శివం- 127
(శివుడే చెబుతున్న కథలు)
(కార్తికేయడి తథా కథకల్పనలో భాగంగా.. తన కోరిక మేరకు సాక్షాత్తు భగవంతుడికి తనే కథ చెబుతున్నట్టు శివరాత్రి రోజు నిద్రలోకి జారుకున్నాడు.. ఆ సన్నివేశం ఏమిటంటే సతిమాత నన్ను విరాగి రూపంలో కాకుండా అలంకార రూపంలో చూడాలని కోరుకోవడం.. విష్ణు దేవుడు కైలాసం వచ్చి మీ సతీ మాతను తీసుకెళ్తాం అక్కడ అలంకారీ రూపియై . నేను వెళ్లడం లక్ష్మీదేవి నన్ను ఆట పట్టించటం.. సతీదేవి నన్ను చూసి ఆనందపడటం. ఆ తరువాత కార్తికేయుడు కథ చెప్పలేక నిద్రలోకి జారుకోవడం)
నేను అనగా శివుడు
ఇంకను సీతారామచంద్ర లక్ష్మణుల ముందు హనుమంతుడు ఎలా కూర్చుంటాడు అట్లనే తనువైతంతో మా ముందు కూర్చున్నాడు..
విష్ణు దేవుడు " ఏదైనా మహాప్రభు మీరు తదుపరి సన్నివేశాన్ని ఊహించుకోలేరా"
నేను " అది మన కార్తికేయుడు చెబితేనే కదా "
బ్రహ్మా దేవుడు " జనక విష్ణుదేవ! ఏది అయినా తమ భక్తులు చేత అది వింటేనే భగవంతుడికి ఆనందమని మహాదేవుల వారు మనకి సెలవిచ్చి ఉన్నారు"
అంటూ అందరూ నవ్వుకున్నారు
ఆశ్చర్యంగా ఒక సంఘటన జరుగుతుంది.. మహాదేవుని సంకల్ప ఫలితంగా
ఉచిష్ట స్థితిలో ఉన్న కార్తికేయుడు .. కళ్ళు మూసుకొని .. ఆ కథ ఎక్కడైతే ఆగిపోయిందో .. అక్కడినుంచి చెప్పడం మొదలుపెట్టాడు..
రాజకుమారుడు గా అలంకరించుకొని వైకుంఠానికి వచ్చిన నన్ను మీ సతిమాత చూసిన తర్వాత
కార్తికేయని మాటల్లో
"
లక్ష్మీదేవి " మహాదేవ మీరు మా సతి దగ్గరికి వచ్చే మునుపే మా యొక్క వదిన గారి పేరు తమరు చెప్పవలెను.. అది కూడా లాలగా ముద్దుగా మురిపంగా చెప్పవలెను
.. నేను నా భార్య కోసం వచ్చాను అని చెప్పవలెను అని"భీష్మించుకుని కూర్చుంది
ప్రళయ కాల వృద్ధుడైన మహాదేవుడు ఎలా సిగ్గుపడాలని ఒకసారి ఆలోచించసాగాడు
ఇంతలోనూ ఈ సంబరాన్ని చూడటానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కూడా వైకుంఠానికి విచ్చేశారు ..
బ్రహ్మదేవుడు "మహాదేవ లక్ష్మీ మాత యొక్క ఆజ్ఞను మేము శిరసావా ఇస్తాము మేమందరము ఆమె తరపునే ఉన్నాము "
విష్ణు దేవుడు " మహాదేవ మీరు నా వైపు ఏ రకంగా చూసినను.. మీకోసం ఇంట్లో తగాదా పెట్టుకోవటం నావల్ల కాదు సుమీ "అని చలోక్తి పిసిరారు మహాదేవుడు విష్ణు దేవుడు వైపు తనను తన పక్షం ఊహించాల్సిందిగా కోరుకున్నట్లు చూసిన తర్వాత
ఒక్క ద్విమూర్తులు ఏమిటి .. ఆఖరికి బృంగి నంది కూడా మహాదేవుడి వైపు నిలబడలేదు..
ఇదే అనుకుంటా మొట్టమొదటిసారి మహాదేవుడు వైపు కైలాస ఖండాలు నిలబడకపోవడం
సరస్వతి మాత " ఇక తప్పదు మహాదేవ మీరు మీ యొక్క ప్రతి పేరు చెప్పి " అంటూ నవ్వ సాగింది
మహాదేవుడు " ఇలా అందరూ కలిసి నా మీద తిరుగుబాటు చేస్తే నేను ఏమి చేయగలను.. "
గణాలు" మాత పేరు మీ నోటితో చెప్పండి మహాదేవ"
}
నేను " ఏమీ లేని ఈ విరాగికి ఎంతో ఆనందం కలిగించావు కార్తికేయ.. నిజానికి మానవ సంబంధాలలో ఇటువంటి సంఘటనల వల్లే వారి యందు ప్రేమ అనురాగం ఎంతో గొప్పగా గూడుకట్టుకుంటాయి.. ఏమీ లేని విరాగికి ఎంతో కొంత గొప్ప అనుబంధాన్ని కల్పన చేసి నిజంగా జరిగినట్టు కల్పించావు.. నీ యొక్క. కల్పనకి నేను ఎంతో మురిసిపోయాను.. అందుకే నీకోసం ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ భక్తుడి కోసం చేయని విధంగా సాక్షాత్తు అందరి దేవుళ్ళని నీకోసం తీసుకు వచ్చాను.. ఒక మామూలు మనిషి వలె నీతో మాట్లాడుతూ నీ ప్రేమకు లొంగిపోయాను.. నువ్వు నన్ను ఆట పట్టించిన నామీద చలోక్తులు విసిరిన ఒక స్నేహితుడు వలె ఆనందంగా పూజ వలె స్వీకరించాను.. మీ యొక్క తపస్సు అదే నీ రచనలు కారణంగా నీ జ్ఞాననేత్రానికి మా నిజ స్వరూపాన్ని చూసే అర్హత సమర్థత నీవే సంపాదించుకున్నావు , ఇటువంటి తన్మైత్వంలో ఉన్నావు
కార్తికేయని మాటలు
{
మహాదేవుడు " అలాగే ! " అంటూ ఆవేశంగా మొదలుపెట్టాడు
విష్ణు దేవుడు " స్వామి కనీసం రాక్షసులకి వరాలు ఇచ్చినప్పుడు మాట్లాడినంత ప్రేమగాన్నా మాట్లాడండి"
మహాదేవుడు ఆ చలోక్త కి ఎంతో సేపు చిలిపిగా నవ్వాడు
మహాదేవుడు" నేను నా అర్ధాంగి అయినా , సతీదేవిని తీసుకు వెళ్ళటానికి వచ్చాను"
లక్ష్మీ మాత " ఏమిటి మహాదేవ ఇది! ఏదో యుద్ధానికి సిద్ధమన్నట్టు చెప్పారు ఇది మీ ఆవిడకి నచ్చినా కూడా మాకు ఏమాత్రం నచ్చలేదు మరొక మారు ప్రయత్నించండి
మహాదేవుడు " సోదరీ లక్ష్మి, నీవు అయినా నా పక్షం వహించి ఉండవలసింది.. దాదాపు అందరూ నీ భక్తులే కావడం వల్ల నిన్ను ఎదిరించి ఎవరు నిలబడలేరు.. ఇప్పటిదాకా విరాకీగా ఉన్న నాకు ఇవి చెప్పడమ ఎక్కువ అని
నువ్వు తెలుసుకోవాలి "
లక్ష్మీ దేవి " ఏమి కాదు మహాదేవ! తమరు నాట్య శాస్త్రాన్ని సృష్టించినవారు.. ఆలుమగలు నాట్యమాడినప్పుడు ఎటువంటి భంగిమలు వేయాలి.. ఎటువంటి కవళికలు ప్రదర్శించాలనేది మీకన్నా ఎవరికీ బాగా తెలియదు..
ఇక నీవు నేను ఒకటే అనే ఒక కవళికను గుర్తుతెచ్చుకొని పిలవండి "అని తన అన్న ఓడిపోవడం ఇష్టం లేదు కాబట్టి చెప్పినట్లు చెప్పి ఒక సలహా ఇచ్చింది
దాంతో మహాదేవుడికి ఒక ఉపాయం వచ్చింది
మహాదేవుడు " అలాగే సోదరి ధన్యవాదాలు"
కాసేపు కళ్ళు మూసుకున్న మహాదేవుడు తన యొక్క నాట్య శాస్త్రంలో ఉన్న భంగిమలను ఒక కవళికలని అన్నీ గుర్తు చేసుకుని
"దేవి సతి , నా యందు నీకు అర్ధ భాగం ఇవ్వటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను.. నా కైలాస రాణి వై, ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఆదిదంపతులు నీవే నేనే అని గ్రహించి, నా అర్ధాంగి వై, నేను ఎక్కడ వెలిసినను అక్కడ మరొక రూపంలో నాకు తోడుగా వెలుగుటకు జగన్మాత వై, రాకుమారి అయిన నీవు నా పట్టా మనిషిగా ఈ లోకంలో ప్రజలకి జగన్మాతగా ఉండటానికి నిన్ను నేను నా కైలాసానికి ఆహ్వానిస్తున్నాను"
అని అనేసరికి అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టారు
సతీ మాత మాత్రం "అబ్బో మహాదేవుల వారికి ఇంత గొప్ప కావ్యాత్ముక హృదయం ఉన్నదా "అని కళ్ళు పెద్దవి చేసి చప్పట్లు కొట్టింది
}
ఇది విన్న అమ్మవారి కూడా నిజమే కదా అతని కథలో రాసింది నా మనసులో భావన కూడా అని మహాదేవుని వైపు చిలిపిగా నిట్టూర్పుగా చూసింది
{
లక్ష్మీదేవి కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతూ
" మీ పిలుపు బాగుంది కానీ మహాదేవ ఆయనను సతిని మేము పంపించాము"
అదేమి తిరకాసు అని త్రిమూర్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు
బ్రహ్మ గారి మిగిలిన తలలను సతీ మాత సరస్వతి దేవి చూశారు
లక్ష్మీ మాత " అంతా బానే ఉంది గాని మరి ఆడపడుచు లాంఛనాల గురించి మాట్లాడే వారెవరు"
మహాదేవుడు " అదేమిటి సోదరి ఎవరికీ ఏ లాంఛనాలు ఇవ్వాలని అది నువ్వే ఇవ్వాలి.. అంతదనం ఉంది నీకే ప్రసాదించాను కదా.."
లక్ష్మీ మాత " అయితే లాంచనాలు లేవంటారా"
సరస్వతి మాత " నాకు కూడా లంచనాలు కావాల్సిందే "
అందరూ లాంఛనాలు ఏమి ఇవ్వాలని కోరుకో గా..
దానికి లక్ష్మీ సరస్వతి మాత లు
"సతిని పూర్తి ఆదిశక్తిగా మార్చవలెను అని వరంగా కోరుకున్నారు"
అలాగని ఒప్పుకున్నారు..
}
అంటూ తన్మైత్వంలో ఉన్న కార్తికేయుడు తన సన్నివేశం చెప్పటం ముగించుకున్నాడు .
సన్నివేశ విన్న త్రిమాతలు త్రిపితలు కూడా ఆహ్లాదంగా ఉన్నారు..
విష్ణు దేవుడు " మహాదేవ వచ్చిన పని మొదలు పెడదామా "
నేను "బాబు కార్తికేయ వచ్చిన దగ్గర నుంచి తన్మయిత్వంలో ఉన్నావ్ ఇకలే.. నువ్వు దర్శకత్వం చేసే సమయం వచ్చింది. ఇక నీకు ఏ అడ్డంకులు ఉండవులే.. ముందు మాకు కథ చెప్పి, ఇక మొదలు పెట్టు దర్శకత్వం నీది పూర్తిస్థాయిలో, దిగ్గజ దర్శక.."
అంటూ మా యొక్క పూర్తి అనుగ్రహాన్ని కార్తికేయనికి ఇచ్చాము.
***
No comments:
Post a Comment