బాలల్లారా  రారండి...

--గోపీనాథ్ పిన్నలి.


బాలల్లారా  రారండి...
పాపల్లారా వినరండీ
ఈ పేజీ మీదే చూడండీ..
మీరే లాభము పొందండీ...
నెల నెల  అన్నలు, అక్కలు, మామలు
తాతలు మామ్మలు తడుముతు మీ తల
చదివిస్తారోయ్ చక్కని కథలూ..
కవితలు, పాటలు పద్యాలెన్నో
పెద్దలు చెప్పిన సూక్తులు ఎన్నో...
తడబడకుండా చదవాలోయ్
తరము మంచిదై నిలవాలోయ్...
అందరి దీవెన పొందాలోయ్
అందుకె ముందుకు రారండోయ్.
.బాలల్లారా  రారండోయ్
 పాపల్లారా వినరండోయ్...
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top