పెళ్ళి బంధం - అచ్చంగా తెలుగు
 పెళ్ళిబంధం
రెడ్లం చంద్రమౌళి , పలమనేరు
9642618288


పల్లవి:
తెలుసా ఈ పెళ్ళిబంధం జతేపడ్డ జంటలకిపుడు
బ్రతుకే చిదిమేసుకోగ కాపురాన కలతల చిక్కి
ఎవరికి వారే యమునా తీరే అనుకుంటే సరిపోతుందా
ఏంపాపం చేసారండీ విరిసేటి పసికుసుమాలు
|| తెలుసా ||
చరణం:1
ఇల్లాలే నీ ఇంట వెలుగొందే జీవనజ్యోతి
నూరేళ్ళు సౌభాగ్యం నిలిపేటి మంగళగౌరి
కలిమైనా లేమైనా నీ చెలిమితో...
కడదాక ఈదేను తన ఓర్పుతో...
నీ వంశం నిలిపే కృషిలో సంసారపు సమిధౌతుంది
|| తెలుసా ||
చరణం:2

మనసెరిగి మసిలేటి చెలికాడు నీ సైదోడు
సంసారపు వృక్షాన్ని నిలిపేటి వేరౌతాడు
ఇసుమంత నలతైన పడనీయకా...
పసుపతిలా తనలోని సగమిచ్చుగా...
తన నెత్తుటి తైలం పోసి ఈ బండిని నడిపిస్తాడు
|| తెలుసా ||


***

No comments:

Post a Comment

Pages