భారత రత్న- శ్రీ మోక్షగుండం విస్వేశ్వరయ్య - అచ్చంగా తెలుగు

భారత రత్న- శ్రీ మోక్షగుండం విస్వేశ్వరయ్య

Share This
భారత రత్న- శ్రీ మోక్షగుండం విస్వేశ్వరయ్య
అంబడిపూడి శ్యామసుందర రావు 

ఈ పేరు భారతీయులకు ఒక ప్రముఖ ఇంజనీర్ గా స్టేట్స్ మన్ గా ఒక ఆర్ధిక శాస్త్రవేత్తగా అన్నిటికన్నా నవ భారత నిర్మాతలలో ఒకడుగా చిరపరిచితమైనది భారత దేశములోప్రముఖ ఇంజనీర్ గా చెప్పుకోవలసి వస్తే మొదటగా చెప్పుకొనేది ఈయన పేరే కాబట్టి అయన జన్మ దినాన్ని భారత దేశములో "ఇంజనీర్స్ డే" గా జరుపుకుంటారు   సెప్టెంబర్ 15,1861న కర్ణాటకలోని ముద్దనహళ్లి లో జన్మించి పాఠశాల చదువు చిక్కబళ్లాపూర్,బెంగుళూరులలో పూర్తిచేసాడు 1883లో ఇంజనీరింగ్ విద్యలో పట్ట భద్రుడై బొంబాయి పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా చేరి 25 సంవత్సరాలు అక్కడే సర్వీస్ చేసాడు. 
విస్వేశ్వరయ్య ఇంజనీరుగా వృత్తిపరమైన ఘనత పేరు ప్రఖ్యాతులు సంపాదించింది మైసూర్ మహారాజా సంస్థానంలో చీఫ్ ఇంజనీరుగా ఆ తరువాత దివాన్ గా పదవి నిర్వహించిన కాలమే ఆ కాలములో అయన ప్రారంభించిన ప్రతి పని భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చింది అది అయన దూర దృష్టికి నిదర్శనము అయన ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ,మైసూర్ యూనివర్సిటీ,మైసూర్ పేపర్ మిల్ ,భద్రావతి ఐరన్ వర్క్స్,కృష్ణరాజ సాగర్ డామ్ మొదలైనవి అయన దూరదృష్టికి దేశాభివృద్ధికి సజీవ తార్కాణాలు

అయన మైసూర్ దివాన్ గా మైసూర్ కు మాత్రమే తన సేవలు అందించలేదు భారత దేశములో లోని ఇతర ప్రాంతాలకు కూడా ఆయన తన సేవలు అందించి ప్రజల మనస్సులలో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు నేటి యువతకు ఆ విషయాలు తెలియకపోవచ్చు కానీ తెలుసుకోవలసిన అవసరము ఉంది అటువంటి సంఘటనలలో హైదరాబాద్ నగరాన్ని1920 లో వరదల నుండి శాశ్వతముగా  కాపాడిన ఘనత ఒకటి.

1908లో బొంబాయి పబ్లిక్ వర్క్స్ శాఖ నుండి ఐచ్చిక పదవి విరమణ తీసుకొని అభివృద్ది చెందిన ఇంగ్లాండ్ వంటి దేశాలలో ఇంజనీరింగ్ శాఖలో వారు అవలంబిస్తున్న నూతన విధానాలను తెలుసుకోవటానికి పర్యటించి భారత దేశానికి 1909 లో తిరిగి వచ్చాడు. ఈయన విదేశ పర్యటనలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరము విపరీతమైన వరదలతో అతలాకుతలం అయింది కుండపోత వర్షాల కారణముగా చెరువులు నిండి నీటి ఉధృతికి కట్టలు తెగి చెరువులలో నీరు నగరాన్ని ముంచెత్తింది వరద మట్టము ఊహించని స్థాయికి చేరింది ఫలితముగా అపార జన ధన నష్టము వాటిల్లింది సుమారు 19,000 ఇళ్ళు కూలిపోయినాయి 15,000 మంది ప్రాణాలను కోల్పోయారు ఒక లక్ష అంటే అప్పటి హైదరా బాద్ జనాభాలో పావు వంతు నిరాశ్రయులయినారు వరదలు మూసి నదికి కొత్త ఏమికాదు పూర్వము అటువంటి వరదలు ఇంచుమించు 12 దాకా వచ్చాయి కానీ 1908లో వచ్చిన వరదలు హైదరాబాద్ చరిత్రలో అంతకు మునుపు ఎప్పుడు అంత నష్టాన్ని కలుగజేయలేదు అప్పటి 6వ నైజాం నవాబ్ మహబూబ్ అలీ ఖాన్ స్వయముగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తు  భాదితులకు సహాయము అందజేశాడు నిరాశ్రయులైయినా ప్రజలకు రాజ  భవనాలలో ఆశ్రయము కల్పిస్తూ వారికి వంట వార్పులను రాజ భవనాలలోనే చేపట్టాడు ఆ విధముగా సుమారు 5 లక్షల మంది ప్రజలకు సహాయము అందించాడు

భవిష్యత్తులో ఇటువంటి వరదలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి విస్వేశ్వరయ్య గారిని హైదరాబాద్  ఫ్లడ్ మేనేజిమెంట్ ప్లాన్ కు సలహాదారునిగా నియమించాడు బ్రిటిష్ వారు తమ ఇంజనీర్లను పంపుతామని చెప్పిన నైజామ్ నవాబ్ విస్వేశ్వరయ్య గారి ప్రతిభను విన్న నవాబ్ ఈయననే ఎన్నుకొని భాద్యతలను అప్పజెప్పాడు విస్వేశ్వరయ్య గారు కొన్ని షరతుల మీద ఒప్పుకున్నారు అవి ఏమిటి అంటే తనకు బ్రిటిష్ వారికి  ఇస్తారో తనకు కూడా అంతే వేతనం ఇవ్వాలి రెండవది తనకు ఇష్టమైనవారిని  తనతో పనిచేయటానికి ఎంపిక చేసుకొనే అధికారము ఇవ్వాలి ఈ షరతులకు నైజాము నవాబ్ ఒప్పుకొన్న వెంటనే తనదైన శైలిలో పనిని విస్వేశ్వరయ్య గారు ప్రారంభించారు.

మొదట భారతదేశములోని వివిధ ప్రాంతాలలోని వర్షపాతము వివరాలను సేకరించాడు ముఖ్యముగా పొరుగు ప్రాంతాలైన బొంబాయి మద్రాసు వర్షపాత వివరాలను సేకరించాడు  ఆ తరువాత హైదరాబాద్ చుట్టుప్రక్కల గల నదులు జలాశయాల గురించి వాటి నీటి నిల్వ సామర్ధ్యము గురించి సమగ్ర సర్వే నిర్వాహించిడు ఆ ఆ తరువాతే సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాడు.

విస్వేశ్వరయ్య హైదరాబాద్ వరదలను నివారించటానికి కనుగొన్న పరిష్కారము కొత్తగా వర్షపు నీటిని నిల్వచేసే జలాశయాలను సృష్టించటం. నగరానికి ఎగువన నిర్మించే జలాశయాలు అదనపు వర్షపు నీటిని నిల్వ చేసి వరదలను అరికడతాయి తన నివేదికను విస్వేశ్వరయ్య గారు అక్టోబర్ ఒకటి,1909 న అందజేస్తూ కొన్ని ప్రతిపాదనలను కూడా చేశారు అవి వరదల సమయములో పౌరులకు కల్పించవలసిన సౌకర్యాలు,సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు ను నెలకొల్పి రాబోయే ఆరు సంవత్సరాల వరకు ప్రతి ఏటా 2 మిలియన్ల రూపాయలు వరదల నివారణ చర్యలకు ఖర్చు పెట్టాలి విస్వేశ్వరయ్య గారి ప్రతిపాదనలను ఆమోదించి పని ప్రారంభించి రెండు నీటి నిల్వజలాశయాలను ( ఉస్మాన్ సాగర్ ,హిమాయత్ సాగర్ ,ఒకటి మూసి నదికి ఎగువన రెండవది మూసి ఉపనది అయినా ఈసి కి ఎగువన ) నవీన పద్దతులలో భూగర్భ మురుగు నీటి పారుదల సౌకర్యముతో నిర్మించారు వరదల వల్ల దెబ్బతిన్న గేట్లను పునర్మించి గట్టి పరిచారు చార్మినార్ మూసి నది మధ్య గల ప్రాంతాన్నిపునర్మించారు సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు ను 1912 లో స్థాపించారు నది గట్టు వెంబడి ఉండే జన సమర్ధ ఆవాసాలను ఖాళి చేయించి పార్కులు మొదలైన సుందరకరణ పనులు మొదలు పెట్టారు.ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, హై కోర్ట్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వంటి బిల్డింగులు కట్టారు.

1911లో మహబూబ్ అలీ పాషా చనిపోవటము వల్ల ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ పధకాలను కొనసాగించాడు. ఉస్మాన్ సాగర్ 1920 లోను,హిమాయత్ సాగర్ 1927లోను,పూర్తి అయినాయి ఆ విధముగా హైదరాబాద్ చరిత్రలో ఒక పెద్ద మలుపు సంభవించి మూసి నది వరదలు అదుపుచేయబడ్డాయి విస్వేశ్వరయ్య గారి ముందుచూపు కృషి వలన హైదరాబాద్ వరద రహిత నగరము గా తయారయింది కానీ ఆ తరువాత పాలకుల నిర్లక్ష్యము వలన ఆగస్టు 2000 సంవత్సరములో వచ్చిన భారీ వర్షాలకు మళ్ళి మూసి నదికి వరదలు వచ్చి అపార నష్టము కలుగజేసినాయి కారణము ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలకు వర్షపునీటిని తెచ్చే కాల్వలు (నాలాలు) ఆక్రమణలకు గురియై నీరు నగరములోకి ప్రవేశించటము ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతుంది  ముందు చూపు లేని పాలకుల నిర్వాకం ఇది దానికి ప్రజలు మూల్యము చెల్లించుకుంటున్నారు విస్వేశ్వరయ్య గారు వరద రహిత హైదరాబాద్ ను నిర్మిస్తే ఇప్పటి పాలకులు  ఏ చిన్నపాటి వర్షానికి అయినా మునిగిపోయే హైదరాబాద్ ను తయారు చేశారు.
***


No comments:

Post a Comment

Pages