Tuesday, May 23, 2017

thumbnail

ఔత్సాహిక చిత్రకారిణి గాయత్రి

ఔత్సాహిక చిత్రకారిణి గాయత్రి 
భావరాజు పద్మిని మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
నా బాల్యం అంతా చీరాల ఒంగోలులో గడిచిపోయింది. చీరాలలో పుట్టాను కొన్ని రోజులు బామ్మ తాతయ్యల దగ్గర పెరిగాను. మేము ఇద్దరం పిల్లలము నేను తమ్ముడు.నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి..నన్ను అమ్మాయి అన్న దృష్టిలో మా నాన్నగారు ఎప్పుడూ చూడలేదు.
ఎలాంటి పరిస్థితులనయినా ఎదుర్కొనే మనోబలం ఉండాలన్నే ఆయన ఆశయమే ఆయన ఇచ్చిన గొప్పవరం..

మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ? 
మా ఇంట్లో మా నాన్నగారు బొమ్మలు వేశేవారు.ఆయన 32 రకాల రాధాకృష్ణుని భంగిమలు వేశారు..అయితే కాలక్రమేణ ఊద్యోగంలో పని ఒత్తిడి వలన కళకి దూరం అయ్యారు. నేను తమ్ముడు ఇద్దరం వేస్తాము..

చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
నాన్నలో మంచి చిత్రకళ ఉన్నా ఏనాడు మమ్మల్ని అటుగా ప్రోత్సహించలేదు.. నా బాల్యం అంతా చదువు వెనకాల పరిగెత్తడమే సరిపోయింది..పెళ్ళి తరువాత ఖాళీ సమయంలో నేను వేసిన బొమ్మలు చూసి మా వారు ప్రోత్సహించారు...

మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ? 
నాకు చిత్రకళను వేసే ప్రతి ఒక్కరూ గురువులే.అందరిలో ఏదో ఒకనేర్చుకోవాల్సిన విషయం ఉంటుందని నా అభిప్రాయం..నాకు అనుకోకుండా పరిచయమయిన గురువు. అనంత నారాయణ గారు. వారి దగ్గరే మెదటిసారి నా కాన్వస్ పెయింటింగ్ మొదలయింది..ఇప్పటికీ వారి దగ్గర నేర్చుకుంటున్నా....మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
నాకు తెలియకుండానే నా ప్రతి ఆలోచనలో నాన్న ప్రభావం ఉండేది.ఖాళీ సమయంలో పేపరుపై నచ్చిన చిత్రాలు వేసుకొని నచ్చిన కోట్స్ రాసుకునేదాన్ని..అలా చిన్నగా మొదలయింది.తరువాత నాకు గురువుగారు దొరకడంతో అది ఒక  రూపుదిద్దుకుంది..ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను
ఎదుర్కున్నారు ?
ఒడిదుడుకులేమి పెద్దగా ఎదుర్కొనలేదు.. ఎందుకంటే నా ప్రతి అడుగులో స్నేహితుడి వంటి భర్త సహకారం ఉన్నది..నేనంటూ కృషి చేయడం మొదలుపెట్టి 5 సంవత్సరాలే..ఇంకా ప్రాధమిక స్థాయిలోనే ఉన్నాను..

మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
నేను వేసిన వాటిలో బాపు గారిబొమ్మ మరియు వీణతో ఉన్న అమ్మాయి బొమ్మ బాగా పాపులర్ అయ్యాయి ఇటీవల కాలంలో బాపుగారి బొమ్మ ఒక పుస్తకానికి కవర్ పేజీగా ప్రచురించడం జరిగింది..ఇంకొకటి ఇంకా ప్రచురణలోనికి రాలేదు..మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
అవార్డ్స్ అంటే ప్రత్యేకముగా ఏవీ లేవండి. నేను బొమ్మలు గీస్తాను అన్న విషయం చాలా మందికి తెలియదు కూడా .ఇప్పుడు face book లో నా పెయింటింగ్స్ అప్ లోడ్ చేసిన తరువాత కొంచెం కొంచెంగా జనాలకి తెలిసింది..ప్రశంసలూ అంటే చాలా మంది blessings ఇస్తున్నారు..నేనవరో తెలియకున్నా పలానా అమ్మాయి బాగా వేస్తోందిట అని అనుకోవడమే నాకు సంతోషాన్నిచ్చింది..

మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నాకు నా భర్తే బలం ..ఎందుకంటే తను నాకు చెప్పిన మాటనే ఇవాళ మీ అందరి ముందు ఉండేలా చేసింది..job Proposals వస్తున్నప్పుడు తన మాటే మంత్రంలా పనిచేసింది..నీ goal job కాదు..నీకంటూ ఒక seperate identity ఉండాలి అని..అన్నిట్లో తండ్రి తరువాత స్థానం తనై నిలిచాడు..

భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
హ హ ,ఒకరి చెప్పే స్థాయి నాకు రాలేదండి.ఎందుకంటే  ఇందులో నా వయస్సే 5 సంవత్సరాలు..ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది..కాని మనం చెసే పని  కష్టమయినా ఇష్టపడి చేస్తే తరువాత వచ్చే ఫలితంలో ఉన్న ఆనందం చెప్పలేము..ఎవరంతట వారు ఆ అనుభూతి పొందాల్సిందే..ఏ కళయినా ,ఏ రంగమయినా.. మనసు లగ్నం  చేసి చేసిన పనిలో ఒక దివ్యత్వం కనిపిస్తుంది ..ఒకరు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా మన అంతరాత్మకి తెలుస్తుంది..

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

1 Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information