ఇనుమడించిన అభిమానబలం - అచ్చంగా తెలుగు

ఇనుమడించిన అభిమానబలం

Share This

ఇనుమడించిన అభిమానబలం 


నమస్కారం !
పరిపూర్ణ గురుఅనుగ్రహంతో  గత 31 సంచికలుగా నిరవధికంగా మీ ముందుకు వస్తున్న మీ అభిమాన పత్రిక “అచ్చంగా తెలుగు” కు గత  నెల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్లిక్స్ సంఖ్య 4.75 లక్షలు. మీ అభిమాన బలమే పత్రికకు బలం, అండ-దండ, శ్రీరామ రక్ష. మీ అభిమానానికి ‘అచ్చంగా తెలుగు’ యాజమాన్యం ఎప్పటికీ ఋణపడిఉంటుంది. ఈ శుభవార్తను మీతో పంచుకునేందుకు నేను సంతోషిస్తున్నాను.
ప్రతి ఎదిగిన మనసులో బాల్యం గుప్తంగా దాగి ఉంటుందట. ఇది నిజం అని, ఈ సంచికలో బాలలకు ఒక ప్రత్యేక శీర్షిక ‘తెలుగుబాల’ పేరుతో ఆరంభిస్తున్నాము అని చెప్పగానే మీరు పంపిన రచనలతో తెలుస్తోంది. పెద్దల రూపంలో ఉన్న పసి బాలలంతా అనేక రకాల రచనలు పంపి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ‘తెలుగుబాల’ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాము.
నాకు హాస్యనటీమణి శ్రీలక్ష్మి గారంటే చాలా అభిమానం. గత ఏడాదిన్నర కాలంగా ఆవిడని వదలకుండా వెంట పడుతుంటే, ఈ నెల ఆవిడ ముఖాముఖి ఇచ్చారు. ఇది ప్రత్యేకం, దైవానుగ్రహం. అలాగే ప్రముఖ చిత్రకారులు గంధం గారితో ముఖాముఖి, అందులో బాపు గారితో తమకున్న అనుబంధం గురించి ఆయన పంచుకున్న సంగతులు తప్పక చదవాల్సిందే. ఒడిస్సీ నృత్యంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న మన తెలుగింటి మందారం ‘రమణ కుమారి’ గారు తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్పిన సందేశం ఎక్కడైనా రాసి పెట్టుకోవాల్సిందే.
‘మా బాపట్ల కధల’ కు మీరు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతాభివందనాలు. మీ అభిమానం మరిన్ని మంచి కధలు అందించే బాధ్యతను నాపై పెంచుతోంది. అనేక కధలు, కవితలు, సీరియల్స్, ప్రత్యేక వ్యాసాలు, ఆధ్యాత్మిక అంశాలతో వచ్చిన కొత్త సంచికను చదివెయ్యండి మరి ! ఇంకెందుకు ఆలస్యం ?
కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని

No comments:

Post a Comment

Pages