Wednesday, November 23, 2016

thumbnail

ఆట - ఆడు

 ఆట  - ఆడు

కందాళ విజయ్ 

                     
ఆట అనగానే  ఆనందం.ప్రతివారి మొహంలోనూ సంతోషం . మనకు తెలిసిన ఆటలు కొన్నే . తెలీని ఆటలు బోలెడున్నాయి . అన్ని ఆటలూ ఒకటి కాదు .అలాగే అన్నిటి అర్థం , పరమార్థం ఒకటేకాదు . ఈ వ్యాసంలో  ఆటలకు సంబంధించిన వివరాలుంటాయని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్లే . ఆడే ఆట కాదిది . ఆలోచించే ఆట . మొదలెడదామా.
                 శంకరనారాయణ నిఘంటువులో ఆట అనే పదానికి  play , sport , game , dance , joke , gambling   ఇలా ఎన్నో అర్థాలున్నాయి .ఇవన్నీ మనకు పరిచయమైనవే. అయితే కొన్నిసార్లు పరిచయమైన పదాలైనా కాస్త లోతుగా ఆలోచిస్తే ,కొత్త గా కనిపిస్తాయి . కొత్త అందాలు కనిపిస్తాయి .
                 ఒక్కసారి గతంలోకి వెళ్తే ధర్మరాజు జూదమాడాడు . సారంగధరుడు పావురాల తో ఆడాడు . బాలచంద్రుడు పల్నాటి చరిత్రలో బొంగరాలతో ఆడాడు .ఇవి మనకు తెలిసిన ఆటలే . మరి క్రింది సందర్భాలను ఓ సారి గమనించండి .మొదటి ఆట సినిమాకు టికెట్లు దొరకలేదు అంటే  show  అని అర్థం .ఆ అమ్మాయి గజ్జె కట్టి ఆడిందంటే అబ్బో ! ,  అంటే నాట్యం అన్నమాట .వెనకటికి ఆటపాటలు అని పిల్లలకోసం ఒక మాసపత్రిక వచ్చేది .ఆటతోటలు అంటే  Guest house అని అర్థం నీ ఆట కట్టిస్తాను అంటే  నీ పనైపోయిందని భావం . ఆటవిడుపు రోజులు అంటే అనధ్యయనపురోజులు .అంటే ఆ రోజుల్లో పిల్లలు చదవక్కరలేదు.
                           చదరంగంలో నీ ఆటకట్టిందంటే  నువ్వోడావనిఅర్థం . ఆట పట్టించడం అంటే హేళన చేయడం . అంటే నేటి ర్యాగింగ్ లాంటిది .ఆటల్లో అరటి పండు అనేది తెలుగులో బాగా ప్రసిధ్ధి లో వున్న జాతీయం .ఆడేటప్పుడు దెబ్బలు తగిలితే తేలికగా తీసుకొని మరిచి పోవాలని అర్ధం .
నీ ఆటలు సాగనివ్వనని అంటే హెచ్చరిక .ఆటరాక మద్దెల ఓడని అంటే నైపుణ్యం లేని వాడని అర్ధం .
నేనంటే ఆటగా వుందంటే  నన్ను చిన్నచూపు చూస్తున్నావని .
ఇలాఆటలు బోలెడన్ని రకాలు .ఆటతో ఎన్ని ఆటలాడినా ఫరవాలేదు కానీ మాటలు జారకండి . మనుషులు దూరమౌతారు .
****

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information