శివం- 132
శివుడే చెబుతున్న కథలు
రాజ కార్తీక్
దర్శకుని కధ 39
నేను అనగా శివుడు
(కార్తికేయుడు సమాధి స్థితిలో ఉండటం.. తన కథ కొనసాగించడం.. కుండల చక్రం మీద నేను ప్రత్యక్షమవడం.. కుండన్న ఆనందపడటం. నేను తనతో ఉండి బొమ్మను అడగటం..)
కార్తికేడు కథ చెప్పడం సాగిస్తున్నారు
{
కుండన్న " స్వామి నీవు నాతో పాటు ఇక్కడ ఉండు..
అదే నా కోరిక "
నేను. " సరేనయ్యా! మనిద్దరం ఇక్కడ ఏం చేద్దాం "
కుండన్న " నాకేం తెలియదు స్వామి ! నీవు నాతోపాటు ఉండు "
నేను " అదేనా నీ కోరిక "
కుండన్న " అవును స్వామి! నేను నీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను "
నేను " నాకేం కావాలి నీకేం తెలుసు "
కుండన్న " మా ఊరి గుడిలో చూసా స్వామి, నీకు అభిషేకం చేయటం అంటే ఇష్టం కదా, అది చేస్తాను ఆ తర్వాత ఇక్కడ దొరికే శ్రేష్టమైన వస్తువులతో నీకు ఇష్టమైన నైవేద్యాలు వండి పెడతాను.. నీతో పరాచకాలు ఆడతాను , మీకు సేవలు చేస్తాను.."
నేను " నాకు ఇవన్నీ ఇష్టమని ఎవరు చెప్పారు "
కుండన్న " గుడిలో చేస్తారు కదా స్వామి మీకు ఇష్టం కాబట్టే కదా ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు అందుకే నా చేత ఈ సేవలు చేయనివ్వు స్వామి "
నేను " నీకు జ్వరంగా ఉంది దగ్గు జలుబుగా ఉంది విశ్రాంతి తీసుకోవచ్చు కదా "
కుండన్న " మనిషన్నకా అవన్నీ వస్తాయి స్వామి , కానీ నువ్వు పదే పదే వస్తావా"
నేను " మరైతే ఇప్పుడు ఏం చేస్తావ్ "
కుండన్న " ముందు నీకు నా చేతులతో అభిషేకం చేస్తా స్వామి "
నేను " సరే కానీ నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకో, "
కుండన్న " ఒక్క నిమిషం స్వామి! మీ అభిషేకం చేద్దామని అక్కడున్న చిన్న గుడిసెలో నేను పడుకునే చోటా మీ సిద్ధం చేసి పెట్టాను "
నేను " తీసుకురా , మీ చేత అభిషేకం చేయించుకోవాలని మహా కోరికగా ఉంది "
కుండన్న " ఒక్క నిమిషంలో తెస్తా స్వామి!" అంటూ పరుగున లోపలికి బయటికి వచ్చి కొన్ని కొండల్లో నీళ్లు తెచ్చాడు..
నేను " ఏమిట గట్టిగా ఏర్పాటు చేసినట్టున్నావ్ "
కుండన్న " ముందుగా ఈ నీటితో అభిషేకం చేస్తా "
అంటూ నీటిని నన్ను ఆసనo మీద కూర్చోబెట్టి అందంగా పొద్దికగా నీటి అభిషేకం చేశాడు , తర్వాత పంచామృత అభిషేకం చేశాడు, తరువాత విభూది నీటితో అభిషేకం చేశాడు ..
నా మీద చేసిన అభిషేకం ప్రతిది తీర్థంగా పుచ్చుకొని ఎంతో ఆనందపడ్డాడు
మరి నా ఒళ్లంతా బంకలు సాగుతోoది కదా !
కుండన్న " స్వామి ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేశా ! ఇక్కడ పక్కనే మంచి కొలను ఉంది అక్కడికి రండి స్వామి నాతో "
నేను " పద వెళ్దాం "
విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు త్రిమాతలు , దేవతలందరూ ఈ సంఘటనని ఎంతో ఆనందంగా చూస్తున్నారు ..
నేను " ఏమిటయ్యా చిన్నపిల్ల వాడిలాగా నా చేయి పట్టుకుని లాక్కెళ్తున్నావ్ "
కుండన్న " అది ఏధో కథలో చదివే సామి! వెనక్కి తిరిగి చూస్తే నువ్వు మాయం అయిపోయి శివలింగంలాగా వేలుస్తావు అంట కదా ! అందుకే చెయ్యి పట్టుకున్న "
నేను " క్షేత్ర కథలు మీద బానే పరిశోధన చేశావు"
కుండన్న " అదిగో స్వామి కోలను వచ్చేసింది , " అంటూ తన దగ్గర ఉన్న జింక చర్మంతో పాటు మూటలో ఉన్న కొన్ని వస్తువులు బయటకి తీశాడు
నేను " ఏమిటవి"
కుండన్న " మామూలుగా అభిషేకం చేశాను, ఇప్పుడు మీకు స్నానం చేయిస్తాను "
నేను " ఓహో దానికి వచ్చిన తిప్పల "
కుండన్న ముందుగానే అక్కడ కుండలు చేసే చక్కర లాంటి పెద్ద చక్రం పెట్టాడు రెండు అడుగుల లోతులో ఆ కొలను లో ..
కుండన్న చెయ్ పట్టుకొని ఆ కొలను లోకి నన్ను దింపగానే , చుట్టుపక్కల పక్షులు హంసలు నెమళ్ళు అన్ని ఎంతో ఆనందంగా నృత్యం చేయసాగాయి..
నన్ను ఆ చక్రం మీద కూర్చోబెట్టాడు..
ముందుగా నా త్రిశూలాన్ని చెరువు మట్టితో చక్కగా శుభ్రం చేశాడు. డమరుకాన్ని కూడా చక్కగా శుభ్రం చేశాడు..
కుండన్న " స్వామి నామీద కోపగించుకొని అంటే ఒక చిన్న మనవి "
నేను " నీ మీద నాకెందుకు కోపం ఏమిటో చెప్పు ఏం పర్లేదు"
కుండన్న " అదేదో కథలో చదివాను! అమ్మవారు సరదాగా మీ కళ్ళు మూస్తే జగమంత చీకటి అయిపోయిందట కదా , అప్పుడు అమ్మవారిని మీరు తపస్సు చేయమని శపించారట కదా ! అలా ఇప్పుడు నేను మీకు స్నానం చేసేటప్పుడు ఏమన్నా జరిగితే అలా కాకుండా చూడండి స్వామి "
నేను " క్షేత్ర కథలతో పాటు , పురాణ కథలు కూడా బాగా అధ్యయనం చేసావ్ మొత్తానికి , ఏమి కాదులే కానీ "
కుండన్న "ఎట్లాగో ఉంది ఒక జింక చర్మమే కదా ! " అంటూ చక్రం మీద కూర్చోబెట్టి అటు ఇటు తిప్పుతూ నా మీద నీళ్లు పోస్తున్నాడు
కుండన్న " స్వామి ఈ ప్రపంచంలో చేసే అభిషేకాలు మొత్తం నీ తల మీదకే వస్తాయి కదా చూడు తల ఎట్ట అట్టగట్టుకుపయిందో , ఇలా ఉంటే ఎలా స్వామి ! "
నేను "; ఇక యుగాలుగా నాకు లేని బాధ నీకేందయ్యా "
కుండన్న " అంతేలే ప్రభు ఇప్పుడు శుభ్రం చేసిన మళ్లీ రేపటి నుంచి మొదలు పెడతారు గా భక్తులందరూ "
అంటూ కుంకుడు నీళ్లు నా జటల మీద పోసి శుభ్రంగా రుద్దుతున్నాడు .. అది నా కళ్ళల్లో పడితే ఎక్కడ కళ్ళు మూసుకుంటాననేమో ఇందాక అడిగాడు వరం, జటాజటాలు శుభ్రంగా కడిగాడు
చక్రం అటు ఇటు తిప్పుతూ నా ఒళ్లంతా కొలనులోని మట్టితో మర్దన చేయి సాగాడు ..
దేవతలందరూ మహాదేవుల వారి స్పర్శ భాగ్యం దక్కినందుకు కుండన్న కి ఎంతో ఆనందంతో పాటు అసూయ కూడా చెందారు.. జ్యోతిర్లింగాల స్పర్శ దర్శనం కన్నా ఇది ఎన్ని కోట్ల రెట్లు ఉత్తమమైనది అని కొనియాడారు.
మట్టితో మర్దన చేసిన నన్ను మళ్లీ శుభ్రంగా కడిగాడు..
నేను " ఏమిటయ్యా సరిపోయిందా "
కుండన్న " అప్పుడే "
తను తెచ్చుకున్న సంచిలో పెద్ద పెద్ద తైలా సుగందాలు బయటికి తీశాడు.. ఇక చూడండి, నా ఒళ్ళు మొత్తం చక్కగా తైలం మర్దన చేయసాగాడు , నా జటా జటాల మీద కూడా తైలం పోసి ఎంతో అందంగా ప్రతిదీ శుభ్రపరుస్తున్నాడు..
కుండన్న " కైలాసంలో కనీసం వారానికి ఒకసారి చేపించుకోండి స్వామి "
నేను " వినపడే వాళ్ళకి వినపడితే చాలు " అనగానే మీ పార్వతీ మాత చిలిపిగా నవ్వింది
కుండన్న " ఏమిటి స్వామి "
నేను " భూకాలంలో సమయం వేరు కైలాసంలో సమయం వేరు నాయన ! నీకేం కావాలో చెయ్ "
కుండన్న " స్వామి మీకు తైల సంస్కరణ చేస్తుంటే హాయిగా ఉందా "
నేను " నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం కొండన్న, నీకు జ్వరంగా ఉంది , దగ్గు జలుబుగా ఉంది నీటిలో ఉంటే ఎక్కువవుతుంది నాయన"
కుండన్న " పర్లేదు స్వామి ! నువ్వుంటే నాకు భయమేంటి" అంటూ తన శ్రీవారిని పట్టించుకోకుండా నా శరీరం మీద శ్రద్ధ పెట్టసాగాడు
తరువాత ఈ కేమో మూలికలు బయటికి తీశాడు , వాటితో కాసేపు నా శరీరం అంతా మర్దన చేయి సాగాడు
ఇప్పుడు నీటితో శుభ్రం చేయ సాగాడు
శుభ్రం చేసిన తర్వాత, నా జటా జటలకి చక్కగా సాంబ్రాణి పొగ వేసి ఎంతో ఆనందపడేసాగాడు
అక్కడ నీటిలోని ప్రతిబింబంలో నా రూపం నేను చూసుకున్నాను.. ఇదివరకు పోల్చుకుంటే నిజంగా కొంచెం బాగున్నాను
ఏ మాటక ఆ మాటే నేను అందగాడినే "
}
అంటూ కార్తికేయుడు చెబుతున్న కథని విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వినగా త్రిమాతలు వినగా.. నేను మాత్రం నన్ను నేను ఊహించుకొని .. కథలో శివుడిగా కాకుండా నేనుగా ఈ సన్నివేశాలను మీకు వివరించాను..




No comments:
Post a Comment