ఉపయోగాలు వస్తున్నాయి.
 5. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:-పుట్టగొడుగులతో క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు గట్టి పడతాయి. మన ఆహారములో క్యాల్షియం అధికముగా ఉండటం వల్ల ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంతేకాకండా కీళ్లనొప్పులు ఎముకల సాంద్రత తగ్గటము వంటి ఎముకలకు సంబంధించిన జబ్బులు రావు. 
6. మధుమేహానికి మంచిది:-తక్కువ శక్తిని ఇచ్చేవి కాబట్టి మధుమేహ రోగులకు పుట్టగొడుగులు మంచి ఆహారము వీటిలో క్రొవ్వు,కొలెస్ట్రాల్ ఉండవు. పిండిపదార్ధాలు తక్కువస్థాయిలోనూ,ప్రోటీన్ లు విటమిన్లు, ఖనిజలవణాలు అధికముగా ఉండటం వలన మధుమేహరోగులకు బాగా మంచి చేస్తాయి. వీటిలో పీచు,నీరు కూడా బాగా ఉంటుంది. వీటిలో సహజ సిద్దమైన ఇన్సులిన్ మరియు చక్కెరలను పిండి పదార్ధాలను విచ్చిన్నము చేసే ఎంజైములు ఉన్నాయి. వీటిలో కాలేయము,క్లోమము, వినాళా  గ్రంధులు సక్రమముగా పనిచేయటానికి అవసరమయిన పదార్ధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్సులిన్ తగు మోతాదులో ఉత్పత్తి అయి మధుమేహము అదుపులో ఉంటుంది. 
7.మగవారిలో ప్రోస్ట్రేట్ క్యాన్సర్,ఆడవారిలో స్తనాల క్యాన్సర్ లను అడ్డుకుంటుంది :-పుట్టగొడుగులలోని బీటా గ్లూకాన్స్ మరియు కాంజుగేటేడ్ లీనోలిక్ ఆమ్లములు యాంటీ కార్సినోజెనిక్ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి స్తనాల క్యాన్సర్, ప్రోస్ట్రేట్ క్యాన్సర్లను నిరోధిస్తుంది. లినొలిక్ ఆమ్లము అధికముగా ఉత్పత్తి అయిన ఈస్ట్రోజెన్ యొక్క దుష్ ఫలితాలను అణిచివేస్తాయి.కాబట్టి ఆడవారిలో స్తనాల క్యాన్సర్ రాదు. బీటా గ్లూకాన్స్ ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కణాలను అదుపు చేస్తాయి. 
8.రక్త విహీనతను అడ్డుకుంటుంది :-ఎనీమియా(రక్త విహీనత)వ్యాధిగ్రస్తుల రక్తములో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల తల నొప్పి అలసట,నరాల బలహీనత, మరియి జీర్ణ సంబంధిత సమస్యలు,మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. పుట్టగొడుగులతో ఐరన్ శాతము అధికముగా ఉంటుంది. వీటిలోని పోషకవిలువలలో దాదాపు 60% గ్రహించ బడతాయి.కాబట్టి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి బాగా జరుగుతుంది 
9. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది:-పుట్టగొడుగులలో కొలెస్ట్రాల్,క్రొవ్వు లేకపోవటం,తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండటం,మొదలైనవి మనకు మంచి చేస్తుంది. వీటిలోని పీచు ,ఎంజైములు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అంతే కాకుండా వీటిలోని ప్రోటీనులు జీర్ణము అయినాక కొలెస్ట్రాల్ ను దహించివేస్తాయి. వీటిలో LDL (చెడు కొలెస్ట్రాల్) HDL (మంచి కొలెస్ట్రాల్) ల మధ్య సమతుల్యత పాటించి ఆర్తిరో స్క్లిరోసిస్ వంటి  గుండెకు రక్తప్రసరణలో ఎదురయ్యే సమస్యలను నివారిస్తుంది. 
ఇప్పటివరకు పుట్టగొడుగుల ఉపయోగాలు అవి మన ఆరోగ్యానికి ఏవిధముగా ఉపయోగ పడతాయో తెలుసు కున్నాము కానీ పుట్టగొడుగులన్నీ మంచివి కావు వీటిలో దాదాపు 50 నుంచి 100 రకాల  విషపూరితమైనవి ఉన్నాయి కాబట్టి వీటి విషయములో జాగ్రత్తగా ఉండాలి.వీటిని తింటే ప్రమాదము  ఏదో ఒక లక్షణాన్నిబట్టి వీటిలో విషపూరితమైన వాటిని గుర్తించటం కష్టము పుట్టగొడుగులను సేకరించే వారిని "మైకో ఫాజిస్ట్"అంటారు వీటి సేకరణను "మష్ రూమింగ్" అంటారు వీరు మంచివి పుట్టగొడుగులని నిర్దారించుకున్నాక అటువంటి లక్షణాలు ఉన్న పుట్టగొడుగులను మాత్రమే సేకరిస్తారు. విషపూరితమైన పుట్టగొడుగులను తింటే శరీరములో వచ్చే మార్పులను ముందు తెలుసుకుందాము 
1. అధికముగా లాలాజలము స్రవించటము 2.తరచుగా మూత్ర విసర్జన జరగటము 3.అధికముగా చెమట లేదా కన్నీరు ఉత్పత్తి అవటం 4.మంటతో దాహము వేయటము 5 లెతార్జి.6.దృష్టిలో లోపము 7.కాళ్ళు చేతులలో తిమ్మిర్లు  8. చిత్త భ్రమలు 9. గుండె దడ మొదలైనవి ఈ లక్షణాలకు కారణము ఆ జాతులు ఉత్పత్తి చేసే హానికరమైన  ద్వితీయ మెటాబోలైట్స్ కాబట్టి ఇవి మంచివి అని తెలుసుకున్నాకే వీటిని తినాలి కొన్ని తక్కువ హానికలుగా జేసే విషాలు ఉడికించటంవల్ల నశిస్తాయి. 
పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి కలుషితమైన మట్టిని శుభ్రపరుస్తాయి. కాబట్టి పర్యావరణాన్ని కలుషితము చేసే ఫ్యాయాక్టరీల వద్ద వీటిని పెంచవచ్చు. సిద్ధబీజాలను ఉత్పత్తిచేయని కొన్ని పుట్టగొడుగులు కొన్ని కీటకాలను పురుగులను (కార్పెంటర్ చీమలు వంటివి)ఆకర్షించి చంపివేస్తాయి. కొన్ని పుట్టగొడుగులు చెదపురుగులను వికర్షిస్తాయి. ఏబెన్ బర్గర్ వంటి ప్రోడక్ట్ డిజైనర్ వీటి మైసిలియం(సన్నని దారపు పోగుల వంటివి) లను ఉపయోగించి స్టైరోఫోమ్ పదార్దానికి బదులుగా కొత్త పదార్ధాన్ని తయారుచేశారు ఈ విధముగా పుట్టగొడుగుల మీద కొత్త పరిశోధనలు కూడా జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో వీటి యొక్క మరిన్ని ప్రయోజనాలను శాస్త్రవేత్తలు తెలుసుకోవచ్చు 
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information