మన భక్తి రహస్యం - అచ్చంగా తెలుగు
మన భక్తి రహస్యం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


ఆరాటాలు మనని ఆక్రమించుకున్నప్పుడు 
అవసర భక్తి మనని కెరటంలా ముంచివేస్తుంది.
పోరాటాలు మనని విడిచి వెళ్లిపోయాక మాత్రం,
అప్పుడు అదే భక్తి మనకు బోర్ కొడుతుంది.
మనకు భక్తి కేవలం బాధలను పోగొట్టుకొనే సాధనం,
ఆవేదనను దూరం చేసుకొనే ఒక అవకాశం.
అందుకే మన మాయలు తెలిసిన దేవుడు,
మనకు అల్లంత దూరంలోనే నిలిచుంటాడు.
కాలం వేసిన గాలంలోనే మనను నిలిపి ఉంచుతాడు.
మహిమలు కలవానికి మన మాయలు నచ్చవు,
నిర్మలుడైన వాడికి మన నటనలు నచ్చవు.
అందుకే,మనం పాడే గేయాలకతడు స్పందించడు, 
మనం పొందే గాయాలకతడు బాధ్యుడు కాడు.
మన బాధలకు మన ఆలోచనలే,ఆచరణలే కారణం.
మనతో మనం కోరుండి చేస్తున్నదే ఈ రణం.
***

No comments:

Post a Comment

Pages