దేవుడు అందరికి కనిపిస్తాడు
చందలూరి నారాయణరావు
9704437347
నా చిన్నప్పుడు చూసిన
గుడి గొప్ప నిజం
దేవుడు మంచివాడు
పూజ తీయని పని
నమ్మకం బలంగా భక్తి పటిష్టం
దేవుడు, మనిషి మధ్య
పచ్చని బంధంతో సరదా, సందడి.
నేను పెద్దయ్యాక చూస్తున్న
గుడి గొప్ప అవకాశం
దేవుడు అవసరానికి ఓ పేరు
పూజ ఓ వ్యాపారం
నమ్మకం ఓ స్వార్దం
భక్తిది రోజుకో వేషం
దేవుడు మనిషి మధ్య ఎన్నో ఒప్పందాల
తారతమ్యాలతో మధ్య భేదం
డబ్బు లేని రోజుల్లో
ధర్మం భక్తిని నడిపించింది
డబ్బు సృష్టించిన లోకంలో
దేవుడిని ధనం నడిపిస్తుంది.
కాలంలో మార్పుతో
మనిషి నైజంలో నిజం దారి తప్పింది.
గర్భ గుడి అంతా రాజకీయ కాలుష్యం
అడుగు అడుగులో డబ్బుదే రాజ్యం.
పేదోడి భక్తిలో భయం కొద్దీ
ఖర్చును దాచుకుని
అష్టకష్టాలతో కొలిచి భరిస్తు తరిస్తున్నాడు
డబ్బున్నాళ్లు అహంతో
ఇష్టం వచ్చిన రీతిలో
ప్రియమైన పూజలతో సంతోషపడుతున్నారు.
అందుకేనేమో దేవుడు అప్పుడప్పుడు
కాలంతో నిజాన్ని మాట్లాడించి
మనిషి తప్పులను ఎత్తి చూపుతున్నాడు.
ఐనా మనుషులు
మనుషులని అర్ధం చేసుకోవడం లేదు.
మనిషి తప్పును గుర్తుపట్టడం రావడం లేదు
గుడికి మనిషికి గోడ లేకుండా
ఎత్తు పీటలు లేకుండా
డాబు దర్పం లేకుండా
మనిషి మనసు పెట్టీ ఆలోచిస్తే బాగుండు.
హుండీ లేకుండా
హుందాగా గుడిని చూడలేమా?
టికెట్ లేకుండా పూజలో
దేవుడిని తృప్తిగా కొలవలేమా?
దేవుడి రుచి
అందరికి సమానంగా అందేలా
దేవుడు అందం
అందరూ సమానంగా పంచుకునేలా
మనుషులు "మనిషి" లా ఆలోచిస్తే
గుడి దూరం తరిగి
దేవుడు దగ్గర పెరిగి
దేవుడు అందరిలో అందరికీ కనిపిస్తాడు.
...
No comments:
Post a Comment