దిక్సుచి - అచ్చంగా తెలుగు

దిక్సుచి

పెమ్మరాజు అశ్విని

పిల్లలు భగవత్ స్వరూపాలు అంటారు ,అంతటి అమాయకత్వం తో నిండిన ముడి పదార్ధం వంటి వారు ,పెద్దవారు ఎటు నిర్దేసిస్తే వారు ఆ దిశ గా రూపొందుతారు.పసి ప్రాయం లో వారు ఏమి తినాలో ఎలా మెలగాలి ఎలా నడవాలి అన్ని మనంవారికి నేర్పిన విధానం మీద ఆధారపడుతుంది.యాంత్రికమైన ఈనాటి జీవనవిధానం లో తల్లిదండ్రులు పిల్లలు పట్ల ఉన్న ప్రేమ ను వ్యక్త పరిచే సమయం కూడా వుండట్లేదు .అందువల్ల పిల్లల్ని ఎక్కువ సేపు స్కూల్ లో ఉంచమనే తల్లిదండ్రులు సంఖ్య పెరుగుతోంది.ఇదే అదను స్కూల్ వారు కొత్త కొత్త కోర్సుల పేర సాధ్యమైనంత తల్లిదండ్రుల జేబులకి కన్నాలు పెడుతున్నారు.ఇంతే గాక విపరీతమైన పోటీ తత్వం అనే మత్తు కి పిల్లల్ని తల్లిదండ్రులు కి ఎంతలా యెక్కిస్తున్నారు అంటే పది సంవత్సరాలు నిండని పిల్లలో ఆత్మన్యూనత పెరిగి అసలు సమస్య కి మూలం తెలియక డాక్టర్లు చుట్టూ తిరిగే తల్లిదండ్రులు కోకొల్లలు.
ఇక మార్చ్ ఏప్రిల్ నెలలు వచ్చాయంటే ప్రతి ఇంటా పరీక్షల జ్వరం మరీ ముఖ్యంగా పదవ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్న సగటు తెలుగింట్లో .మన పిల్లల నాడీ వేగాన్ని పెంచడానికి డబ్బులు కట్టించుకుని మరీ కార్పొరేట్ కళాశాల యాజమాన్యం ప్రయత్నిస్తున్నాయి .ఆ కార్పొరేట్ కళాశాల వారు రెండు సంవత్సరాలు అతి జాగ్రత్త తో కనీసం జ్వరం వచ్చిన అయిన కూడ ఒక్క పూట సెలవు ఇవ్వరు.
పిల్లల్ని మూస పోసిన ప్రశ్నపత్రాలు బట్టివేయించడం మీద వుండే శ్రధ్ధ అసలు పాఠ్యపుస్తకాలు లో వుండే అంశాలు మీద లేకపోవడం కడు శోచనీయం,ఎంసెట్ విధానాలకు అలవాటు పడిపోయి అసలు పాఠ్యఅంశం మీద ఆధార పడిన ఇంటర్మీడియట్ లో తక్కువ మార్కులు వస్తే ఆ వచ్చిన మార్కులను వైఫల్యం గా వేలు ఎత్తి చూపే వెర్రి సమాజ ధోరణి తట్టుకోలేక ఆత్మహత్యలు చేస్కుంటున్న విద్యార్థులు గురించి రోజు మనం వార్తలు వింటున్నాం.
కానీ మూస పోసినట్టు గుంపు లో గోవిందం లాగా వాళ్ళ మనసుకి నచ్చక పోయినా పిల్లలు చదువుతున్నారు అన్న విషయం టెన్షన్ తో చిన్నబోయిన వాళ్ళ మొహాలు చెప్తాయి దీనికి సాయం పొరపాటు న ఒక మార్క్ తగ్గితే వారిని వేరే తరగతి కి మార్చి ఇంకాస్త ఒత్తిడి పెంచేస్తున్నారు.ఇంతా కష్టపడి చదివి న సబ్జెక్ట్ లోతు తెలియక పోవడం తో పరీక్షకు సరిపడ తర్ఫీదు తీసుకున్నా ఇవాళ ఉన్న పోటీ ప్రపంచం లో తల్లిదండ్రులు తైలం ముట్టజెపితే తప్ప నాణ్యత గల కాలేజీ లో సీట్ రాదు .
అయితే ఈ అంశం గనుక లోతుగా పరిశీలిస్తే లోపం తల్లిదండ్రులు దృక్పధమా లేక వారి ఆశల ను లూటీ చేస్తున్న యాజమాన్యాల దా. ఒక సంవత్సరం సగటునఒక రాష్ట్రంలో 150000 మంది పదవ తరగతి పాసయితే అందులో అందరకీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే ఆసక్తి అలాగే తల్లిదండ్రులు కి స్థోమత ఉండాల్సిన అక్కర వుందా.కొంత మంది పిల్లలకి కళాత్మక రంగాలు ఉదాహరణకు సంగీతం నాట్యం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం వంటి వే గాక సాంకేతిక పరమైన ఎన్నో అంశాల కి సంభందించిన అంశాలను చదివి వాటి లో నే ఉపాధి వెతుక్కుంటే వుండే తృప్తి కోట్లు పోసిన కొనలేనిది.
అంత తంటాలు పడి సీట్ సంపాదించిన తర్వాత సదరు కాలేజీ లో బోధనా పటిమ సరిగా లేక పిల్లలు పడే అవస్థ వారు చదువు తున్న చదువు అర్ధం కాక ఏదో ముక్కున పట్టి రేపు మన భవిష్యత్ ఏంటి అనే భయం తో పట్టా చేత్తో పట్టుకుని బహుళ జాతీయ కంపెనీ ల లో ఉద్యోగం వస్తుందా రాదా వచ్చినా మనం ఆ ధాటికి తాళగలమా అని సంశయం తో బిక్కు బిక్కు మంటున్న యువత ని చూస్తే జాలి కలగక మానదు.
కేవలం ఇవే కావు కాదేదీ కవిత కి ఆనర్హం అన్న చందాన కాదేదీ స్టార్ట్ అప్ కి ఆనర్హం ఇడ్లి, దోస పిండి ,చిరు తిండి మొదలు కొని సాఫ్ట్ వేర్ లు స్మార్ట్ ఫోన్ల తయారీ వరకు అన్ని స్టార్ట్ అప్ బిసినెస్ ల బాట పడుతున్నారు. వీటికి భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వీరిని ప్రోత్ససహించే దిశ గా స్టార్ట్ అప్ ఇండియా అని పధకం ప్రవేశపెట్టి యువత కి శిక్షణ తో పాటు ఆర్ధిక సాయం కూడా చేస్తోంది. ఇవేగాక యువత కి చేయూత ను ఇచ్చే దిశగా సులభతరం గా ఒక మొబైల్ ఆప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు మరియు పేటెంట్ ఫీజు లో 80 శాతం రాయితీ ,తొలి నాళ్ళ లో ఇలాంటి సంస్థలకు ఆదాయ పన్ను లో రాయితి వంటివి కల్పించి యువ భారతాన్ని స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేందుకు దిక్సుచి గా నిలుస్తోంది.ఈ పద్దతి సఫలీకృతం అయితే ప్రపంచం మొత్తం భారత దేశం వైపు ఉపాధి కోసం బాసట కోసం చూసే రోజు ఎంతో దూరం లో లేదనిపిస్తోంది,అదే జరిగిన నాడు భారత మాత పెదాల పైన విజయ దరహాసం తప్పక కనిపిస్తుంది.
చదువు అనేది మనిషి కి సంస్కారం వ్యక్తిత్వ వికాసం తో పాటు జీవనోపాధి కలిగించే ది ఉన్న రోజు పిల్లలు వారికి నచ్చిన విద్య ను ఎన్నుకొని అందులో నిలదొక్కుకొన్న రోజు ఆ విద్య కి సార్ధకత. ఒక్కోసారి పిల్లలు ఎంచుకునే మార్గం కష్టం గా ను వుండవచ్చు కానీ అటువంటి సమయం లో వారి గమనాన్ని గమ్యాన్ని హేళన చేయక వారికి మార్గం చూపే దిక్సుచి గా తల్లిదండ్రులు ,అధ్యాపకులు, విద్యా వ్యవస్థ మారే ప్రయత్నం జరగాలి.
ఉన్నత విద్య కి ఉద్యోగమే లక్ష్యమా అంటే కాదనంటున్నారు నేటి యువత ,అలాగని పెద్ద పెట్టుబడులు ఆశించట్లేదు.తక్కువ ఖర్చు ఒక ఆప్ తో తమ తెలివి ని జోడించి పేరు డబ్బు రెండు సంపాదించుకుంటున్నారు.వీటల్ని స్టార్ట్ అప్ అని పిలుస్తున్నారు.మీకు చాలా ఆకలి గా ఉంది చేస్కు తినే పరిస్థితి లేదా స్విగ్గీ ఆప్ లో ఆ చుట్టుపక్కల విభిన్న వంటకాలు రుచి చూపించే రెస్టారెంట్లు వాటిలో రకరకాల మెనూ తో పాటు ధర అవి అందించేందుకు పట్టే సమయం తో సహా చూపించి మన పని తేలిక చేసేసారు. అలాగే ఉన్నఫలాన ఊరు వెళ్ళాలి బస్ టికెట్ దొరికే తేలిక మార్గం రెడ్ బస్ ఆప్. ఆప్ లో మీరు వెళ్ళవలసి న ఊరూ పేరు అలాగే ఏ బస్ లు వున్నాయో ఎంత అవుతుందో చెప్పేస్తుంది.
***

No comments:

Post a Comment

Pages