మార్చేద్దాం - అచ్చంగా తెలుగు

మార్చేద్దాం

  చింతా.లక్ష్మీనారాయణ.( కుంచె)మార్చేద్దామా...అరణోదయరంగులు పులుముకున్న
ప్రకృతిని పచ్చని వనం చేద్దామా?

మార్చేద్దామా...పొకచూరిన ఆకాశమేడను
నీలిశ్వేతవర్ణ మిళితం చేద్దామా?

మార్చేద్దామా...గుమ్మడులు పడిన
 ఓజోన్ పొరకుచౌడేసి పూడ్చేద్దామా?

మార్చేద్దామా...ప్లాస్టిక్ వల్ల కషితమైన జలంను
ఆవుపంచితంతో శుద్ధిజలం చేద్ధామా?

మార్చేద్దామా...ఎన్నోకాలుష్యాలకి కారణమైన 
మనంకార్యం చేబట్టాలి ప్రతిభపూనుదామా?

మార్చేద్దామా...ఒక చెట్టు నరికితే...అవసరానికో...
అనవసరానికో....పది మొక్కలు నాటేద్దామా?

మార్చేద్దామా...ఒక ఫ్యాక్టరీ పెడితే 
ఆఫ్యాక్టరీలోవంద ఫ్యాక్టరీల కార్బన్ డయాక్సైడ్
 పీల్చే మెక్కలు నాటేద్దామా?

మార్చేద్దాం...ఆధునికతనుసాదిద్ధాం
ప్రాచీనతనుమన పూర్వ ప్రకృతి 
పురుడోసుసుకునేలా మనం చేద్ధామా!!
------------------------          

No comments:

Post a Comment

Pages