కురు వంశములోని ఏకైక ఆడబడుచు "దుస్సల" - అచ్చంగా తెలుగు

కురు వంశములోని ఏకైక ఆడబడుచు "దుస్సల"

Share This

కురు వంశములోని ఏకైక ఆడబడుచు "దుస్సల"

అంబడిపూడి శ్యామ సుందర రావు 




దుస్సల 100 మంది కౌరవుల ఏకైక సోదరి పాండవులకు కూడా సోదరే ఆ విధంగా దుస్సలకు 106 గురు సోదరులు ఉన్నట్టేధృతరాష్ట్రుని కుమార్తె అయిన దుస్సల సింధు మరియు సౌవీర దేశాల రాజు అయిన జయధ్రదుని(సైన్ధవుడు) వివాహ మాడింది ఈ జయధ్రదుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో హతం అవుతాడు ఆ విధంగా దుస్సల విధవరాలు అవుతుంది కురుక్షేత్ర యుద్ధం అనంతరం దుస్సల ప్రస్తావన అశ్వమేధ పర్వం లో వస్తుంది యుద్ధం అనంతరం ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలని నిర్ణయిస్తాడు ఈ యాగా నిర్వహణకు యాగములో పాల్గొన్న బ్రాహ్మణులను తృప్తి పరచడానికి చాలా డబ్బు అవసరం కాబట్టి ఇతర రాజ్యాలపై దండెత్తి డబ్బు పోగు చేయాలనీ నిర్ణయిస్తాడు ధర్మరాజు అశ్వం వెంబడి ఇతర దేశాలను జయించడానికి వేద  వ్యాసుని సలహామేరకు  అర్జునిడిని పంపాలని నిర్ణయిస్తాడు. 

అర్జునుడు వెంట రాగ ఆ అశ్వం అనేక రాజ్యాలలో అడుగు పెడుతుంది ఎవరైనా ఆ అశ్వాన్ని బంధించిన లేదా అడ్డగించినా దానికి రక్షణ గా ఉన్న అర్జునుడు వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు కురుక్షేత్ర యుద్ధం తరువాత చాలా రాజ్యాలు  తరువాతి తరం రాజుల ఏలుబడిలో ఉన్నాయి ఈ రాజ్యాల రాజుల తండ్రులు చాలా మంది కురుక్షేత్ర చనిపోయారు   ప్రస్తుత రాజులు అంటే వారి సంతతి దుఃఖంలో ఉంటారు కాబట్టి ధర్మరాజు వారిని యుద్దములో చంపవద్దని అర్జునుని తో చెపుతాడు ఆ విధంగానే అర్జునుడు వారిని చంపకుండా మంచిమాటలతో వారు లొంగి పోయేటట్లు చేస్తాడు. ఆ విధంగా చాల తక్కువ మందిని చంపి తన జైత్ర యాత్రను చేస్తూ ఉంటాడు. 

అశ్వం సింధు రాజ్యాములో ప్రవేశిస్తుంది సింధు రాజు (సురధుడు అంటే జయద్రదుని కుమారుడు) అశ్వాన్ని బంధించి అర్జునుడితో తో తలపడాలి అని భావించి తన సైన్యాన్ని సిద్దం చేస్తాడు  సింధు దేశ సైనికులు అర్జునునితో గట్టిగానే తలపడతారు ఎందుకంటే రాజుకు ఆ సైన్యానికి అర్జునుడు జయద్రదుని చంపాడు కాబట్టి పగ  తీర్చుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. జయధ్రదుడు అరణ్యవాసములో ఉన్న పాండవుల పత్ని ద్రౌపదిని బలాత్కారం చేయబోగా పాండవులు వచ్చి చంపబోతే ధర్మరాజు మన సోదరి దుస్సల భర్త కాబట్టి వదిలేయమని చెబుతాడు భీముడు జయద్రదుని అవమానించి వదిలివేస్తాడు అవమాన భారము తో ఉన్న జయధ్రదుడు తపస్సు చేసి పాండవులను (అర్జునుడిని తప్ప) యుద్దములో నిలవిరించే వరం పొందుతాడు అదే వార ప్రభావం వల్ల కురుక్షేత్ర యుద్దములో అర్జునుడు లేని సమయములో పద్మవ్యూహం ఏర్పాటు చేసినప్పుడు జయద్రధుడు పద్మవ్యూహము లోకి అభిమన్యుడు ప్రవేశించినాక మిగిలిన పాండవులను అడ్డుకుంటాడు ఫలితంగా అభిమన్యుడు ఒంటరి వాడు అయి పద్మవ్యూహములో చనిపోతాడు అర్జునునికి విషయం తెలిసి సూర్యస్తమయము లోపు జయద్రదుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి జయద్రదుని సంహరిస్తాడు అందువల్ల జయద్రదుని కుమారునికి తన తండ్రి చావుకు కారణమైనఅర్జునుని  చంపాలని పట్టుదలగా ఉంటాడు అశ్వమేధయాగం లో అశ్వం వెంబడి అర్జునుడు వస్తున్నదని తెలిసి అర్జునుడితో యుద్ధం చేసి చంపాలని అనుకుంటాడు 

 అర్జునుడు మంచి మాటలతో యుద్ధము మానమని సలహా ఇస్తాడు మాట వినక పోవడం తో అర్జునుడు యుద్ధం తీవ్రం చేసి చాలా మంది సైనికులను సంహరిస్తాడు. అటువంటి పరిస్తుతులలో దుస్సల తన మనుమడితో యుద్ధ భూమికి వచ్చి అర్జునుడిని యుద్ధం ఆపమని ప్రాధేయ పడుతుంది తన కొడుకు అంటే మనుమడి తండ్రి సురదుడు అర్జునుడు అశ్వము వెంబడి వస్తున్నాడని తెలిసి చనిపోయాడని కాబట్టి ప్రస్తుతం తామందరు దుఃఖం లో ఉన్నామని చెబుతుంది. 

దుస్సల అర్జునుడితో ప్రస్తుతం ఉన్నటువంటి మనవడి తాత జయద్రధుడు  పాండవుల పట్ల తప్పు చేసాడు కానీ ఈ పిల్లవాడు అమాయకుడు ఏ పాపము ఎరుగని వాడు కాబట్టి ఆ పిల్లవాడిని వదిలేయమని చెప్పి సింధు సైనికులను యుద్ధం విరమించమని ఆజ్ఞాపిస్తుంది  అర్జునుడు తన సోదరిని కౌగలించుకొని ఆవిడను ఓదార్చి తన సైనికులను యుద్ధము ఆపమని ఆజ్ఞాపించి అక్కడ నుండి మరో రాజ్యం వైపు తన దండయాత్ర కొనసాగిస్తాడు. ఆ విధంగా దుస్సల సింధు రాజ్యానికి రాణిగా ఉంటూ తన మనుమడికి   సంరక్షురాలి గా ఉంటుంది.

No comments:

Post a Comment

Pages