మాంసాహారం గురించి భీష్ముడు ధర్మరాజుకు తెలియజేసిన అంశాలు - అచ్చంగా తెలుగు

మాంసాహారం గురించి భీష్ముడు ధర్మరాజుకు తెలియజేసిన అంశాలు

Share This

 మాంసాహారం గురించి భీష్ముడు ధర్మరాజుకు తెలియజేసిన అంశాలు

అంబడిపూడి శ్యామ సుందరరావు 




మన ఆహారపు అలవాట్లను బట్టి మనుష్యులను వృక్ష సంబంధమైన పదార్థాలు ఆహారంగా తీసుకునే వారిని శాఖాహారులు గాను, జంతు సంబంధమైన వాటిని ఆహారంగా తీసుకునే వారిని మాంసాహారులుగాను చెబుతారు కానీ మనిషికి ఉండే దంత నిర్మాణాన్ని బట్టి మనిషి శాఖ హారాన్ని మాంసాహారాన్ని రెండిటిని తినగలడు ఈ రెండింటిలో ఏది మంచిది  అనే మీమాంస ఎప్పటి నుంచో మానవ జాతిని వేధిస్తున్న సమస్య మాంసాహారం ఇష్టపడేవాళ్లు మాంసాహారం మంచిదని శాఖాహారులు శాఖాహారము మంచిదని వాదిస్తూ ఉంటారు అనాగరిక మానవుడు ముందు జంతువులను వేటాడి మాంసాహారాన్ని ఆహారం తీసుకునే వాడు క్రమముగా వేటలో ఇబ్బందులను గుర్తించి నెమ్మదిగా వ్యవసాయంలోకి దిగి శాఖాహారానికి అప్పుడప్పుడు మాంసాహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు అందువల్ల మనిషిని సర్వభక్షకుడు అంటారు. 

ద్వాపర యుగం లో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఎన్నో ధర్మసూక్ష్మాలు వివరిస్తాడు ఆ సందర్భములో  భీష్ముడిని మాంసాహారం మంచిదేనా అని ధర్మ రాజు ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు కీటక వేదవ్యాసుల సంవాదాన్ని ధర్మరాజుకు తెలియజేస్తాడు అది ఏమిటో తెలుసుకుందాము. అంతకు ముందు భీష్ముడిని చూడటానికి దేవగురువు బృహస్పతి ధర్మరాజు  ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు.. ఈ ఆరింటిలో ఏది అత్యుత్తమ మైనదని ప్రశ్నిస్తాడు  అందుకు బృహస్పతి, ఆ ఆరు గొప్పవే కానీ, అందులో అహింస అత్యుత్తమమైనదని  చెప్పి, భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని, దేవలోకానికి వెళ్ళిపోయాడు.. బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు, అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు నిజంగానే అహింస అన్నింటికన్నా గొప్పదా? మరి అహింసకు సంబంధించి, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన సత్యం ఏంటి? 

మాంస భక్షణము మహా పాపము కానీ మాంసం రుచి మరిగిన వారు మాంసాహారాన్ని విడిచి పెట్టరు ,మాంస భక్షణం,  మనో వాక్కాయ కర్మలతో హింస అనేవి చతుర్విద ఘోర పాపాలు. కాబట్టి మాంసాన్ని తినడం  మానేయడం అహింసగా ఆర్యులు విశ్వసించారని భీష్ముడు ధర్మరాజుతో చెబుతాడు విన్న ధర్మరాజు ఒక సందేహాన్ని వ్యక్త పరుస్తాడు ఏమిటి అంటే మాంసం పితృదేవతలకు అత్యంత ఇష్టమని,పితృ కర్మలను మాంసముతో నిర్వర్తించాలని పెద్దలంటారు కదా? అటువంటప్పుడు జంతు వద్ద తప్పనిసరి అవుతుంది కదా అని అడుగుతాడు దానికి సమాధానముగా భీష్ముడు మాంసభక్షణ మానుకోవడం అశ్వమేధయాగం కన్నా గొప్పదని వధించమని చెప్పడం వదించటం రెండు కూడా మహాపాపాలే అని అంటాడు. కానీ పితృ కార్యాలలో యజ్ఞ యాగాదులలో వేద  శాస్త్ర ప్రకారం  చేస్తారు కాబట్టి అటువంటి హింస వల్ల పాపం అంటుకోదు అయితే మాంసము మీద మోజుతో ప్రాణుల్ని చంపి తినడం అది మహాపాపమే అవుతుంది. మాంసం రుచిగా ఉంటుంది కాబట్టి చాల మంది మాంసాహారాన్ని ఇష్టపడతారు అటువంటి రుచికరమైన ఇష్టమైన మాంసాహారాన్ని త్యజించిన  వాడు దేవతలతో సమానమని పెద్దలు చెపుతారు అని ధర్మరాజుతో భీష్ముడు చెబుతాడు.

మాంసము కోసం ఒక ప్రాణిని కత్తితో కోస్తున్నప్పుడు తన శరీరము కూడా అటువంటిదే అనుకున్నప్పుడు మనిషి హింసకు పూనుకోదు మాంసాహారాన్ని విడిచితి పెడితే మనిషిలోని హింసా ప్రవృత్తి దానంతట  అదే తగ్గి పోతుంది. ఆయురారోగ్యాలు కూడా బాగుంటాయి. మాంసాహారాన్ని మానుకున్నారు కాబట్టే దేవతలు రాక్షసులను జయించగలిగారు   దానం, ధర్మం, యజ్ఞయాగాదులన్నీ, అహింస ముందు దిగదుడుపే. నూరు సంవత్సరాలు చేసిన తపశ్చర్యా, మాంసాహారాన్ని మానుకోవడం, రెండూ ఒక్కటే అంటారు  మాంసాన్ని ముట్టని వారికి, బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. కనీసం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజాలలో మాంసాన్ని ముట్టని వారికి, ఆయురారోగ్య బలకీర్తులు, అనాయాసంగా లభిస్తాయని పెద్దలంటారుదానం, తపస్సు, సత్యం, యజ్ఞం, శౌచం, మంత్ర తంత్రాలూ.. ఇవన్నీ అహింసా స్వరూపాలు." అని చెప్పి, భీష్ముడు ముగించాడు. అప్పుడు ధర్మరాజుకు, అహింస వలన కురుక్షేత్రంలో మరణించిన వారికి ఎలాంటి గతులు కలుగుతాయనే అనుమానం కలిగింది. ఆ విషయాన్ని భీష్ముడికి తెలియజేయగా భీష్ముడు జనన మరణాలకు సంబంధించిన కీటక వేదవ్యాసుల మధ్య జరిగిన సంవాదాన్ని, ధర్మరాజుకి తెలియజేశాడు

.రణరంగములో .రథాల కన్నా వేగంగా ఒక కీటకం పరుగులు తీస్తూ రధాలను ను దాటిపోవడాన్ని వేదం వ్యాసుడు గమనించి ఆ కీటకాన్ని ఎందుకు అంత వేగం  అని కారణము అడిగాడు దానికి సమాధానముగా ఆ కీటకం రధచక్రాల కింద పది చనిపోవడం ఇష్టం లేక విపరీతమైన వేగం తో పరుగు తీస్తున్నానని చెప్పింది. ఎప్పుడూ దుఃఖంతో ఉండే నువ్వు, బతికి ప్రయోజనం ఏముంది? చనిపోవడమే సుఖం కదా? బాగా ఆలోచించు.. నీకే అన్నీ తెలుస్తాయి." అని బోధించాడు వ్యాసుడు.మాకు కూడా మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖాలు ఉంది వాటిని అనుభవిస్తున్నాము కాబట్టి చావంటే భయం అని కీటకము అని తన పూర్వ జన్మ వృత్తాంతము చెప్పటానికి సిద్ద పడింది. 

ఓ మహాముని గత జన్మలో నేను ధనవంతుడిని అయినా ఇంకా సంపాదించాలన్న అత్యాశ తో పరుల డబ్బును కాజేస్తూ పెద్దల పట్ల వినయ విధేయతలు చూపక నిర్లక్ష్యముగా వ్యవహరించే వాడీని,కానీ తల్లిని మాత్రము బాగా చూసుకొనే వాడిని.ఒకనాడు ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడికి సపర్యలు చేయడం వల్ల అయన దయతో నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఓ మహాముని పుణ్య కృత్యాల ఆచరణ విశేషాలు దయ చేసి  చెప్పండి. అని ప్రార్ధించింది. . అందుకు వ్యాసుడు, . పాపాలు చేశావు, పురుగుగా జన్మించావు.  అలాగే పుణ్యం చేసి, పూర్వజన్మ జ్ఞానం సంపాదించావు.  ఇకపోతే, నా తపశ్శక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను. బాధపడకు. మానవజన్మ స్వీకరించి, పుణ్యం చెయ్యి ఇంతకూ మునుపు చేసిన పుణ్యం కారణంగా నీకు పూర్వ జన్మ జ్ఞానముతో పాటు నన్ను కలుసుకొని అదృష్టం కూడా కలిగింది మానవ జన్మ లో నీకు పూర్వ జన్మ జ్ఞానము వలన నీకు ధర్మ తత్పరత అలవడుతుంది అని చెప్పి ఆశీర్వదించాడు ఆ కీటకం వ్యాసుని పాదాలను తాకి అక్కడే ప్రాణత్యాగం చేసింది. 

వ్యాసుని ఆశీస్సుల వల్ల ఆ కీటకం మరణానంతరం మానవునిగా అనేక జాతులలో జన్మించి పుణ్యకర్మల ఆచరించి చివరకు  క్షత్రియ వంశములో జన్మించి రాజై భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఒకనాడు వ్యాసమహర్షిని సందర్శించి పాదాలకు నమస్కరించి మహర్షి పక్కన నిలుచున్నాడు రాజు అణుకువ వినయవిధేయతలకు మహర్షి మెచ్చుకొని ,"ఓ రాజా మునీంద్రులకు కూడా ఆశ్చర్యం కలిగించే లాగ తపశ్చర్యకు ఉపక్రమించు తర్వాత గోవుల కోసంగానీ, బ్రాహ్మణుల కోసంగానీ యుద్ధం చేసి, యుద్ధభూమిలో మరణిస్తే, పై జన్మలో బ్రాహ్మణత్వం సాధిస్తావు." అని అన్నాడు. అలా మహర్షి చెప్పినట్టుగానే చేశాడు, ఆ రాజు. బ్రాహ్మణునిగా జన్మించాడు. పుణ్యక్షేత్రాలెన్నో సందర్శించాడు. యజ్ఞయాగాలెన్నో చేశాడు లోకారాధ్యుడయ్యాడు. మరణించి స్వర్గలోకంలో దేవేంద్రునికి మిత్రుడయ్యాడు. కొన్నాళ్ళకు కైవల్యాన్ని అందుకున్నాడు. అని ఆ కీటకం గురించి చెప్పి, ‘ధర్మరాజా! యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారోనని ఆందోళన చెందుతున్నావు. ఏ లోకాలు ప్రాప్తించాయోనని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు సంగతి చెబుతున్నాను, విను. కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ, ఉత్తమలోకాలనే పొందారు. ఈ విషయమై నీకిక ఆందోళన అనవసరం.’ అని తెలియజేశాడు భీష్ముడు.

***

No comments:

Post a Comment

Pages