భోజరాజు కాలంలో న్యాయంగా ఆలోచించే దొంగలు - అచ్చంగా తెలుగు

భోజరాజు కాలంలో న్యాయంగా ఆలోచించే దొంగలు

Share This

 భోజరాజు కాలంలో న్యాయంగా ఆలోచించే దొంగలు

అంబడిపూడి శ్యామ సుందర రావు 




భోజరాజు గురించి అయన సుపరిపాలన కవుల పోషణ వంటి విషయాల గురించి మనకు చాలా కధలు ఉన్నాయి ఆ కధలు నేటికీ ప్రచారము లో ఉన్నాయి  అయన  పాలనలో ప్రజలు అందరు ధర్మ బద్దంగా నీతి  గా నడుచుకునే వారు కుటుంబ పోషణకు దొంగతనాలు చేసే దొంగలు కూడ ధర్మ బద్దంగా అలోచించి దొంగ సొత్తును ఎలా ఖర్చు పెట్టాలో చర్చించడం ఈ కధలో మనము చూస్తాము.  భోజరాజు తరచుగా తన పాలన గురించి ప్రజల కష్ట సుఖాల గురించి తెలుసుకోవడానికి స్వయంగా మారు వేషాల్లో రాత్రులందు నగరములో సంచరించేవాడు  అసందర్బంగా ఆయనకు కలిగిన అనుభవమే ఈ కథ.  

ఒకనాటి రాత్రి భోజరాజు మారు వేషములో నగరము లో సంచరిస్తున్నప్పుడు ఒక ఇంటిలో దొంగతనం జరుగుతున్నట్లు అనుమానం వచ్చి  అక్కడ ఏమి జరుగుతుందో అని గమనించసాగాడు ఆ ఇంటిలోని వారు కొన్ని రోజులుగా ఇంట్లో లేనట్లుంది. ఇద్దరు దొంగలు వారు ఇంటిలో దోచుకున్న సొత్తును మూటగట్టి ఊరి చివర ఉన్న మామిడి తోటలోకి వెళ్లి ఆ  సొత్తును సమానంగా పంచుకుందామని అనుకుంటూ ఉండగా వారికి నగరంలో గస్తీ తిరుగుతున్నా రక్షక భటుల నగారా ధ్వనులు వినిపించాయి ఆ సమయములో బయటకు వెళితే రక్షక భటులకు చిక్కితామని భయపడి ఆ ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి అక్కడే సొత్తును పంచుకుందామని నిర్ణయించుకున్నారు. చీకటిగా ఉన్నందువల్ల వారు భోజరాజును గమనించలేదు కానీ భోజరాజుకు వారి చేష్టలు కనిపిస్తున్నాయి వారి మాటలు వినిపిస్తున్నాయి. పంపకాలు పూర్తి అయినా బయటకు వెళ్ళటానికి సమయం అనువుగా లేదు అని అక్కడే ఉండి మాట్లాడుకోవడం ప్రారంభించారు. 

మొదటిదొంగ మరాలుడు రెండవ దొంగ శకుంతుడిని నీ వాటా సొమ్ముతో ఏమి చేద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు దానికి జవాబుగా ,"మరాలా వేదాలు నాలుగు అని విన్నావా వాటికి ఏ విధమైన పుస్తకం లేదు గురువుగారి ద్వారా శిష్యులు వల్లే వేస్తూ ఆ వేదాలను నేర్చుకుంటున్నారు వారి నుండి వారి శిష్యులకు  అలా వేద సంపద వ్యాప్తి చెందుతుంది కానీ కొన్నాళ్ళకు ఆ వేదం సంపద సరిఅయిన గ్రంథ రూపములో లేకపోవడం వల్ల నిష్క్రమించవచ్చు అందువల్ల నా వాటా సొమ్మును వేదం పండితులకు ఇచ్చి వేదాలను సంరక్షించే భాద్యత వారికి అప్పజెప్పుదామనుకుంటున్నాను "అని శకుంతుడు చెపుతాడు వేదాల పట్ల వేదం సంరక్షణ వ్యాప్తి పట్ల ఆ దొంగకు ఉన్న అభిమానానికి భోజరాజు సంతోషిస్తాడు "శకుంతా! నువ్వన్నది నిజమే కావచ్చు. అయితే నువ్వు సొంతంగా ఆర్జించిన సొమ్ముని దానం చేయడం సరి ఔతుందేమో కానీ, ఇలా తస్కరించిన సొత్తును ఇవ్వడం ధర్మమౌతుందా? అదీ వేదపండితులకి?" అని సందేహం వెలిబుచ్చాడు మరాలుడు.

మరాలా! "దానం భోగో నాశ స్థి స్రో భవంతి గతయో హి విత్తస్య! యో న దదాతి, న భుంక్తే, తస్య తృతీయా గతి ర్భవతి!! ఏ వ్యక్తి అయినా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్జించాలి కుటుంబ పోషణకు ఖర్చు చేయగా మిగిలిన సొమ్మును అర్హులైన వారికి దానం చేయాలి లేదా తానె సక్రమమైన పద్దతిలో అనుభవించాలి ఆవిధంగా చేయలేని వారి సొమ్ము ఈ విధంగానే నష్టం జరుగుతుంది ఈ ఇంటి వాడు పిల్లికి బిచ్చం పెట్టడు ఎవరికీ ఏ మాత్రం   దానం చేయడు  తానూ అనుభవించడు  వాడిని చుస్తే వాడికే బిచ్చం వేయాలనిపిస్తుంది అందుకే అందుకే వీని ఇంటికి ముహూర్తాన్ని పెట్టి నిన్ను పిలిచాను. ఇలా దొంగసొమ్మును దానం చేయడమా?" అన్నావె! విను ఇలాంటి నికృష్టుని ఇంట దొంగతనం చేసేది నా కోసం కాదు. వేదాన్ని ఉద్ధరిస్తున్న వేదపండితులకోసం. దురదృష్టవశాత్తు దొంగగా దొరికితే శిక్ష మాత్రం వారికి కాదు. నేననుభవించడం కోసం. ఈ అపహరించిన ద్రవ్యంలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకోను" అన్నాడు శకుంతుడు.

మరి నీవు నీ సొత్తుతో ఏమి చేయదలచుకున్నావు? అని శకుంతుడు  మరాలుడిని  అడుగుతాడు దానికి సమాధానంగా మరాళుడు," "మరణం మంగళం యాత్ర దర్శనం పాపనాశనం!,కౌపీనం యాత్ర కౌశేయం సా కాశీ కేన మీయతే?అంటే ఇతర ప్రదేశాల్లో మరణం అశుభం కానీ కాశీలో శుభం అలాగే స్మశానం అంటే అశుభం కానీ కాశీ మహాశ్మశానం గా పిలబడే పుణ్యప్రదేశం ,కాశీని చుస్తే పాపాలన్నీ నశిస్తాయి. ఇతర ప్రదేశాల్లో గోచి పెట్టుకుని తీరేవాడికి ఏ మాత్రం గౌరవం ఇవ్వరు కానీ కాశీలో అటువంటి వ్యక్తి కాళ్లకు నమస్కరిస్తారు అలాంటి కాశీ క్షేత్రాన్ని దర్శించడం చాలా పుణ్యం నా తల్లిదండ్రులను కాశికి తీసుకుపోగలిగేంతటి స్థోమతతో లేను. మాకెఱిఁగిన ఒక కుటుంబం కాశీకి పోతోందని తెలిసింది.కానీ వారికి కూడా కాశీకి వెళ్లగలిగేటంత స్తొమత లేదు అందుచేత ఈ సొమ్మును వారితో నా తల్లిదండ్రులను కాశీకి పంపడానికి వినియోగిస్తాను. అని చెబుతాడు. 

చాటు నుండి ఇదంతా వింటున్న భోజుడు ఈ ఇల్లు ఎవరిది అని ఆలోచించగా ఆ ఇంటి యజమాని సంపన్నుడే అయినా  ఇంటి పన్ను కట్టకుండా రాజదండన ను అనుభవించిన వాడు ఇంటి పన్ను ఎగగొట్టటానికి నిరుపేద వలె నటిస్తున్నాడు అని రాజుకు అర్ధమయింది ధర్మకార్యాలు నిమిత్తమై దొంగతనాలు చేస్తున్న ఆ ఇద్దరినీ అసలు విచారించనక్కరలేదని నిర్ణయించుకుని అక్కడనుండి వెళ్ళిపోతాడు మంచి బుద్ధి  కలిగిన దొంగలు ఉండటం విశేషం అయితే అటువంటి దొంగలకు శిక్ష లేకుండా చేయడం భోజరాజు లోని విశేషం. 

No comments:

Post a Comment

Pages