శ్రీ కృష్ణుని సంతానం
అంబడిపూడి శ్యామసుందర రావు

శ్రీ కృష్ణుడు అంటే సాక్షాత్తు అవతార పురుషుడు ప్రతి యుగంలో దుష్ట శిక్షణ కోసం భగవంతుడు భూమి మీద అవతరిస్తాడు ఆక్రమములోనే భగవంతుడు ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి నందుని ఇంట యశోద గారాల బిడ్డగా పెరిగాడు కృష్ణుడు పుట్టిన రోజునుంచి అయన లీలలు చూపిస్తూ పూతన లాంటి రాకసులను బాల్యము లోనే చంపాడు ప్రస్తుతం శ్రీకృష్ణుడు మనిషిగా పుట్టి వివాహాలు చేసుకొని సంసారిక జీవితాన్ని గడిపాడు కాబట్టి ఆయనకు గల అష్ట భార్యల ద్వారా కలిగిన సంతానం గురించి తెలుసుసుకుందాం.
శ్రీ కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది సంతానం పుట్టారు. శ్రీ కృష్ణుని పట్టమహిషి రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. వీరిలో ప్రద్యుమ్నుడు, కామదేవుని అంశగా చెపుతారు ఈయన రుక్మవతిని వివాహమాడాడు వీరి కొడుకే అనిరుద్ధుడు ఇతను బాణాసురుని కూతురైన ఉషను పరిణయమాడాడు
అలాగే శ్రీకృష్ణుని ముద్దుల సతి సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.సత్రాజిత్తు శమంతకమణి విషయములో శ్రీ కృష్ణుడు జాంబవంతుని ముష్టి యుద్దములో ఓడించి జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.ముఖ్యంగా సాంబుడు అంటే ఉన్న ప్రేమ వల్ల అనేక ఇబ్బందులు వచ్చేవి చివరకు సాంబుడు వల్ల యదు వంశ నాశనము జరిగింది
నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది. కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి. ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది..



No comments:
Post a Comment