Saturday, October 24, 2015

thumbnail

పుస్తకం

పుస్తకం

పోడూరి శ్రీనివాస్ 


అక్షర సుమాల అందమైనహారం –పుస్తకం
విద్యార్ధుల వాణి అందించిన
అపురూపమైన కానుక – పుస్తకం
మనిషి మేధకు పదును పెట్టే
పజిల్స్ తో నిండిన అందమైనది – పుస్తకం!!
వర్ణక్రమాలతో మొదలుపెట్టి
అక్షరమాలతో ముగిసేది
అందమైన పుస్తకం
సుమాలహారంలో వివిధ
వర్ణాల పూలు, వివిధ సువాసనలు
భాగామయినట్లుగా వివిధ ప్రక్రియలు -
కథలు,కవితలు, నవలలూ, నాటకాలు,
వ్యాసాలు,హైకూలు,నానీలు,నాటికలు,
నవలికలు....ఎన్నెన్నో పద్ధతులు
ప్రక్రియలు, ప్రయోగాలు –
పుస్తక రచనలో భాగాలే!
పస్తుండైనా ఒక మంచి పుస్తకం
చదువుకో!... అన్నాడో మహాజ్ఞాని
పుస్తకానికున్న విలువ అటువంటిది.
జ్ఞాన సమృద్ధ భాండాగారం – పుస్తకం
సకల భాషల సమన్వయ హారం – పుస్తకం
అచ్చు నుంచి బయటకు వచ్చిన పుస్తకం
వెదజల్లుతుంది చక్కని పరిమళం
రెపరెపలాడే క్రొత్త కరెన్సీ నోటు లాగ
బాలసాహిత్యం,వనితారంగం,ఫేషన్లు,
వంటలు,పరిశోధనలు, ప్రేమకథలు,
వాస్తవిక కథలు,భావకవిత్వం,విషాద గ్రంథం,
ఎన్నెన్నో అనుభూతలనందిస్తుంది – పుస్తకం!!
పుస్తక భాండాగారం దేవాలయమైతే
అందులోని పుస్తకాలన్నీ దేవతలు
మనిషి విజ్ఞానాన్ని పెంపొందించేది పుస్తకం
మానసిక వికాసాన్ని కలిగించేది పుస్తకం
          చిన్నతనంలో అలవాటయితే పుస్తక పఠనం
          జీవితాంతం కొనసాగుతుంది –
          జీవనప్రయాణంతో బాటు...
ఎత్తుపల్లాల జీవనగమనంతో...
ఎంతో వింత వింత అనుభూతులతో...
మనిషి జీవితం అనే రచన
రకరకాల మలుపులు తిరుగుతూ
ఉత్కంఠ కలిగిస్తూనే ఉంటుంది!!
పిల్లలకు బాల్యంలో గోరుముద్దలు
తినిపిస్తూ పాడే – చందమామ రావే...
పుస్తకంలోంచి గ్రహించిందే
శిశువుగా ఉన్నపుడు పాడే
లాలి పాటలూ – సుందర సాహిత్యమే...

పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు –
బాధైనా ... భారమైనా...మరచి పోయేటందుకు –
గణితమైనా – రసాయన శాస్త్రమైనా –
చరిత్రైనా – జీవ శాస్త్రమైనా –
ఆర్ధిక శాస్త్రమైనా – ఆరోగ్య శాస్త్రమైనా –
సంగీతమైనా – సాహిత్యమైనా –
భాషేదైనా –
పుస్తకంలో భాగాలే...
మన మస్తిష్కాన్ని గిల గిల కొట్టే
అద్భుత భాండాగారాలే ...
భాషతో ముడిపడింది – పుస్తకం!!
భాష బ్రతకాలంటే
విరివిగా రచనలు రావాలి
పుస్తకరూపంలో దేశం
నలుమూలలా తన పరిమళాలు వెదజల్లాలి
భాషను బ్రతికించుకోవాలి
మనమంతా పుస్తక పఠనం చేయాలి
ఈనాడే అందరూ ప్రతిన పూనండి
రోజుకో పేజైనా చదవకుండా
నిద్రపోనని – నినదించండి!!

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information