మనసు మర్కటం
 ప్రతాప వెంకట సుబ్బారాయుడు

అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు
మనసూ బలంగానే ఉంటుంది
మనిషీ దృఢంగానే ఉంటాడు
పరిస్థితులు కాస్త అదుపు తప్పాయా?
మనసు పరి పరి విధాల ఆలోచిస్తూ
మనిషిని బలహీనపరుస్తుంది
ఎవర్నిబడితే వాళ్లని, ఏది పడితే దాన్ని
బేలగా నమ్మేలాచేస్తుంది
చెట్టుకు పుట్టకూ మొక్కిస్తుంది
ముడుపులు కట్టిస్తుంది
చెయ్యకూడనివన్నీ చేయించి విచారించేలా చేస్తుంది
అసలు మనసును కట్టడి చేయగలిగితే
మనిషిగా పరిణతి సాధించినట్టే
పిపీలికమంతటి ఈ చిన్న కిటుకు తెలిస్తే
మేరువంత ఎదిగినట్టే
ధ్యానాది క్రియల్తో మనసును వశపర్చుకోవాలనుకునే
ఋషులు..సాధువులు కాలేకపోయినా
మామూలు మనుషులుగా నైనా
మనసు మర్కటాన్ని రాటకి కట్టేసి
చెప్పినట్టు ఆడేలా చెయ్యగలగాలి
అలా చేసి చూడండి
మనని మించినవారు మరొకడుండరు!
 ***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top